అందివచ్చిన సాంకేతికతను, డిజిటల్ విప్లవాన్ని బీజేపీ నూరు శాతం ఉపయోగించుకుంటోంది. ఏడేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆర్ధిక వనరులకు ఎలాంటి లోటు లేకపోవటంతో కొత్త విధానాలతో ప్రచారంలో దూసుకుపోతోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఉత్తరప్రదేశ్ లో భారీ ఎత్తున వర్చువల్ పద్దతిలో బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మోడీ పాల్గొనే ఈ వర్చువల్ బహిరంగ సభలో తక్కువలో తక్కువ 50 లక్షల మంది పాల్గొనేందుకు వీలుగా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. …
Read More »ప్రగతి భవన్లో ఏం జరుగుతోంది ?
ఇపుడిదే విషయం అర్ధం కావటంలేదు. ఒక్కసారిగా కేసీయార్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ప్రముఖుల భేటీలు జరుగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ కీలక నేత డీ రాజా ఇప్పటికే కేసీయార్ తో భేటీ అయ్యారు. తాజాగా బీహార్ ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ కూడా ప్రగతి భవన్ కు వచ్చారు. ఇంతకు ముందే కేసీయార్ చెన్నైకి …
Read More »రఘురామకు వైసీపీ ఎంపీ సవాల్
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ ఎంపీ సవాలు విసిరారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ రెండు నెలలు వెయిట్ చేస్తే ఎంపీ రఘురామ పై అనర్హత వేటు పడుతుందో లేదో తెలుస్తుందన్నారు. రఘురామకు ధైర్యముంటే తన రాజీనామాను రెండు నెలలు వాయిదా వేసుకోవాలని సవాలు విసిరారు. తిరుగుబాటు ఎంపీపై తప్పకుండా అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో సాధారణంగా ఎవరిపైనా అనర్హత …
Read More »పొత్తులపై నా ఒక్కడిదే నిర్ణయం కాదు.. పవన్ వ్యాఖ్యలు
పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు జనసేనతో పొత్తులకు సంబంధించి కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఒక్కడినే నిర్ణయం తీసుకోనన్నారు. ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని, పలు పార్టీలు జనసేనతో …
Read More »అధికారంలోకి వచ్చేవాళ్లం.. చిరంజీవే అడ్డు పడ్డారు..
చిరంజీవిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని ఆయన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కూడా చిరంజీవి తనతో బాగానే ఉన్నారని చెప్పారు. రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగమన్నారు. సినిమా టికెట్ల వివాదంలోకి టీడీపీని కూడా లాగుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించింది …
Read More »పరిటాల సునీత, శ్రీరామ్‌కు టిక్కెట్లు ఫిక్స్…!
అనంతపురం జిల్లా టీడీపీలో పరిటాల ఫ్యామిలీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. గతంలో ఈ ఫ్యామిలీకి పెనుకొండ అడ్డా. అక్కడ నుంచి రవితో పాటు ఆ తర్వాత సునీత కూడా ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో సునీత పెనుకొండను వదిలేసి రాఫ్తాడుకు మారారు. రాఫ్తాడులో వరుసగా రెండుసార్లు గెలిచిన సునీత గత ఎన్నికల్లో తన కుమారుడు శ్రీరామ్ కోసం తన సీటు త్యాగం చేశారు. అయితే తొలిసారి …
Read More »మోడీ భద్రత.. వాళ్ళకే బెదిరింపు కాల్స్?
సుప్రీంకోర్టు లాయర్లకే బెదిరింపు కాల్సు వస్తుండటం సంచలనంగా మారింది. ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ నుండి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చాలామంది లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. పంజాబ్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ ను కొందరు ఆందోళనకారులు అడ్డుకోవటం భద్రతా వైఫల్యమే అని తేలిపోయింది. అయితే లోపానికి కారణం ఏమిటి ? బాధ్యులెవరు ? అనే విషయమై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు …
Read More »నరసాపురంలో ఏం జరగబోతోంది ?
ఇపుడిదే విషయమై అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. చాలాకాలం తర్వాత నరసాపురం ఎంపీ, వైసీపీ తిరుగుబాటు నేత రఘురామకృష్ణంరాజు తన నియోజకవర్గంలో కాలు పెట్టబోతున్నారు. జగన్మోహన్ రెడ్డితో చెడిన దగ్గర నుండి రఘురామ నియోజకవర్గంలో పెద్దగా తిరిగిందే లేదు. ఆ మధ్య ఒకసారి హైదరాబాద్ కు వచ్చిన ఎంపీపై సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విచారణ సందర్భంగా ఎంత గోల జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. …
Read More »యూపీ పీఠం ఎవరిదో చెప్పిన తాజా సర్వే..
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా అభివర్ణిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆసక్తికరం అంశంగా మార్చటం తెలిసిందే. ఎన్నికలు జరుగుతున్నది ఐదు రాష్ట్రాల్లోనే అయినప్పటికీ.. అందరి చూపు మాత్రం ఉన్నది దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ (యూపీ) ఫలితం మీదనేనని చెప్పాలి. ఈ రాష్ట్రంలో వచ్చే ఫలితం జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా …
Read More »పుష్ప సినిమాపై వైసీపీ నేత అభ్యంతరం
సినిమాల విషయంలో ఒకప్పుడు జనాలు ఎంతో ఉదారంగా ఉండేవాళ్లు. సినిమాను సినిమాలాగే చూసేవారు. నిజంగా అభ్యంతరకంగా ఉన్న విషయాల మీద కూడా పెద్దగా వివాదాలు రాజేసేవారు కాదు. కానీ ఇప్పుడు జనాలు మరీ సున్నితంగా తయారైపోయి.. ప్రతి చిన్న విషయం మీదా రాద్దాంతం చేస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియా ప్రతిదాన్నీ బూతద్దంలో చూపించి చిన్న వివాదాల్ని ఇంకా పెద్దవి చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా పాటల్లో …
Read More »అలా అయితే సినిమాలు వాయిదా వేసుకోండి: పేర్ని నాని
మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ పెట్టడం.. సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం.. అలాగే సెకండ్ షోలు రద్దు చేయడం తెలిసిందే. ఓవైపు తెలంగాణలో ఇలాంటి ఆంక్షలేమీ లేకపోగా.. ఏపీలో మాత్రం థియేటర్లను టార్గెట్ చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా ఆంక్షలు పెడుతున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఐతే తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమేదీ …
Read More »పండగ పూట.. రోడ్డెక్కనున్న టీడీపీ
పెద్ద పండగ సంక్రాంతి పూట ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రోడ్డెక్కనుంది. ప్రజల కోసం నిరసన బాట పట్టనుంది. ఏపీ ప్రభుత్వంపై ప్రజల కోసం యుద్ధం చేయనుంది. ఏపీలో నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ‘‘ధరలు దిగిరావాలి.. జగన్ దిగిపోవాలి’’ అనే నినాదంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చందబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలకు సమాధానం చెప్పలేక వైసీపీ డిఫెన్స్‌లో పడిందని అన్నారు. …
Read More »