Political News

రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ గుస్సా..!

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కినుక వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. కొండా కుటుంబానికి.. రేవంత్ కు మ‌ధ్య కొన్నాళ్లుగా దూరం పెరిగింద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ప‌ర‌కాల‌లో ఇటీవ‌ల చోటుచేసుకున్న ఒక సంఘ‌ట‌న వ‌ల్ల అధిష్ఠానంపై సురేఖ ఆగ్ర‌హంగా ఉన్నార‌ని.. పార్టీ త‌ర‌పున త‌మ‌కు అండ ల‌భించ‌లేద‌ని అల‌క వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు లో కొండా మురళి తల్లిదండ్రుల విగ్ర‌హాల‌ను కొన్ని రోజుల‌ క్రితం …

Read More »

వ‌న్ ఇయ‌ర్ త‌ర్వాత‌.. మ‌న‌దే సీఎం పీఠం: సంజ‌య్

తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చిందని.. వారు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్లో ఎంపీ అర్వింద్ పై దాడి ఘటనలో గాయపడ్డ కార్యకర్తలను బండి సంజయ్ పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఎదుగుదల జీర్ణించుకోలేక.. తీవ్రమైన మానసిక ఒత్తిడితో  ఎంపీలపై దాడులు చేస్తున్నారని బండి …

Read More »

కిరాణా షాపుల్లో లిక్క‌ర్.. పైగా రైతుల‌కోసమేనట

మ‌ద్యం ప్రియుల‌కు.. ఆ రాష్ట్రం మ‌జాకైన వార్త అందించింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైన్ షాపులు, బార్ల‌కు మాత్ర మే ప‌రిమిత‌మైన మ‌ద్యం అమ్మ‌కాల‌ను ఇక నుంచి కిరాణా షాపుల్లోనూ అనుమ‌తిస్తూ.. స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. ఇది మ‌న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు.. పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర‌లో!! అస‌లు ఏం జ‌రిగిందంటే.. మహారాష్ట్రలోని మ‌ద్యం వినియోగదారులు కిరాణా దుకాణాలు మరియు సూపర్ మార్కెట్లలో వైన్ కొనుగోలు చేయగలుగుతారని …

Read More »

ఏపీలో కొత్త జిల్లాల‌పై బాల‌య్య రియాక్ష‌న్‌

ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌తిపాదించిన జిల్లాల ఏర్పాటు.. అంశంపై హిందూపురం ఎమ్మెల్యే, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య రియాక్ట్‌.. అయ్యారు. నిజానికి జిల్లాల ఏర్పాటు అంశం తెర‌మీదికి వ‌చ్చి రెండు రోజులు అయినా.. స్పందించ‌లేద‌నే కామెంట్లు వినిపిస్తున్న నేప‌థ్య‌లో తాజాగా బాల‌య్య రియాక్ష‌న్ అంద‌రి నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. రాష్ట్ర ప్ర‌బుత్వం తీసుకువ‌చ్చిన జిల్లాల ఏర్పాటును ఆయ‌న స్వాగ‌తించారు. జిల్లాల ఏర్పాటు మంచిదేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే… ఈ విష‌యంలో రాజ‌కీయాలు వ‌ద్ద‌ని …

Read More »

ఏపీలో కమలం ఎత్తులు.. నో యూజ్?

దేశంలో హిందుత్వ ఫార్ములాతో రాజకీయం చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఎవరు అవునన్నా… కాద‌న్నా ఇదే నిజం. బీజేపీ పూర్తిగా హిందూ మతం ఆధారం చేసుకునే రాజకీయం చేస్తుంది. ఈ ఫార్ములాతోనే ఇప్పటివరకు సక్సెస్ అవుతూ వస్తుంది. ఇక ఇదే ఫార్ములాతో బలం లేని రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలని చెప్పి బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో తమ పని మొదలుపెట్టేశారు. అయితే ఇప్పటివరకు ఏపీలో …

Read More »

సొంత గూటికి కేసీఆర్?

సీఎం కేసీఆర్ త‌న సొంత గూటికి వెళ్ల‌నున్నారా..? గ‌త రెండు ప‌ర్యాయాలు గ‌జ్వేల్ నుంచి గెలిచి ముఖ్య‌మంత్రి అయిన కేసీఆర్ త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని వీడ‌నున్నారా..? టీడీపీలో ఉన్న‌ప్పుడు ఇర‌వై సంవ‌త్స‌రాలుగా గెలిచిన త‌న సొంత అసెంబ్లీ స్థానం సిద్దిపేట‌కు మార‌నున్నారా..? ఇటీవ‌ల జ‌రిగిన త‌న ఆంత‌రంగికుల భేటీలో ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నారు పార్టీ శ్రేణులు.  నంద‌మూరి తార‌క‌రామారావు పార్టీ ప్రారంభించిన స‌మ‌యంలో టీడీపీలో …

Read More »

జ‌గ‌న్‌కు సొంత జిల్లాలోనే వ్య‌తిరేక‌త‌

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కొత్త జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రాల అంశంపై భారీ ఎత్తున‌ విమర్శలు చెలరేగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై సీఎం జ‌గ‌న్ సొంత పార్టీ వైసీపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ వైఖరిని రాజంపేట మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ మర్రి రవి తప్పుబట్టారు. ఇలా చేయ‌డం స‌రికాద‌ని.. ఆయ‌న అన్నారు. రాయ‌చోటికి.. అన్న‌మ‌య్య …

Read More »

కాంగ్రెస్ లో ‘పద్మ’ చిచ్చు

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నత పద్మ పురస్కారాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్లే ఉంది. సీనియర్ కాంగ్రెస్ నేత, జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాంనబీ ఆజాద్ కు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. ఈయనతో పాటు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ బట్టాచార్య, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కు కూడా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ప్రకటించింది. కల్యాణ్ సింగ్ ఎలాగూ బీజేపీ నేత, పైగా …

Read More »

సీఎం జగన్ పక్కన మోకాళ్లపై కూర్చున్న ఐఏఎస్

దేశంలోనే అత్యున్నత సర్వీసులుగా చెప్పే సివిల్స్ కు ఎంపికైన వారి తీరు మిగిలిన వారికి కాస్తంత భిన్నంగా ఉండేది. సీనియర్.. జూనియర్ అన్న విషయాన్ని పక్కన పెడితే ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు తమ ఉద్యోగాలకు మాత్రమే తప్పించి అధికారానికి లొంగరన్న పేరుండేది. కానీ.. గడిపిన ఇరవై ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు అలా చెప్పే పరిస్థితి కనిపించటం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఈ సర్వీసులో ఉన్న వారి …

Read More »

కేసీఆర్ ఎందుకు తీసేశారంటే: కొండా మురళి

అటు సినిమా రంగంలోనూ.. ఇటు రాజకీయ రంగంలోనూ ఆసక్తికర చర్చకు తెర తీస్తోంది కొండా మూవీ. కొండా దంపతుల జీవితాన్ని రెండు భాగాల సినిమాగా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని వరంగల్ లోని కొండా మురళీ కార్యాలయంలో నిర్వహించటం.. దానికి చిత్ర టీం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొండా మురళీ మాట్లాడే సందర్భంలో సినిమా గురించి కాకుండా.. తన రియల్ జీవితానికి సంబంధించి …

Read More »

జగన్ ఊ అంటారా? ఊహూ అంటారా?

అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డిపైనే ఉంది. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని మిగిలిన రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఏఐఎస్ (ఆల్ ఇండియా సర్వీస్) క్యాడర్ ప్రధానంగా ఐఏఎస్ అధికారుల సర్వీసు నిబంధనల మార్పులపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను అడిగింది. ఇందులో తొమ్మది రాష్ట్రాలు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను రాతమూలకంగా పంపాయి. అలాగే 8 రాష్ట్రాలు అనుకూలంగా అభిప్రాయాలను పంపాయి. ఇంకా అభిప్రాయం …

Read More »

కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏం లాభం

YS Jagan Mohan Reddy

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నెటిజ‌న్లు ఆస‌క్తిగా స్పందిస్తున్నారు. కొంద‌రు ఈ జిల్లాల ఏర్పాటును స్వాగ తించారు. మరికొంద‌రు ఏపీ ప్ర‌బుత్వానికి కొన్ని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. స్వాగ‌తించిన వారుకూడా.. కొన్ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్ర‌భుత్వానికి మ‌రింత ఖ‌ర్చు పెరుగుతుంద‌ని అంటున్నారు. ఇక‌, ప్ర‌శ్నిస్తున్న‌వారు.. సూటిగా కొన్ని ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు బాగానే ఉన్నా.. వీటివ‌ల్ల అయ్యే ఖ‌ర్చును త‌ట్టుకునే ప‌రిస్థితి రాష్ట్రానికి …

Read More »