దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్‌పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు. దండుపాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేకుండా పోతుందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మిస్సింగ్ గురించి చెబితే.. నాపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలకు దిగారని మండిపడ్డారు. పార్లమెంట్ లో కేంద్ర హోం శాఖ కూడా ఇదే విషయం చెప్పింది అన్నారు. అలాగే విశాఖ నుంచి 151 మంది చిన్నపిల్లలు అదృశ్యమయ్యారని.. ఏపీలో హ్యుమన్ ట్రాఫికింగ్ జరుతుందని నోబెల్ గ్రహీత కైలాష్ సత్యర్థి చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates