Political News

తెలంగాణ బీజేపీకి ఇది చావు దెబ్బే

దేశవ్యాప్యంతా ఎంతో పేరు ప్రఖ్యాతలున్న సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణాలోని బీజేపీపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రైవేటీకరించాల్సిన అవసరమే లేకపోయినా సింగరేణి గనులను ఎందుకు ప్రైవేటీకరిస్తోందో కేంద్రమే సమాధానం చెప్పాలి. సింగరేణి పరిధిలోని నాలుగు ఓపెన్ కాస్ట్ గనులను ప్రైవేటీకరించబోతున్నట్లు ఈ మధ్య నరేంద్ర మోడీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రభుత్వం+ప్రభుత్వ రంగ సంస్థలను …

Read More »

జ‌గ‌న్‌ న‌మ్మించి మోసం చేశాడు

మ‌ర్రి రాజ‌శేఖ‌ర్. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు. మాజీ ఎమ్మెల్యే. వైఎస్ కుటుంబంతోనూ ఎంతో స‌న్నిహిత సంబంధాలు ఉన్న కుటుంబం. ముఖ్యంగా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో అత్యంత స‌న్నిహిత సంబంధాలు నెరిపిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌.. ఇప్పుడు రోడ్డున ప‌డ్డారు. జ‌గ‌న్ అన్యాయం చేశారంటూ.. స్వ‌యంగా ఆయన బావ‌మ‌రిది బ‌హిరంగ కామెంట్లు చేశారు. జ‌గ‌న్ కోసం తాము ఎంతో చేశామ‌ని చెప్పిన‌.. ఆయ‌న‌.. త‌మ‌ను ఇంత‌గా అన్యాయం చేస్తార‌ని …

Read More »

టీ కాంగ్రెస్‌లో మరో పార్టీ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట‌మి ప్ర‌భావం నుంచి ఇప్పుడిప్ప‌డే బ‌య‌ట‌ప‌డుతోంది. ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ జ‌న్మ‌దినం అయిన డిసెంబ‌రు 9 ఇందుకు వేదిక అయింది. ఈ రోజు ఆ పార్టీ డిజిట‌ల్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ఘ‌నంగా చేప‌ట్టింది. ఇక్క‌డితో ఆగ‌కుండా ఇక‌పై వ‌చ్చే రెండేళ్లు అదే దూకుడు చూపించాల‌ని డిసైడ్ అయింది. మొద‌ట‌గా తెలంగాణ ఇంటి పార్టీని త‌మ వైపు లాక్కోవాల‌ని …

Read More »

జగన్ డెడ్ లైన్ దాటిపోయిందే !

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మంత్రివర్గ ప్రక్షాళన వాయిదా పడినట్లే అని తెలుస్తోంది. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారమైతే ఈనెల 6వ తేదీకి రెండున్నరేళ్ళవుతుంది. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో జగన్ మాట్లాడుతూ రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మార్చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రెండున్నరేళ్లు కాకముందు నుండే మంత్రివర్గం ప్రక్షాళనపై పెద్ద ఎత్తున చర్చలు మొదలైపోయింది. పార్టీలోనే కాకుండా సోషల్ మీడియాలో …

Read More »

బీజేపీ ఎంపీల‌కు మోడీ వార్నింగ్

ఇటీవ‌ల పార్ల‌మెంటు స‌మావేశాల్లో బీజేపీ ఎంపీల‌కు.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బిగ్ వార్నింగ్ ఇచ్చా రంటూ.. మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. పార్ల‌మెంటు స‌భ‌ల‌కు.. బీజేపీ త‌ర‌ఫున గెలిచిన ఎంపీలు హాజ‌రు కావ‌డం లేద‌ని.. ఇలా అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు కూడా ద‌క్క‌వ‌ని ఆయ‌న హెచ్చ‌రించిన‌ట్టు  ప్ర‌చారం జ‌రిగింది. నిజానికి బీజేపీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మోడీ ఇలాంటి హెచ్చ‌రి క‌లు చేయ‌డం ఇది రెండోసారి. …

Read More »

KCR సెల్ఫ్ గోల్ వేసుకున్నారా ?

అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ కూడా పార్లమెంటు సమావేశాల విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు మండిపడుతున్నాయి. వరి రాజకీయంతో దాదాపు వారం రోజుల పాటు పార్లమెంటు సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్లమెంటు వేదికగా ఇటు లోక్ సభ అటు రాజ్యసభలో కూడా ఎంపీలు నానా గోల చేసిన విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళు ఎంత ఆందోళన చేసినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. …

Read More »

జగన్ చేస్తున్నది తప్పన్న అగ్ర నిర్మాత

కరోనా ధాటికి బాగా దెబ్బ తిన్న పరిశ్రమల్లో ఫిలిం ఇండస్ట్రీ ఒకటి. లాక్ డౌన్ టైంలో నెలల తరబడి థియేటర్లు షట్ డౌన్ అయ్యాయి. అలాగే సినీ కార్యకలాపాలు కూడా చాన్నాళ్ల పాటు ఆగిపోయాయి. దీంతో పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. థియేటర్ ఇండస్ట్రీ ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ దెబ్బను తట్టుకోవడమే కష్టం అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ లేని విధంగా టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడం.. …

Read More »

‘ఓబుళాపురం’ కేసులో కేవీపీ.. కోర్టుకు రాక తప్పదా?

KVP

పెను సంచలనంగా మారి.. వైఎస్ హయాంలోని మైనింగ్ శాఖ మంత్రి మొదలు ఆ శాఖకు చెందిన కీలక అధికారి శ్రీలక్ష్మీతో పాటు ఎంతోమందికి తిప్పలు తెచ్చిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి సాక్షి ఒకరు ఇచ్చిన వాంగ్మూలంలో అప్పటి ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన కేవీపీ రామచంద్రరావు పేరును ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన హైకోర్టు.. ఆయన వాంగ్మూలాన్ని ఎందుకు తీసుకోలేదంటూ సీబీఐను.. హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో.. ఈ …

Read More »

ఇందుకే బీజేపీ తుడిచి పెట్టుకోపోయింది

ఏపీ ప్రయోజనాల విషయంలో రాష్ట్ర విభజన చట్టాన్ని నరేంద్ర మోడీ సర్కార్ సాంతం తుంగలో తొక్కేసింది. పార్లమెంటులో లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానంగా రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాధానమిస్తూ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ఆలోచనేమీ అదని చెప్పారు. విభజన కారణంగా అన్ని విధాలుగా దెబ్బతిన్న ఏపీని ఆదుకునేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ లాంటి హామీలు ఇచ్చింది. …

Read More »

6 నెలలే డెడ్ లైన్ – చంద్రబాబు

పార్టీలో కొత్త రక్తం ఎక్కించేందుకు చంద్రబాబునాయుడు 6 నెలలను డెడ్ లైనుగా పెట్టుకున్నారు. కుప్పం మున్సిపాలిటి ఓటమిపై కుప్పం నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు పార్టీ బోలోపేతానికి కొత్తరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం 6 నెలలు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు చెప్పారు. కుప్పంలోనే కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా పనిచేయని నేతలను మార్చేస్తానని స్పష్టంగా చెప్పారు. పార్టీ నేతలను మార్చటానికి రెండు పాయింట్లమీదే ఫోకస్ …

Read More »

జగన్ కి బ్యాడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

“సార్‌! ఏపీలోని నాలుగు జిల్లాలు అత‌లాకుత‌లం అయ్యాయి. వెంట‌నే స్పందించి వెయ్యి కోట్టు సాయం చేయండి!“ అని సీఎం జ‌గ‌న్‌.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వానికి లేఖ‌లు రాసి.. దాదాపు మూడు వారాలు గ‌డిచిపోయింది. అయినప్ప‌టికీ.. కేంద్రం రాష్ట్ర విప‌త్తుల నిధులు వాడుకోండి..అని అప్ప‌ట్లోనే స‌మాధానం చెప్పింది. అయితే.. ఈ విష‌యాన్ని ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో.. వైసీపీ ఎంపీలు నిత్యం కేంద్రం దృష్టికి తీసుకువెళ్తున్నారు. దీంతో కేంద్రం పార్ల‌మెంటు …

Read More »

ముందే చెప్పా.. జ‌గ‌న్ వ‌స్తే ఇంతే: KA పాల్

కేఏ పాల్ గుర్తున్నారా?  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జాశాంతి పార్టీ త‌ర‌ఫున అభ్య‌ర్థుల‌ను నిల‌బ‌డుతున్నాన‌ని.. చంద్ర‌బాబును, జ‌గ‌న్‌ను కూడా ఓడించి ఏపీలో అధికారంలోకి వ‌స్తాన‌ని.. ప‌దే ప‌దే చెబుతూ.. మీడియా ముందుకు వ‌చ్చిన కేఏ పాల్‌.. ఎన్నిక‌ల‌ త‌ర్వాత‌.. అడ్ర‌స్ లేకుండా పోయారు. అయితే.. త‌ర‌చుగా ఆయ‌న జూమ్ ద్వారానో.. ఆన్‌లైన్ ద్వారానో.. యూట్యూబ్ ద్వారానో.. త‌న అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నారు. మీడియా డిబేట్‌ల‌లోనూ ఆయ‌న త‌న గ‌ళం వినిపిస్తున్నారు. తాజాగా …

Read More »