భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్ర పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు రాష్ట్ర పర్యటన నిమిత్తం సతీమణి శివమాలతో కలిసి వచ్చిన ఆయన ఈ రోజు.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీరమణ, ఏపీ సీఎం జగన్లు ఒకే వేదికను పంచుకున్నారు. ఒకే వేదికపై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, …
Read More »మోడీ జీతం నుంచి రూ.1000 విరాళం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. స్వయంగా తన జీతం నుంచి 1000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన రశీదును కూడా ఆయన తీసుకున్నారు. మరి అంత పెద్దాయన విరాళం ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అనే సందేహం కామన్ కదా.. ఇది.. చదవండి.. భారతీయ జనతా పార్టీ “మైక్రో డొనేషన్స్“ వసూలు చేస్తోంది. అంటే.. సూక్ష్మ స్తాయి విరాళాలు అన్నమాట. దీనిలో 5 రూపాయల నుంచి ఎంతైనా స్వీకరిస్తారు. …
Read More »JD vs JP: ఇలా మిగిలిపోవాల్సిందేనా…?
తాజాగా సోషల్ మీడియాలో ఈ తరహా చర్చ ఆసక్తిగా మారింది. జేడీ వర్సెస్ జేపీ ఇద్దరికీ పెద్దగా తేడా లేదని అంటున్నారు. జేడీ అంటే.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాలు పెద్దగా పుంజుకున్న దాఖలా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ నుంచి పోటీ చేసిన.. ఆయన.. ఓడి పోయారు. తర్వాత.. పార్టీకి దూరమయ్యారు. అయితే.. ఇప్పుడు ఆయన ఊసుఎక్కడా వినిపించడం లేదు. పైగా.. విశాఖలోనూ …
Read More »పవన్.. రెండు పడవల ప్రయాణం
ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. ఎన్నికలు ఉన్నప్పుడు సినిమాలకు బ్రేక్.. షూటింగ్లతో బిజీగా ఉన్నప్పుడు రాజకీయాలకు విరామం.. ఇదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయాణం. కానీ ఇప్పుడు ఆయన మరో కొత్త పంథాలో సాగబోతున్నారని సమాచారం. ఒకే సారి రెండు పడవల ప్రయాణం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల కోసం సినిమాలను.. సినిమాల కోసం రాజకీయాలను దూరం పెట్టకుండా ఒకేసారి రెండు రంగాల్లోనూ ముందుకు సాగుతారని తెలుస్తోంది. అందుకు …
Read More »ముందస్తుకు వెళ్తే కేసీఆర్కే నష్టం!
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన పార్టీగా ప్రజల్లో టీఆర్ఎస్కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ అభిమానంతోనే 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టారు. అప్పటి నుంచి రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ను నిలిపేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటే రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 2018 ముందస్తు …
Read More »దేవినేని vs వంగవీటి.. పొలిటికల్ ఫైట్?
విజయవాడ రాజకీయాలు మరోసారి హీటెక్కబోతున్నాయి. కొన్నేళ్లుగా చల్లారిన వేడి తిరిగా రాజుకోనుంది. ఒకప్పుడు రెండు వర్గాల మధ్య జరిగిన రాజకీయ ఫైట్కు మళ్లీ రంగం సిద్ధమైనట్లే కనిపిస్తోంది. మరోసారి వంగవీటి వర్సెస్ దేవినేని అనేలా రాజకీయాలు సాగనున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న కృష్ణా జిల్లా ఎప్పుడూ ఒకే పార్టీ …
Read More »లేటైనా.. లోకేష్ రియాక్షన్ బాగుందే..!
టీడీపీ యువనాయకుడు.. మాజీ మంత్రి లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.. శపథం.. పార్టీలో బాగానే వర్క వు ట్ అయిందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికిఎన్నారైలు ఇచ్చిన సలహాలు.. సూచనలు బాగానే పా టిస్తున్నారని చెబుతున్నారు. `నాతల్లిని దూషించిన వారిని ఎవరినీ వదిలిపెట్టను!` అని లోకేష్ కామెంట్ చేశారు. దీనిని కామెంట్ అన్నా.. శపథం అన్నా.. ఏదైనా కూడా.. పార్టీలో మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి నవంబరు 19న అసెంబ్లీలో …
Read More »జగన్ ముందే బయటపడ్డ వర్గపోరు..?
బెల్లం ఎక్కడ ఉంటే అక్కడకు చీమలు.. ఈగలు ఇట్టే వచ్చేస్తాయి. అలాంటిది అధికారం పక్షం అన్నంతనే పెద్ద ఎత్తున నేతలు పోలోమంటూ వచ్చేస్తారు. పార్టీ పవర్ లో లేనప్పుడు కనిపించని నేతలు.. పవర్ చేతికి వచ్చిన తర్వాత.. చుట్టూ ముగిపోతారు. అంతేకాదు.. పవర్ లో ఉన్నప్పుడు నేతల మధ్య విభేదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి ఏపీ అధికారపక్షంలో ఉన్నప్పటికీ.. వాటికి చేయాల్సిన శస్త్రచికిత్సను అధినేత జగన్మోమన్ …
Read More »టీడీపీలో ఆ ప్లేస్ కోసం మహిళా నేతల యుద్ధం…!
టీడీపీలో నేతల మధ్య పోరు.. సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. పైకి ఎంత శాంతంగా ఉన్నా.. ఆధిపత్యం, అధికారం కోసం నేతలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కుస్తీలు పడుతూనే ఉన్నారు. అయితే.. వీరంతా కూడా పురుష నేతలు. నియోజవర్గాల్లో బాధ్యతల కోసం.. ఎన్నికల్లో టికెట్ల కోసం.. పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర మార్కులు వేయించుకునేందుకు కోసం.. వీరు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఎప్పటికప్పుడుచంద్రబాబు వీరిని కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే.. …
Read More »జగన్-కేసీఆర్లకు గొప్ప ఇబ్బందే..
అటుఏపీ సీఎం జగన్.. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇద్దరూ కూడా తమ పాలన అద్భుతంగా ఉందని.. తమ పాలనలో పేదవాళ్ల నుంచి ధనికుల వరకు హ్యాపీగా ఉన్నారని.. ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేస్తున్నాయని పదే పదే చెబుతున్నారు. అందరూ ఇదే నిజమని అనుకుంటున్నారు కూడా. అయితే.. క్షేత్రస్థాయిలో మాత్రం వీరి పాలన అవినీతి కంపు కొడుతోందని.. స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏపీ) నిర్వహించిన సర్వేలో …
Read More »ఎంపీపై మండిపోతున్న తమ్ముళ్ళు
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తమ్ముళ్ళు మండిపోతున్నారు. ఇంతకాలం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలను చూస్తున్న నేతలను తప్పించి చంద్రబాబునాయుడు కొత్తగా ఎంపీకీ అప్పగించటాన్ని తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే చంద్రబాబు నిర్ణయంతో పాటు నియమితుడైన ఎంపీ మీద కూడా తమ్ముళ్ళు మండిపోతున్నారు. తాజాగా మొదలైన వివాదానికి పెద్ద చరిత్రమే ఉంది. విజయవాడలో ఎంపీ నాని అంటే మాజీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, సీనియర్ నేత …
Read More »కేటీఆర్ ఏం జరుగుతోంది.. నేతల ఆందోళన
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై పార్టీ నేతలు ఆందోళనగా ఉన్నారు. ఇటీవల సంగారెడ్డి పర్యటనలో ఆయన ప్రవర్తించిన తీరుపై గుర్రుగా ఉన్నారు. కేటీఆర్ వ్యవహార శైలి తమ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గులాబీ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేశారు. …
Read More »