హైదరాబాద్ ఓటరు అస్సలు మారలేదు. నేతలు గొంతు చించుకున్నా.. మీడియా చైతన్యం చేసినా.. ఎన్ని కల సంఘం రండి బాబూ రండని ఆహ్వానించినా.. హైదరాబాద్ ఓటరు మాత్రం కిమ్మనలేదు. కిక్కురుమనలేదు. తన మానాన తను సైలెంట్ అయిపోయారు. దాదాపు 42 రోజుల పాటు మైకులు హోరెత్తాయి. నాయకలు ప్రచారంతో ఊరూవాడా దద్దరిల్లింది. ఇక, పోలింగ్ కూడా గురువారం ఉదయం ప్రారంభమైంది.
వీధి చవర్లోనో.. రోడ్డు మధ్యలోనో పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఓ నాలుగు అడుగులు వేస్తే.. పోలింగ్ కేంద్రం. అయినా.. హైదరాబాద్ ఓటరు కునుకు తీస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఊపందుకుని.. జిల్లాలు, పట్టణాలు, గ్రామాల నుంచి కూడా ఓటర్లు తరలి వచ్చి తమ హక్కును వినియోగించుకున్నారు. ఇక, సాధారణ జనాలకు దూరంగా ఉండే సెలబ్రిటీలు సైతం.. క్యూల్లో నిలబడి ఓటెత్తారు.
అదేసమయంలో వృద్ధులు, వికలాంగులు.. పేషంట్లు కూడా వచ్చి ఈ ఎన్నికల్లో పాలు పంచుకున్నారు. ఇలా ఎన్ని ఉదాహరణలుకళ్ల ముందు కనిపిస్తున్నా.. హైదరాబాద్ ఓటరు మాత్రం కిమ్మనలేదు. దీంతో మధ్యాహ్నం 12 గంటల సమయానికి వివిధ జిల్లాల్లో 35 శాతం సగటున పోలింగ్ నమోదు కాగా.. హైదరాబాద్‌లో మాత్రం.. 13 శాతమే నమోదైంది. దీనిని బట్టి హైదరాబాద్ ఓటరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో.. ఎంత నిరుత్సాహంతో ఉన్నాడో అర్థమవుతోంది. ఏదేమైనా.. వీరిని మార్చడం ఇక ఎవరి వల్లా కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates