ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని, జగన్ తన సర్కారును రద్దు చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నార ని.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జగన్ ఢిల్లీ పర్యటనలో(పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని పురస్క రించుకుని) ఉన్న సమయంలోనే ఈ వార్తలు హల్చల్ చేశాయి. అయితే.. తాజాగా ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఊహాగానాలకు తెరదించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని …
Read More »వివేకా దారుణ హత్యలో నిందితులు ఊహించని ట్విస్ట్ ఇది
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయన దారుణ హత్యకు ముందు రాసిన లేఖ నిజాలు చెప్పనుంది. ఈ లేఖలో దాగిన నిగూఢ వేలిముద్రలున్నాయేమో గుర్తించడానికి దాన్ని నిన్‌హైడ్రిన్ పరీక్షకు పంపాలన్న సీబీఐ అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఆమోదం తెలిపింది. లేఖను పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపాలంటూ సీబీఐ దాఖలు …
Read More »నువ్వు నన్ను-నేను నిన్ను: బైడెన్-మోడీ రాజకీయం
ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికాకు, భారత్‌కు మధ్య కొన్ని కొన్ని విషయాల్లో సారూప్యత కనిపిస్తోంది. నువ్వు నన్ను పొడిగితే.. నేను నిన్ను పొగుడుతా! అన్న క్విడ్ ప్రోకో పొగడ్తలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే.. వాస్తవానికి అక్కడ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అదనపు అప్పు కోసం కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీంతో మొత్తానికి తంటాలు పడి …
Read More »ఏపీలో చీకట్లు.. కేసీఆర్ కు గట్టి కౌంటర్ పడాల్సిందేనట
ఎవరికి వారు వారి గొప్పల గురించి చెప్పుకోవటం తప్పేం కాదు. ఆ క్రమంలో ఎదుటోళ్ల మనసుల్ని గాయపరిచేలా.. చిన్నబుచ్చేలా మాట్లాడటంలో అర్థం లేదు. కాంగ్రెస్ అధినేత్రిగా వ్యవహరించిన సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావటం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన విభజన తీరులో ఏపీకి అన్యాయం.. తెలంగాణకు న్యాయం జరిగేలా చేయటం.. అదే విషయాన్ని పరోక్షంగా కేసీఆర్ తన మాటల్లో ప్రస్తావించటం తెలిసిందే. వాస్తవానికి ఒక రాష్ట్రాన్ని …
Read More »కాంగ్రెస్ ఊపందుకుంటోందా?
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో కాంగ్రెస్ మంచి ఊపుమీదుంది. సీనియర్ నేతలిద్దరూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరటం ఖాయమైపోయినట్లే. ఈ నెల 20 లేదా 25వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఆ సభకు పార్టీ అగ్రనేతలు రాహుల్ , ప్రియాంక గాంధీలను రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. పొంగులేటి, జూపల్లి పార్టీలో చేరిక సందర్భంగా …
Read More »ఏప్రిల్లోనే ఎన్నికలు..తేల్చేసిన చంద్రబాబు
రాబోయే ఏప్రిల్ నెలలోనే ఎన్నికలు జరగబోతున్నట్లు చంద్రబాబునాయుడు తేల్చి చెప్పేశారు. చంద్రబాబు తాజా ప్రకటనతో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. హైదరాబాద్ లో చంద్రబాబుకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీని గెలిపించాల్సిన బాధ్యత తనపైన ఉందని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా టీడీపీకి దేశంలోనే ఎంతో పేరుందన్నారు. ఇలాంటి పార్టీ ప్రస్తుతం …
Read More »లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది. స్కామ్ లో నిందితుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారటాన్ని వ్యతిరేకిస్తు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ వేయటానికి రెడీ అవుతున్నారు. శరత్ ను అప్రూవర్ గా మార్చేసి తనపై యాక్షన్ తీసుకోవటానికే ఈడీ పెద్ద కుట్రచేసిందనే వాదనతో కేజ్రీవాల్ పిటీషన్ వేయబోతున్నారు. ఇందుకు అవసరమైన వ్యవహారాలను న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. చాలాకాలంగా శరత్ జైలులోనే ఉన్న విషయం …
Read More »మూడు పార్టీలకూ కవితే ప్రచారాస్త్రమా?
ఒక్కోసారి పరిస్థితులు అలా తోసుకొచ్చేస్తాయంతే. విషయం ఒకటే అయినా వివిధ పార్టీలు తమ తమ యాంగిల్లో ఆ విషయాన్ని ప్రచారం చేస్తాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో కల్వకుంట్ల కవితే మూడు పార్టీలకు ప్రచారాస్త్రమయ్యేట్లున్నారు. కవితకు మద్దతుగా అధికార బీఆర్ఎస్ రంగంలోకి దిగేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇదే సమయంలో కవిత అవినీతిని హైలైట్ చేస్తు ఊరూరా ప్రచారం చేయటానికి బీజేపీ రెడీ అయిపోతోంది. ఇక కాంగ్రెస్ ను చూస్తే …
Read More »బీఆర్ఎస్ ను ‘బంధు’లే ముంచేస్తాయా ?
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బంధులే ముంచేస్తాయేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలోనే దళితబంధు పథకాన్ని అమలుచేయాలని కేసీయార్ ఈమధ్యనే ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ఆదేశాలిచ్చారు కానీ ఆచరణ ఎలాగో మాత్రం చెప్పలేదు. ఎందుకంటే దళితబంధు పథకం అమలుకు కనీసం రు. 20 వేల కోట్లు కావాలి. అంతడబ్బు ప్రభుత్వం దగ్గర లేదన్నది వాస్తవం. ఈ పథకాన్ని పక్కన పెట్టేస్తే బీసీ బంధు పథకం అమలుకు కూడా కేసీయార్ రెడీ అవుతున్నారు. …
Read More »ఒడిశా రైలు ప్రమాదం: 101 మృతదేహాలను దాచేందుకు భారీ ప్లానింగ్
ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంబంధించిన సవాళ్లు ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 175 మంది మరణిస్తే.. దుర్ఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా.. ఇప్పటికి ఆచూకీ తెలియని మృతుల సంఖ్య 101గా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ 101 మృతదేహాలను ప్రస్తుతం స్థానిక ఎయిమ్స్ ప్రాంగణంలో ఉంచారు. అయితే.. ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచే సౌకర్యం లేకపోవటంతో 101 మృతదేహాలను భద్రపర్చటం …
Read More »కేసీఆర్ స్పీడ్ : 70 మందితో లిస్టు రెడీ అవుతోందా ?
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో అభ్యర్ధుల ఎంపికపై కేసీయార్ కసరత్తులో స్పీడుపెంచినట్లు తెలుస్తోంది. దశాబ్ది ఉత్సవాలు అయిపోగానే మొదటిజాబితాగా 70 మందికి టికెట్లు ప్రకటించేందుకు రెడీ అవుతున్నారట. ఆరునెలలకు ముందే టికెట్లను ప్రకటించేస్తానని గతంలోనే కేసీయార్ ప్రకటించిన విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు ఇపుడు గుర్తుచేస్తున్నాయి. గతంలో ఛెప్పినట్లుగానే తమ అధినేత మొదటి జాబితాలో 70 మందికి టికెట్లను ప్రకటించబోతున్నట్లు చెప్పాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించన తర్వాత లేకపోతే నామినేషన్లకు …
Read More »మేనిఫెస్టో పబ్లిసిటీ… పక్కా ప్లానింగ్ తో!
జనాల ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో తెలుగుదేశంపార్టీ తొందరలోనే వినూత్న కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతోంది. 150 రోజుల పాటు జనాల్లోనే ఉండి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీన చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి మహానాడులో మొదటి విడత మ్యానిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మ్యానిఫెస్టోకు భవిష్యత్తుకు గ్యారెంటీ అని పేరుపెట్టారు. అందులో ఆరు పథకాలను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates