Political News

న‌న్ను కొనాల‌ని చూస్తున్నారు.. :  ద‌స్త‌గిరి

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసుకు సంబంధించిన వ్య‌వ‌హారం మ‌లుపుల‌పై మలుపులు తిరుగుతోందా?  ఈ కేసులో ఇప్ప‌టికే సీబీఐ విచార‌ణ మంద‌గించేలా తెర‌వెనుక `కొన్ని శ‌క్తులు` ప్ర‌య‌త్నించాయ న్న టీడీపీ స‌హా విప‌క్షాల విమ‌ర్శ‌లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక‌, ఇంకేముంది.. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సీబీఐ కూడా ఇప్పుడు ఆయ‌న‌ను ప్ర‌తి శ‌నివారం విచారించి.. ఊరుకుంటోంది. …

Read More »

అందుకోస‌మే కాంగ్రెస్‌లో చేరుతున్నా: పొంగులేటి

కొన్ని రోజులుగా తెలంగాణ రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌గా మారిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి రాజ‌కీయ వ్య‌వ‌హారానికి తాజాగా ఫుల్ స్టాప్ ప‌డింది. తాను కాంగ్రెస్‌లో చేరుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే.. దీనికి ఏకైక కార‌ణం.. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకేన‌ని పొంగులేటి చెప్పారు. తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ఏఐసీసీ అధ్య‌క్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పొంగులేటి స‌మావేశం అయ్యారు. అనంత‌రం  ఆయ‌న మాట్లాడుతూ.. పదవులు …

Read More »

విన్నపాన్ని పవన్ మన్నిస్తారా ?

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామజోగయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఒక లేఖ రాశారు. అందులో రాబోయే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తే బాగుంటుందని తాను అనుకుంటున్న మూడు నియోజకవర్గాలను జోగయ్య సూచించారు. ఇంతకీ ఆ మూడు నియోజకవర్గాలు ఏవంటే భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం. ఈ మూడింటిలో ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ గెలుపు గ్యారెంటీనట. ఎందుకంటే పవన్ ఎప్పుడెప్పుడు పోటీ చేద్దామా …

Read More »

కోమటిరెడ్డి, ఈటల..ఏం జరుగుతోంది?

సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏమి జరుగుతోందో అర్థం కావటం లేదు. వీళ్ళిద్దరితో మూడు రోజుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు సార్లు భేటీ అయ్యారు. దాంతో పార్టీలోని నేతలందరి చూపు ఇపుడు వీళ్ళిద్దరిపైనే నిలిచింది. ఇంతకీ విషయం ఏమిటంటే కోమటిరెడ్డి, ఈటల తొందరలోనే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరిని పార్టీలోనే ఉండేట్లుగా …

Read More »

యూత్‌ని అట్రాక్ట్ చేయడానికి జగన్ మాస్టర్ ప్లాన్

జగన్ పాలన ఎంత అధ్వానంగా ఉన్నా, రాష్ట్రం ఆర్థికంగా ఎంత వెనుకబడిపోతున్నా, అభివృద్ధి కనుచూపుమేరలో కూడా లేకపోయినా ఒక విషయంలో మాత్రం జగన్‌ టాలెంట్‌ను పొగడక తప్పదు. అది.. జనాన్ని మాయ చేయడం, ఆకర్షించడం.. ఈ విషయంలో ఆయన చాలా ముందుంటారు. ఉద్యోగాలు లేక, ఉపాధి దొరక్క, నిరుద్యోగ భృతి కూడా అందక నానా తిప్పలు పడుతున్న ఆంధ్ర యువత రానున్న ఎన్నికలలో జగన్‌కు ఓటేయడం అనేది కలే అనుకుంటున్నారు …

Read More »

జ‌గ‌న్‌.. నా విప్ల‌వ పంథా చూస్తే.. త‌ట్టుకోలేవ్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయారు. జ‌గ‌న్‌.. నా విప్ల‌వ పంథా చూస్తే.. త‌ట్టుకోలేవ్‌ అని వార్నింగ్ ఇచ్చారు. సీఎంగా జగన్ బాగా పరిపాలించి ఇంకోసారి గెలిచినా త‌న‌కు అభ్యంతరం లేదని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. అయిత‌.. జ‌న‌సేన త‌ర‌ఫున ఎవ‌రూ పోటీ చేయ‌కూడ‌ద‌ని.. ఎవ‌రూ బ‌రిలోకి నిల‌బ‌డ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించినా.. వారి ఓట్లు తీసేసే ప్ర‌య‌త్నం చేసినా.. త‌న విశ్వ‌రూపం చూపిస్తాన‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. “ఇప్పుటిదాకా …

Read More »

జ‌గ‌న్ వ‌ల్లే నా ప‌ద‌వి పోయింది: క‌న్నా

ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి, మాజీ బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ అదినేత, సీఎం జ‌గ‌న్ కార‌ణంగానే త‌నను బీజేపీ పెద్ద‌లు ఏపీ అధ్య‌క్ష ప‌దవి నుంచి దింపేశార‌ని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి గా తాను ఉన్న స‌మ‌యంలో జగన్ ప్ర‌భుత్వ‌ రాచకాలను ప్రశ్నించినందుకే తనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దించే కుట్ర చేశారని అన్నారు. 2019 ఎన్నికల్లో …

Read More »

ఏపీలో బీసీల‌కు ర‌క్ష‌ణ లేదు: సుమ‌న్

ఏపీ రాజ‌కీయాల‌పైనా.. ఇక్క‌డి పార్టీల‌పైనా న‌టుడు సుమ‌న్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని అన్నారు. అదే స‌మయంలో ఇత‌ర కులాలైన రెడ్డి, క‌మ్మ‌, కాపు, ఎస్సీ కులాల‌కు రాష్ట్రంలో రాజ‌కీయ వేదిక‌లు ఉన్నాయ‌ని.. కానీ, బీసీల‌కు ఒక వేదిక కూడా లేదని విమ‌ర్శించారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం వ‌స్తుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో గ‌త నాలుగేళ్లుగా బీసీ సామాజిక వ‌ర్గాల‌పై దాడులు, హ‌త్య‌లు …

Read More »

ముద్ర‌గ‌డపై బేన‌ర్.. దించేయ‌మ‌న్న ప‌వ‌న్

ఒక‌ప్పుడు కాపు ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి.. కొన్నేళ్లుగా సైలెంటుగా ఉంటున్న ఆంధ్రా నేత ముద్ర‌గ‌డ పద్మ‌నాభం కొన్ని రోజులుగా వార్త‌ల్లో వ్య‌క్తిగా మారారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఆయ‌న రాసిన లేఖ పెద్ద చ‌ర్చ‌కే దారి తీసింది. కాపుల‌కు పెద్ద‌గా ఏమీ చేయ‌ని వైసీపీ వైపు నిల‌బ‌డి.. ప‌వ‌న్‌ను టార్గెట్ చేయ‌డం జ‌న‌సైనికుల‌కే కాక మెజారిటీ కాపు ప్ర‌జానీకానికి కూడా న‌చ్చ‌లేదు. లేఖ‌లో ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని, …

Read More »

‘తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బాగుప‌డింది’

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. తెలంగాణ స‌ర్కారు తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. నాగ‌ర్ క‌ర్నూలులో బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన స‌భ‌లో తాజాగా ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర వ్యాఖ్య‌లు రువ్వారు. తెలంగాణ‌లో కేసీఆర్ కుటుంబం మాత్ర‌మే బాగు ప‌డింద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఎంతో మంది ప్రాణాలకు తెగించి.. మ‌రీ పోరాడార‌ని.. అలా సాధించుకున్న తెలంగాణ‌ను కేసీఆర్ స‌ర్కారు నాశ‌నం చేసింద‌ని …

Read More »

ఎవరీ లాస్య నందిత?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ సిటింగులతో పాటు ఇతర నేతలు కూడా టికెట్ల దృష్టితోనే రాజకీయాలు చేస్తున్నారు.. అధిష్టానం దృష్టిలో పడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఈసారి కొత్త ముఖాలు పార్టీ ఆఫీసుల్లో కనిపిస్తున్నాయి. కార్పొరేటర్లలోనూ చాలామంది ఎమ్మెల్యే టికెట్లపై ఆశ పెట్టుకున్నప్పటికీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం కార్పొరేటర్లను అసెంబ్లీ వైపు చూడొద్దని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. సిటింగులకు టికెట్లు ఇస్తామని పార్టీ పెద్దలు …

Read More »

నెల్లూరులో 5 సీట్ల‌ పై టీడీపీ క‌న్ను.. ఏం చేస్తున్నారంటే

నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లోనూ గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేకుండా పోయింది. నెల్లూరు రూర‌ల్, వెంక‌ట‌గిరి, ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల‌పై పార్టీ అధినేత వేటు వేయ‌డంతో వారు పార్టీకి దూరంగా ఉంటూ.. టీడీపీకి చేర‌వ‌య్యారు. దీంతో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి ఎదురు లేద‌నే వాద‌న వినిపిస్తోంది. వీటితోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూటీడీపీ గెలవాల‌నే …

Read More »