ఒకపార్టీలో జరిగే డెవలప్మెంట్లు కచ్చితంగా మరో పార్టీపైన కూడా ప్రభావం చూపుతుంది. కాకపోతే ఆ ప్రభావం నెగిటివా లేకపోతే పాజిటివా అన్నదే కీలకం. ఇపుడు బీజేపీలో జరిగిన డెవలప్మెంట్లు కేసీయార్ కు కచ్చితంగా అనుకూలంగానే ఉంటుందని అర్ధమవుతోంది. ఇంతకీ జరిగింది ఏమిటంటే తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బండ సంజయ్ ను తీసేసి సడెన్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. ఈ డెవలప్మెంట్ కేసీయార్ కు బాగా అనుకూలించేదనే చెప్పాలి.
ఎలాగంటే అధ్యక్షుడి ఉన్నపుడు బండి ముఖ్యమంత్రి కేసీయార్ వెంటపడేవాళ్ళు. ప్రతి విషయంలోను కేసీయార్ లేదా ఆయన కుటుంబాన్ని పిక్చర్లోకి లాగి రాచి రంపాన పెట్టేవారు. మర్యాద, హుందాతనం అన్నది బండి మాటల్లో పెద్దగా వినబడేదికాదు. పక్కా మస్ మసాలా మాటలు, డైలాగులు ఉపయోగించేవారు. చాలాసార్లు బండి మాటలు అన్నీ హద్దులను దాటేసేవారు. దాంతో బండి ఉపయోగించిన భాషపై చాలా రాద్దాంతమే జరిగింది.
ఇక కిషన్ విషయం చూస్తే బండిలాగ మాస్ మసాలా భాషను ఉపయోగించలేరు. ప్రత్యర్ధులపై కౌంటర్లు గట్టిగానే వేస్తారు, ధాటిగా పాయింట్ బై పాయిట్ మాట్లాడుతారు. అయితే ఒకస్ధాయికి దిగిపోయి కిషన్ మాట్లాడలేరు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. ఇక్కడే బండికి, కిషన్ కి మధ్య తేడా స్పష్టంగా బయటపడుతుంది. అందుకనే కేసీయార్, ఆయన కుటుంబంపై కిషన్ మాట్లాడే మాటలు, విసిరే పంచులు పెద్దగా ప్రభావం చూపవనే ప్రచారం మొదలైపోయింది.
ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో కిషన్ వేసే పంచులు గట్టిగా ఉండకపోతే ప్రత్యర్ధులపై ఎలాంటి ప్రభావం కూడా చూపవు. పంచులు ప్రభావం చూపకపోతే ఎవరు లెక్కచేయరు. ఇక్కడే కిషన్ కు మైనస్ మార్కులు తప్పవు. బండిని తప్పించి కిషన్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించగానే కేసీయార్ తో పాటు యావత్ బీఆర్ఎస్ నేతలు హ్యాపీగా ఫీలయ్యుంటారు. బండి దూసుకుపోయినట్లు కిషన్ దూసుకుపోలేరు. చెప్పుకోవాలంటే కిషన్లో మైనస్ మార్కులు చాలానే ఉన్నాయి. అందుకనే బీజేపీలో జరిగిన మార్పులు కచ్చితంగా కేసీయార్ హ్యాపీగా ఫీలవుతుంటారనటంలో సందేహంలేదు.