Political News

వైసీపీకి క‌లిసి వ‌స్తున్న మూడు విష‌యాలు.. !

ఏపీ అధికార పార్టీకి క‌లిసి వ‌స్తున్న అంశాలు ఏంటి? వ‌చ్చే ఎన్నికల్లో పార్టీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న అంశాలు ఏంటి? అనే విష‌యంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దీనికి నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. మూడు విష‌యాలు వైసీపీకి క‌లిసి వ‌స్తున్నాయ‌ని చెబుతున్నారు. ఈ మూడు అంశాల‌ను బ‌లంగా తీసుకువెళ్తే.. ఇక‌. వైసీపీకి తిరుగు లేద‌ని అంటున్నారు. అవేంటంటే ఒక‌టి.. జ‌గ‌న్ నాయ‌క‌త్వం.. పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అయింది. నిజానికి ఎంతో …

Read More »

బీజేపీలో చేరనున్న వీవీఎస్ లక్ష్మణ్ ?

టీమిండియా మాజీ క్రికెటర్‌, తెలుగు తేజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ గురించి క్రికెట్ ప్రేమికులకు, క్రీడాకారులకు పరిచయం అక్కర లేదు. భారత జట్టులో చాలాకాలం పాటు కీలక ఆటగాడిగా కొనసాగిన లక్ష్మణ్…ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లతో జట్టుకు చరిత్రాత్మక విజయాలనందించాడు. ఆసీస్ పై టెస్టులో జట్టు ఫాలో ఆన్ ఆడుతున్న క్లిష్ట సమయంలో ఈ వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్ మన్ తన సొగసరి షాట్లకతో చేసిన డబుల్ సెంచరీ చరిత్ర …

Read More »

లోకేష్ ఎదుగుద‌ల‌కు అడ్డంకి ఎవ‌రు?

టీడీపీలో ఒక ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్‌.. ఎందుకు ఎద‌గ‌లేక పోతున్నారు? సాహ‌సించి ఏ కార్య‌క్ర‌మాన్నీ ఎందుకు చేయ‌లేక పోతున్నారు? తెర‌వెనుక ఏం జ‌రుగుతోంది? అనే అంశాల‌పై పెద్ద ఎత్తున త‌మ్ముళ్ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో అస‌లు ఏం జ‌ర‌గాలి..? లోకేష్ గురించి పార్టీలో పెద్ద‌లు ఇస్తున్న స‌ల‌హాలు ఏంటి? ఆయ‌న …

Read More »

వివేకా మృతికి ఆ నలుగురే కారణమంటోన్న సీబీఐ

ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే ఈ కేసులలో అనుమానితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపిన సీబీఐ అధికారులు….తాజాగా మరో కీలక అడుగు వేశారు. వివేకా మర్డర్ కేసులో తాజాగా పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు …

Read More »

షాకింగ్: కాంగ్రెస్ పై ‘కెప్టెన్’ మరో వార్

పంజాబ్ రాజకీయాలలో కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీపీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుండడంతో కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా కెప్టెన్ రాజీనామా చేయడం, ఆ తర్వాత సిద్ధూ కూడా తన పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లో లుకలుకలు బజారునపడ్డాయి. ఈ ఇద్దరికి కాకుండా …

Read More »

చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్‌.. మరోసారి కలుద్దామన్న షా

మాజీ సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు. ఏపీలో ప్రస్తుతమున్న పరిస్థితులపై ఆయన ఆరా తీసినట్లు సమాచారం. ఇటీవల ఏపీలో జరిగిన పరిణామాలపై అమిత్‌షాకు చంద్రబాబు ఫోన్ చేసి వివరించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్ చేశారు. కశ్మీర్ పర్యటన నుంచి మంగళవారం ఢిల్లీకి వచ్చానని తెలిపారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా కలవలేకపోయానని అమిత్‌షా వివరించారు. మరోసారి కలుద్దామని ఫోన్‌లో కేంద్రమంత్రి …

Read More »

బీజేపీకి ప‌వ‌న్ షాక్‌!

ఊహాగానాలు నిజ‌మ‌య్యాయి.. అనుకున్న‌ట్లు గానే పొత్తులో ఉన్న బీజేపీకి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ షాక్ ఇచ్చారు. బీజేపీ ఆశ‌ల‌కు ప‌వ‌న్ తూట్లు పొడిచార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌పున ప‌వ‌న్ ప్ర‌చారం చేస్తార‌ని ఆ పార్టీ నాయ‌కులు భావించారు. కానీ ప‌వ‌న్ మాత్రం అలాంటిదేమీ చేయ‌లేదు. ఆ ఉప ఎన్నిక‌తో నేటితో ప్ర‌చారం గ‌డువు ముగుస్తుంది. కానీ ఇప్ప‌టికీ ప‌వ‌న్ నేరుగా ప్ర‌చారంలో పాల్గొనే …

Read More »

కేసీఆర్ ముందుచూపును మెచ్చుకోవాల్సిందే

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన ఇరవైఏళ్ల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో.. భారీ ఎత్తున నిర్వహించిన ఒక రోజు ప్లీనరీని ఎంత ఘనంగా నిర్వహించారో తెలిసిందే. అంగరంగ వైభవంగా నిర్వహించిన పార్టీ ప్లీనరీ పుణ్యమా అని.. హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రహదారులు మొత్తం గులాబీ మయం కావటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించినా పాలక పక్షం కానీ.. అధికారులు కానీ పెద్దగా పట్టించుకోకపోవటం తెలిసిందే. …

Read More »

అన్నాడీఎంకేలో చిన్నమ్మ చిచ్చు ?

అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకేలో శశికళ అలియాస్ చిన్నమ్మ చిచ్చు పెట్టినట్లే ఉంది. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్ శెల్వం మధ్య శశికళ విషయంలో తాజాగా విభేదాలు మొదలైనట్లుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళను పార్టీలోకి చేర్చుకునే విషయమై పార్టీ తొందరలోనే నిర్ణయం తీసుకుంటుందని పన్నీర్ చేసిన ప్రకటన పార్టీలో సంచలనంగా మారింది. అక్రమాస్తుల కేసులో శశికళ నాలుగు …

Read More »

కేంద్రంపై దర్యాప్తు జరిగే పనేనా ?

దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వంపై విచారణ సాధ్యమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్రం దేశంలోనే వందల మంది ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందనే వార్తలు ఆమధ్య దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఫోన్ల ట్యాపింగ్ పై ఎంతమంది కేంద్రాన్ని ప్రశ్నించినా సమాధానం రాలేదు. దాంతో కొందరు జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు సుప్రింకోర్టులో …

Read More »

హుజూరాబాద్ ఫైనల్ రిజల్ట్ ఇదేనా ?

తెలంగాణలో ఎంతో ఉత్కంఠకు గురి చేస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక అంతిమ ఫలితం ఎలాగుండబోతోందనేది సస్పెన్సుగా మారిపోయింది. రోజుకో మలుపు తిరుగుతున్న ఉపఎన్నిక తీరుతో బెట్టింగుల జోరు విపరీతంగా పెరిగిపోతోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమైతే ఇప్పటికే వందల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందట. పోలింగ్ తేదీ 30 దగ్గరవుతున్నకొద్దీ బెట్టింగ్ జోరు మరింతగా పెరిగిపోతోంది. అందరిలోను అనేక రూపాల్లో టెన్షన్ పెంచేస్తున్న ఉప ఎన్నికలో అంతిమ విజయం బీజేపీ …

Read More »

పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు.. ఇంకా పార్ట్ టైం పాలిటిక్సేనా?

దేనికైనా ఒక కాల‌నిర్ణ‌యం ఉంటుంది. నేడు తాజాగా ఉన్న‌ది రేప‌టికి పాత‌ద‌వుతుంది. ఇప్పుడు ఇదే వ్యాఖ్య‌లు.. జ‌న‌సేన గురించి జోరుగా వినిపిస్తున్నాయి. ఈ పార్టీని కొత్త‌ది అనుకోవాలా? పాత‌ది అనుకోవాలా? అనేది చ‌ర్చ‌. ఎందుకంటే..పార్టీ పెట్టి 8 సంవ‌త్స‌రాలు అయింది. ఇప్ప‌టికీ పార్టీకి బూత్ స్తాయిలో కార్య‌క‌ర్త‌లు లేరు. క‌మిటీలూ లేవు.. ఇటీవ‌ల‌.. హైద‌రాబాద్లో జిల్లా పార్టీ అధ్యక్షుల స‌మావేశం నిర్వ‌హిస్తే.. అంతా పేల‌వంగా క‌నిపించింది. దీంతో ఫొటోల‌నుకూడా మీడియాకు …

Read More »