Political News

జగన్ హిట్లర్ అవ్వకూడదు: వైసీపీ ఎంపీ

తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీల మధ్య మాటల యుద్దం జోరుగా సాగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఆ పార్టీ ఎంపీలు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై, వైసీపీ నేతలపై రఘురామ మండిపడ్డారు. ఈ క్రమంలోనే జగన్ పై ఆర్ఆర్ఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కూడా ముస్సోలిని, హిట్లర్ వంటి నియంతలలాగా …

Read More »

మోడీకి తన గ్రాఫ్ పడిపోతోందని అర్థమైందా ?

చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. లేకపోతే పార్లమెంటుకు ఎంపీలు హాజరవ్వాలని, పార్లమెంట్ లో జరిగే చర్చల్లో సక్రమంగా పాల్గొనాలని ఎంపీలకు క్లాసు ఎందుకు పీకుతారు ? ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీల వైఖరిపై ప్రధాని చాలా సీరియస్ అయ్యారు. చాలామంది ఎంపీలు అసలు పార్లమెంటుకే హాజరు కావడం లేదని తన అసహనాన్ని వ్యక్తంచేశారు. ఎంపీలందరూ పార్లమెంటు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవ్వాలని చిన్నిపిల్లలకు చెప్పినట్టు …

Read More »

రేవంత్ ని హర్ట్ చేసిన ఢిల్లీ కాంగ్రెస్

ఇప్ప‌టికే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో దారుణ ఫ‌లితంతో ఢీలా ప‌డ్డ రాష్ట్ర కాంగ్రెస్‌కు ప్ర‌స్తుతం ఢిల్లీలో అధిష్ఠానం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇబ్బందిక‌రంగా మారుతుంద‌నే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. ఇక్క‌డ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి పోరాటం చేస్తుంటే.. అటు ఢిల్లీలో టీఆర్ఎస్ మంత్రుల‌తో క‌లిసి కాంగ్రెస్ స‌మావేశం నిర్వ‌హించ‌డం రాష్ట్ర నేత‌ల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. దీనిపై జాతీయ నేత‌లు దృష్టి సారించాల‌ని రాష్ట్ర …

Read More »

అయ్యో మోత్కుప‌ల్లి.. ఆ చ‌ప్పుడే లేదు!

కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు పేరు టీఆర్ఎస్ వ‌ర్గాల‌తో పాటు మీడియాలోనూ ఎక్కువ‌గా వినిపించింది. ద‌ళిత బంధు కోసం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ఆయ‌న సీఎం ప‌క్క‌న కూర్చోవ‌డం.. ఆ త‌ర్వాత అసెంబ్లీలో ప్ర‌సంగం స‌మ‌యంలోనే మోత్కుప‌ల్లి శాస‌న‌స‌భ‌కు వెళ్ల‌డం లాంటి విష‌యాలే అందుకు కార‌ణం. ఆయ‌న్ని టీఆర్ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్ ద‌ళిత బంధు ఛైర్మ‌న్‌గా చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. కానీ …

Read More »

రైతు ఉద్యమంపై కీలక నిర్ణయం ?

దాదాపు ఏడాదికి పైగా ఢిల్లీ శివార్లలో ఉద్యమం చేసి అనుకున్నది సాధించిన భారతీయ కిసాన్ యూనియన్ తన ఉద్యమానికి ముగింపు పలకబోతోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏడాది కాలంగా చేసిన ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి రైతు సంఘాలకు గతంలోనే విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రైతుసంఘాలకు విజ్ఞప్తి కూడా అందింది.  ప్రధాన డిమాండ్ అయిన వ్యవసాయ చట్టాలను …

Read More »

రేవంత్ జోస్యం నిజ‌మైందా..?

ధాన్యం కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్‌పై రేవంత్‌రెడ్డి చెప్పిన జోస్య‌మే నిజ‌మైందా.. మోడీతో ఆ పార్టీ ఎంపీలు కుమ్మ‌క్క‌య్యారన్న ఆరోప‌ణ వాస్త‌వ‌మేనా..? అన్నఅనుమానాలు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో నెల‌కొన్నాయి. టీఆర్ఎస్ ఎంపీలు ఇక‌పై కేంద్రంతో ఎలా పోరాడ‌తారు..? రాష్ట్రంలో రైతుల మ‌ద్ద‌తు ఎలా కూడ‌గ‌డుతారు..? లేదా రేవంత్ రెడ్డి మాట‌ల‌ను నిజం చేస్తారా..? అని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు స‌మ‌స్య‌పై పార్ల‌మెంటులో టీఆర్ఎస్ ధ‌ర్నాలు చేసింది నిన్న‌టి వ‌ర‌కు. ఈరోజు …

Read More »

పార్లమెంటులో టీఆర్ఎస్ ఒంటరైందా ?

పార్లమెంటు శీతాకాల  సమావేశాలను బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్లమెంట్ ఈనెల 23వ తేదీన ముగుస్తున్న విషయం తెలిసిందే. బాయిల్డ్ రైస్ కొనాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలనే డిమాండ్లతో గడచిన వారంరోజులుగా పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్ఎస్ లోక్ సభ+రాజ్యసభ ఎంపీలు రకరకాలుగా ఆందోళనలు చేశారు. అయితే వీళ్ళ ఆందోళనలను, డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇదే విషయమై మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఆందోళనలను  కేంద్రం పట్టించుకోవడం …

Read More »

వామ్మో ఇదేం స్కీమ్ జగనన్న

వైసీపీ పాలనలో నిర్మాణ రంగం బాగా దెబ్బతిందని, కాంట్రాక్టర్లకు, బిల్లర్లకు బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే కొత్తగా ఏవైనా నిర్మాణాల కోసం ప్రభుత్వం టెండర్లకు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో బిల్డర్లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లకు ఏపీ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఇక నుంచి పట్టణ ప్రాంతాల్లో రాబోయే లేఅవుట్లలో …

Read More »

సీఎం అయ్యాక చేసే మొదటి పని అదే: CBN

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము అధికారంలోకి రాగానే.. ఫ‌స్ట్‌.. త‌మ పార్టీ కార్య‌కర్త‌ల‌ను, నాయ‌కుల‌ను వేధించిన వారి అంతుచూస్తామ‌ని.. వెల్ల‌డించారు. ప్ర‌తి ఒక్క‌రినీ గుర్తు పెట్ఉట‌కుంటున్నామ‌ని.. చెప్పారు. అదేస‌మ‌యంలో ప్రతి కార్యకర్తకు టిడిపి అధిష్టానం అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.   నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులతో తాజాగా ఆయ‌న  సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో …

Read More »

అమరావతి రైతులపై మరోసారి వైసీపీ కక్ష సాధింపు

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్రకు విశేష స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు, మహిళలు ఈ మహా పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావంగా కొందరు వారికి సహాయం చేస్తున్నారు. అయితే, పాదయాత్ర చేస్తున్న రైతులను నిబంధనల పేరుతో పోలీసులు, వైసీపీ నేతలు ఇబ్బందులు …

Read More »

జయ ఆస్తులు తీసుకుంటే సరిపోదు: IT ట్విస్ట్

తమిళనాడు హైకోర్టు దివంగత ముఖ్యమంత్రి మేనల్లుడు, మేనకోడలు విషయంలో విచిత్రమైన ఆదేశాలు జారీచేసింది. తమ మేనత్త ఆస్తులు తమకే రావాలని పట్టుబట్టిన మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపలకు హైకోర్టు ఒక విధంగా షాకి ఇచ్చింది. ఆస్తులే కాదు బకాయిలు కూడా వారసులు తీర్చాల్సిందే అని తాజాగా తీర్పిచ్చింది. జయలలిత మరణించిన తర్వాత ఆమె పేరుతో ఉన్న ఆస్తులపై పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా ఆమెకున్న ఆస్తులు …

Read More »

టీ కాంగ్రెస్‌ గ‌ప్‌చుప్‌… ఆ ఎన్నిక వ‌దిలేశారా?

స్థానిక సంస్థ‌ల కోటాలో జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్ వ‌దిలేసిందా..? పార్టీ బ‌ల‌మున్న చోట కూడా కాడి కింద ప‌డేసిందా..?  ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తే ఇవే అనుమానాలు క‌లుగుతున్నాయి. పార్టీకి పెద్ద పెద్ద లీడ‌ర్ల‌మ‌ని.. తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను తామే శాసిస్తున్నామ‌ని చెప్పుకునే న‌ల్ల‌గొండ నేత‌లు ఎమ్మెల్సీ ఎన్నిక‌ను కూడా ప‌ట్టించుకోక‌పోవ‌డం పార్టీ దుస్థితికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. కాంగ్రెస్ కంచుకోట‌కు బీట‌లు వారుతున్నాయా..?ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట నిన్న‌టి వ‌ర‌కు. …

Read More »