Political News

స్పీకరే అలిగారా ? వాకౌట్ చేశారా ?

పార్లమెంటు సమావేశాల్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అదేమిటంటే సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ ఓంబిర్లా అలిగారు. సభలో సభ్యుల ప్రవర్తన పై కోపం వచ్చి కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయారు. అంటే ఒక విధంగా స్పీకర్ లోక్ సభ నుంచి వాకౌట్ చేశారనే అనుకోవాలి. ఇంతకీ స్పీకర్ కు అంత కోపం రావటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే సభలో సభ్యులు ఎవరు తన మాటను వినటం లేదు, పట్టించుకోవటంలేదట. ఎందుకంటే …

Read More »

కేసీయార్ వ్యూహమిదేనా ?

తెలంగాణా సీఎం కేసీఆర్ ఎప్పుడేమి మాట్లాడుతారో ? ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలీదు. ఇందుకు తాజా ఉదాహరణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయమే. మొన్ననే జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే నిర్ణయం తీసుకున్నది. తాజా నిర్ణయంతో ఆర్టీసీలోని 43,373 మంది ఉద్యోగులు, కార్మికులు ఒక్కసారిగా ప్రభుత్వ ఉద్యోగులైపోయారు. దశాబ్దాలుగా కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉన్న వేలాదిమంది ఉద్యోగులు, కార్మికులు తాము ప్రభుత్వ …

Read More »

తెలంగాణ బీజేపీ అభ్య‌ర్థులు వీరేనా? కొత్త జాబితా హ‌ల్చ‌ల్!

మ‌రో ఏడెనిమిది మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న తెలంగాణలో బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసేది వీరే అంటూ.. ఒక జాబితా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది. కొన్నాళ్ల కింద‌ట‌.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసేవారి జాబితా ఒక‌టి తెర‌మీద‌కి వ‌చ్చింది. ఇది అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ కీల‌క నాయ‌కులు మాత్రం ఈ జాబితాను అప్ప‌ట్లో ఖండించారు. ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. ఇదిలావుంటే, తాజాగా …

Read More »

పులివెందులలో అమరావతి నినాదాలు

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఏపీలో త‌మ‌కు తిరుగులేద‌ని.. రాష్ట్ర ప్ర‌జ‌ల చ‌ల్ల‌ని దీవెన‌లు త‌మ‌కే ఉన్నాయ‌ని వైసీపీ నాయకులు , అధిష్టానం కూడా ప‌దే ప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్నా.. తాజాగా ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో చోటు చేసుకున్న ప‌రిణామంపై మాత్రం రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం నివ్వెర పోతున్నారు. దీనిపై వైసీపీ నాయ‌కులు కూడా ఫోక‌స్ …

Read More »

బుగ్గన మిస్సింగ్…నెటిజన్ల ట్రోలింగ్

Buggana Rajender Reddy

ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, వాటికోసం సీఎం జగన్ పడుతున్న తిప్పలు….గత కొద్ది రోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే వ్యవహారంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో చేసిన అప్పుల మొత్తం 1,78,000 కోట్లు అని లోక్ సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం ఆర్బీఐ పరిధిలో చేసిన అప్పులు మాత్రమే …

Read More »

ప్రాజెక్టుల టాపిక్ డైవర్షన్ కోసమే అంబటి ‘బ్రో’ రచ్చ

టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టారని రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్, త్రివిక్రమ్, ఆ చిత్ర నిర్మాత విశ్వ ప్రసాద్ పై అంబటి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, ఆ చిత్రాన్ని నిర్మాణం కోసం అమెరికా నుంచి ఫండ్స్ ను …

Read More »

పులివెందులలో చంద్రబాబు సభ..వైసీపీ కార్యకర్తల రచ్చ

సీఎం జగన్ ఇలాకా కడపలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించేందుకు సీమలో పర్యటిస్తున్న చంద్రబాబు…కడప జిల్లా జమ్మలమడుగులో రోడ్ షో నిర్వహించారు. పులివెందులలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు సభను అడ్డుకునేందుకు కొందరు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ వాహనంలో వచ్చి వైసీపీ జెండాలను ప్రదర్శిస్తూ …

Read More »

న్యూడ్ కాల్..మాజీ సీఎం కొడుకుపై మహిళ ఫిర్యాదు

ఈ మధ్యకాలంలో దేశంలోని కొందరు నేతల కామ క్రీడలు రచ్చకెక్కి రాజకీయాలను భ్రష్టుపట్టించిన సంగతి తెలిసిందే. ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఇక, మంత్రి అంబటి రాంబాబు ఆడియో టేప్ లీక్ వంటి వ్యవహారాలు ఇప్పటికీ వైరల్ గానే ఉన్నాయి. ఒక్క ఏపీలోనే కాదు….చాలా రాష్ట్రాలలో అధికార పార్టీకి చెందిన నేతాశ్రీలు..స్త్రీలోలులుగా మారి తమ పరువు తీసుకుంటున్నారు. తాజాగా ఈ …

Read More »

కేసీయార్ను కలుపుకునేదెవరు ?

మహారాష్ట్ర పర్యటనలో కేసీఆర్ ఒక విచిత్రమైన ప్రకటన చేశారు. అదేమిటంటే తాను ఎన్డీయే, ఇండియా కూటమి రెండింటికీ సమాన దూరమన్నారు. తాను ఏ కూటమిలోను చేరే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టకుండానే చెప్పారు. అంతాబాగానే ఉంది కానీ అసలు కేసీయార్ ను ఎవరు చేర్చుకుంటున్నారు ? పై రెండు కూటములు కేసీయార్ ను ఎప్పుడో దూరం పెట్టేశాయి. పై రెండు కూటములు తనను దూరంగా పెట్టిన విషయాన్ని కేసీయార్ ఉల్టాగా …

Read More »

కోడికత్తి కేసు విశాఖకు ఎందుకు ?

సుమారు ఐదేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన కోడికత్తి కేసు విచారణ విశాఖపట్నంకు మారింది. ఇప్పటివరకు విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టులోనే కేసు విచారణ జరుగుతోంది. కేసు విచారణ క్లైమ్యాక్స్ కు చేరుకుంటున్నది అనుకుంటున్న సమయంలో సడెన్ గా కేసు విచారణ పరిధిని విజయవాడ నుండి వైజాగ్ కు ఎందుకు మారుస్తున్నారో అర్ధంకావటం లేదు. కేసు విచారణ నత్తనడకగా సాగుతోందనే అనుకోవాలి. ఎందుకంటే విశాఖ ఎయిర్ పోర్టులో జగన్మోహన్ రెడ్డి మీద …

Read More »

అంబటి రాంబాబు … లైన్ తప్పారా?

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే ఉంది. పదేపదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళు, విడాకుల వ్యవహారాన్ని మీడియాలో మాట్లాడుతున్నారు. నిజానికి పెళ్ళిళ్ళు, విడాకులన్నది పూర్తిగా పవన్ వ్యక్తిగత విషయం. దానిద్వారా లాభమైనా, నష్టమైనా భరించాల్సింది పవనే కానీ అంబటి కాదు. మరెందుకు అంబటి పదేపదే పవన్ పెళ్ళిళ్ళ విషయాన్ని ఎటాక్ చేస్తున్నారో అర్థం కావటం లేదు. తాజాగా రిలీజైన పవన్ సినిమాలో ఏదో …

Read More »

కేసీయారే అస్త్రాలను అందిస్తున్నారా ?

ఎవరైనా తమను వాయించమని తమ ప్రత్యర్ధులకు తమంతట తాముగా ఆయుధాలను అందిస్తారా ? తెలంగాణలో కేసీఆర్ వ్యవహారం అలాగే ఉంది చూస్తుంటే. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీనే ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. రైతులకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ నాలుగు విడతల్లో రుణమాఫీని పూర్తిచేయనున్నట్లు కూడా ప్రకటించారు. అప్పట్లో ప్రభుత్వం అంచనా …

Read More »