రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడినుండి పోటీచేస్తారనే విషయంలో క్లారిటి వచ్చినట్లేనా ? ఇప్పటివరకు అరడజను నియోజకవర్గాల్లో పవన్ పోటీచేస్తారంటు బాగా ప్రచారం జరుగుతోంది. అయితే వారాహి యాత్ర మొదలైన తర్వాత పవన్ వైఖరి కారణంగా కొంత క్లారిటి వచ్చిందని పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయేఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీచేయటానికి పవన్ రెడీ అవుతున్నారట. ఎందుకంటే వారాహి యాత్రలో పవన్ రెండురోజులు పిఠాపురంలోనే హాల్ట్ …
Read More »చెప్పులు సరే..గ్లాస్ గుర్తు వెతుక్కో పవన్: నాని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ తమకు ఒక చెప్పు చూపించాడని, మక్కెలిరుగుతాయని వార్నింగ్ ఇచ్చాడని, అయితే, తమకు రెండు చెప్పులున్నాయని పవన్ ను ఉద్దేశించి ప్రెస్ మీట్ లో పేర్ని నాని రెండు చెప్పులు చూపించడం సంచలనం రేపింది. దీంతో, …
Read More »ఏపీలో జనాలు కేసీయార్ నాయకత్వం కోరుకుంటున్నారా ?
ఏపీలో జనాలు కేసీయార్ నాయకత్వం కోరుకుంటున్నారా ? అవుననే అంటున్నారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. హైదరాబాద్ లో మాట్లాడుతు వైసీపీ, టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆగమాగమైపోయిందని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర ధరలతో మధ్య జనాలు కుదేలైపోతున్నట్లు తోట తెగ బాధ పడిపోయారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా అందరు బీఆర్ఎస్ వైపే చూస్తున్నట్లు చెప్పారు. తాను ఎక్కడ పర్యటించినా అందరు బీఆర్ఎస్ రావాలనే కోరుకుంటున్నట్లు తెలుస్తోందని చెప్పారు. సరే …
Read More »ఏపీ సత్యం.. జగన్ మిథ్య!!
ఏపీ సత్యం.. జగన్ మిథ్య! ప్రస్తుతం మేధావులు అంటున్న మాట ఇదే! ఎందుకంటే.. ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. సీఎం జగన్ పదే పదే తన పాలనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. తన పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెబుతున్నారు. గత నాలుగేళ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని నొక్కి వక్కాణిస్తున్నారు. అయితే.. జగన్‌కు ముందు.. కూడా రాష్ట్రాన్ని చాలా మంది ముఖ్యమంత్రులు పాలించారు. అంతెందుకు.. జగన్ …
Read More »మంత్రి వర్సెస్ ఐఏఎస్.. ఏపీలో ఏం జరుగుతోంది?
ఏపీలో చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్టు వినాలని.. సీఎం జగన్ స్థాయిలో ఆదేశాలు ఉన్నాయి. కానీ, కొందరు మాత్రం ఈ మాటలను లెక్కచేయడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు మధ్య వివాదాలు రోజుకోరకంగా మారు తున్నాయి. ఇక, ఇప్పుడు ఏకంగా.. డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా …
Read More »ఏపీ లో ఎవరికి వారికే ధీమా.. మరి ఓట్ల సంగతేంటి..?
ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీలు నిర్వహిస్తున్న బహిరంగ సభల కు జనాలు పోటెత్తుతున్నారు. మూడు రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవ ర్గం కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన సమావేశాలకు… జనాలు పోటెత్తారు. ఎటు చూసినా.. జనమే అనే మాట స్పష్టంగా కనిపించింది. ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర నెల్లూరులో సాగుతోంది. ఈ …
Read More »కాంగ్రెస్ కు ఆప్ బంపరాఫర్
రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీని ఎలాగైనా ఓడించాలని ప్రతిపక్షాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 20 పార్టీలను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. అంటే వీటిమధ్య పొత్తులు కుదిరిందని అర్ధంకాదు. ఈనెల 23వ తేదీన ప్రతిపక్షాలతో పాట్నాలో భేటీని ఏర్పాటుచేశారు. ఆ భేటీకి పార్టీల అధినేతలను మాత్రమే రావాలని షరతుపెట్టారు. అందుకు చాలాపార్టీలు అంగీకరించాయి కూడా. ఈ నేపధ్యంలోనే ఆప్ జాతీయ …
Read More »ఏపీలో ఇంత గందరగోళమా ?
రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా గందరగోళం పెరిగిపోయింది. రాబోయేఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో పొత్తుపెట్టుకుంటుంది ? ఎన్నిపార్టీలు ఒంటరిగా పోటీచేస్తాయో జనాలకు అర్ధంకావటంలేదు. జనాలకు అర్ధంకాకపోతే పోయింది కనీసం పార్టీల్లో అయినా క్లారిటి ఉందా అనే అనుమానం పెరిగిపోతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబునాయుడు భేటీ తర్వాత అయోమయం మొదలైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలైన తర్వాత గందరగోళం మరింత పెరిగిపోయింది. ఇంతకాలం …
Read More »వైసీపీ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ వెనుక జగన్:లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగానే అనంతసాగరం జంక్షన్ లో బహిరంగ సభను నిర్వహించారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ సభలో పాల్గొన్నారు. ఆత్మకూరు నుంచి బరిలో దిగాలన్న ఆలోచనలో ఆనం ఉన్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగానే …
Read More »ఒక్క ఛాన్స్ ప్లీజ్: పవన్ వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పిఠాపురం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేన అధికారం ఇవ్వాలని, తనను ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ముఖ్యమంత్రి పదవి చేపడితే దేశంలోనే ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఇలాంటి గూండాలు మనల్ని పాలిస్తున్నారంటే సిగ్గుపడాలని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేన అధికా …
Read More »అమరావతిపై ఫుల్ క్లారిటీతో పవన్ !
ఇంతకాలానికి రాజధాని అమరావతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చారు. ఇంతకాలం అమరావతి విషయంలో పవన్ ముసుగులో గుద్దులాటలాగే వ్యవహారం నడిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడురాజధానులపైన పవన్ కామెంట్లు చేస్తున్నారే కానీ అమరావతి పైన మాత్రం తన స్టాండ్ ఏమిటనేది స్పష్టంగా ప్రకటించలేదు. అలాంటిది మొదటిసారి ప్రకటించారు. వారాహి యాత్రను తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో ప్రారంభించారు. ఇక్కడ జరిగిన బహిరంగసభలో పవన్ దాదాపు రెండు …
Read More »ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు తాజా కామెంట్స్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత ఇలాకా కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలోని పలు సమస్యలను తెలుసుకొని ప్రజలతో మమేకమయ్యేందుకు చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. నీతినిజాయితీకి కుప్పం ప్రజలు మారుపేరని, కానీ, వైసీపీ పాలనలో ఇక్కడ రౌడీలు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. సంపద సృష్టించడం, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates