కాంగ్రెస్ వైపే ఎగ్జిట్ పోల్స్!

తెలంగాణ శాసన సభ ఎన్నికల పోలింగ్ దాదాపుగా ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా..క్యూలైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల సంఘం నిబంధనలు మార్పు చేయడంతో తాజాగా సాయంత్రం 5.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. గతంలో ఈ సమయం 6.30గా ఉంది. తాజాగా సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతుండడంతో అధికార పార్టీకి షాక్ తగిలినట్లయింది.

బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉండి ప్రతిపక్ష హోదాకే పరిమితమవుతుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయి. బీజేపీ కంటే ఇతరులకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా…కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 67 స్థానాలు దక్కుతాయని ఆరా ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ కు 41 నుంచి 49 స్థానాలు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. బీజేపీ- 5 నుంచి 7 స్థానాలు, ఇతరులు- 7 నుంచి 9 స్థానాలు దక్కించుకుటుందని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కు 67 నుంచి 78 స్థానాలు దక్కే అవకాశముంది. బీఆర్ఎస్ 22 నుంచి 31 స్థానాలు, బీజేపీ- 6 నుంచి 9 స్థానాలు, ఎంఐఎం- 6 నుంచి 7 స్థానాలు దక్కించుకుంటాయని సర్వేలో తేలింది.

సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్… ప్రకారం కాంగ్రెస్- 65 స్థానాలు దక్కించుకుంటుంది. బీఆర్ఎస్- 41 స్థానాలు, బీజేపీ- 4 స్థానాలు, ఇతరులు- 9 స్థానాలు దక్కించుకోనున్నారు. సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్… ప్రకారం కాంగ్రెస్-56 స్థానాలు, బీఆర్ఎస్- 48 స్థానాలు, బీజేపీ- 10 స్థానాలు, ఇతరులు- 5 స్థానాలు దక్కించుకోనున్నారు. పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం…కాంగ్రెస్- 65 నుంచి 68 స్థానాలు, బీఆర్ఎస్- 35 నుంచి 40 స్థానాలు, బీజేపీ- 7 నుంచి 10 స్థానాలు, ఇతరులు- 6 నుంచి 9 స్థానాలు దక్కించుకోనున్నారు.