ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసి ఘోర పరాజయం మూట గట్టుకున్న ఆ పార్టీ 2024 ఎన్నికల్లో మాత్రం మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంతో పాటు కాపు సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు పవన్ …
Read More »వైసీపీ ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పటికప్పుడూ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక అధికార పార్టీ వైసీపీలోనూ అదే పరిస్థితి ఉంది. ఇప్పుడక్కడ సీఎం జగన్ కొత్తగా ప్రకటించే మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఉంటుంది? ఎవరిని తొలగిస్తారు? ఎవరిని కొనసాగిస్తారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే మంత్రి పదవులపై ఆశ పెట్టుకున్న వాళ్లు ఈ సారి ఆ అవకాశం దక్కుతుందా? అని.. మరోవైపు మంత్రి పదవిలో ఉన్నవాళ్లు పదవి …
Read More »ఎంపీలకు ఉచిత విమాన ప్రయాణం బంద్
ఒక్కసారి ఎంపీ అయితే చాలు ఎన్నో సౌకర్యాలు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని అనేక వ్యవస్ధల్లో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైల్ ప్రయాణాలు ఉచితం, లేదా రాయితీలు ఇలా అనేక సౌకర్యాలుంటాయి. అయితే ఇపుడు అలాంటి సౌకర్యాల్లో కొన్నింటిపై వేటుపడింది. ఇప్పటివరకు విమానాల్లో ఉచితంగా ప్రయాణాలు చేస్తున్న ఎంపీలు ఇకనుండి టికెట్లు కొనుక్కుని ప్రయాణం చేయకతప్పదు. ఎందుకంటే ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్ ఇండియా …
Read More »మమత వ్యూహం.. బీజేపీకే లాభమా?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే కస్సున లేచే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహం కాషాయ పార్టీకి మేలు చేయనుందా? ఇతర రాష్ట్రాలపై దీదీ దృష్టి సారించడం.. బీజేపీకే కలిసి రానుందా? ఆమె కారణంగా కాంగ్రెస్కు దెబ్బ పడనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ చట్టాలపై మొండి …
Read More »షర్మిలకు అదే మైనస్!
రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా.. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల.. తన పార్టీకి మైలేజీ తెచ్చుకోవడం కోసం నానా పాట్లు పడుతూనే ఉన్నారు. నిరుద్యోగ సమస్యను నెత్తినెత్తుకున్న ఆమె.. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పుడిక పాదయాత్రతో ప్రజల మధ్యకు వెళ్లారు. ఆమె పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆమె …
Read More »అమరావతే గెలిచింది.. రైతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వానికి అడుగడుగునా.. అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇక్కడ భూముల వ్యాపారం జరిగిందని.. ఓ సామాజిక వర్గానికే మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారని.. గత టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసి.. మూడు రాజధానులకు రెడీ అయ్యారు. అయితే.. ఈ నిర్ణయాలను.. ఆరోపణలను.. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కొట్టేశాయి. తాజాగా.. అమరావతి మరోసారి విజయం …
Read More »రండి.. ‘బూతుల’ పై చర్చిద్దాం..
చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా ఏపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. పర్యటనలో భాగంగా కుప్పంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన నిప్పులు చెరిగారు. బూతులు ఎవరు మాట్లాడారో.. చర్చించేందుకు మేం సిద్ధం. నీకు(జగన్) దమ్ముంటే.. చర్చకు రా. నువ్వు చెప్పిన చోటకు మమ్మల్ని రమ్మంటావా? లేక మేం …
Read More »ఆ నేత కూడా.. పవన్ను వదిలేస్తారా?
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి జనసేనను స్థాపించిన పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కష్టపడుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్న పవన్ తన సొంత సామాజిక వర్గమైన కాపు ఓట్లను తనవైపు తిప్పుకునేందుకు అడుగులు వేస్తున్నారు. అధికార వైసీపీపై విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం పవన్ ఇంత …
Read More »జల జగడం.. కేసీఆర్కు ఫస్ట్ షాక్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంలో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై స్టే విధించారు. ఇది.. ఇప్పటి వరకు తెలంగాణ దూకుడుగా ఉన్న పరిస్థితికి భారీ షాక్ ఇచ్చినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారు? ఏపీతో మరింత కయ్యానికి కాలు దువ్వుతారా? లేక.. సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. విషయం ఏంటంటే.. పాలమూరు – రంగారెడ్డి …
Read More »జడ్జిలపై బూతులు.. ఆపై కోర్టుకు అబద్దాలు.. హైకోర్టు సీరియస్..!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. గడిచిన రెండున్నరేళ్ల పాలనలో ఇప్పటి వరకు 177 కేసుల్లో హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. అయితే.. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు.. ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకుని.. ఆయా నిర్ణయాలను వెనక్కి తీసుకుని.. సరిచేసుకోవడం అనేది ఏ సర్కారుకైనా.. కనీస ధర్మం. కానీ.. ఘనత వహించిన వైసీపీ సర్కారు మాత్రం.. ఆ పనిచేయలేదు. పైగా.. వైసీపీ నాయకులు.. గతంలో …
Read More »వైసీపీ డిమాండ్ లో అర్ధముందా ?
‘రాజ్యాంగబద్దంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ లాంటి అసాంఘీక పార్టీ ఉండకూడదు’ ఇది తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన డిమాండ్. ఎన్నికల్లో టీడీపీ పాల్గొనకుండా బ్యాన్ చేయాలని తాజాగా సహచర ఎంపీలతో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతోందో ఆధారాలతో సహా ఇచ్చామని విజయసాయి మీడియాతో చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా టీడీపీని అడ్డుకునే అధికారం …
Read More »బాంబ్ పేల్చిన పీకే… రాహుల్ ఇప్పట్లో ప్రధాని కాలేరు!
సోనియాగాంధీ గారాల పట్టి రాహుల్ గాంధీ ఇప్పట్లో ప్రధాని అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే చాలా దశాబ్దాలపాటు బీజేపీనే దేశాన్ని పరిపాలించబోతోంది. ఒక వేళ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే.. అప్పుడు కూడా రాహుల్ గాంధీకి పోటీ లేక పోతే ఆయన జీవిత చరమాంకంలో ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా ఎందుకు చెబుతున్నామంటే.. బీజేపీ రాజకీయ భవిష్యత్తుపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. భారత రాజకీయాల్లో …
Read More »