బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అప్పుడు ముంబయి కూడా అట్టుడికిపోయింది. అల్లరి మూకల దాడుల్లో తీవ్ర నష్టం జరిగింది. అప్పటి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ బాధ్యతలు తీసుకున్నారు. కానీ అప్పుడు సీఎంగా అయిష్టంగానే కుర్చీ ఎక్కానని ఆయన తాజాగా వెల్లడించారు. 1993లో ఇష్టం లేకున్నా భావోద్వేగపూరిత వాతావరణంలో మహారాష్ట్రకు సీఎం …
Read More »జగన్ కు అమూల్ షాక్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అమూల్ పెద్ద షాకే ఇచ్చింది. సహకారరంగంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు సంస్ధ అమూల్ కు ఏపీలో జగన్ చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. పాల సేకరణ, రవాణా, ఉత్పత్తుల తయారీ లాంటి అంశాల్లో అమూల్ తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. అమూల్ సంస్ధతో మహళా స్వయం సమృద్ధి సంఘాలను టైఅప్ కూడా చేసింది. అమూల్ తో పాటు మహిళా సంఘాలు ఎదగటానికి జగన్ ప్రభుత్వం …
Read More »కాంగ్రెస్కు మరో 40 సీట్లు కావాలంటా!
తెలంగాణలో తిరిగి పుంజుకునేందుకు కాంగ్రెస్ శాయాశక్తుల ప్రయత్నిస్తోంది. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతోంది. ఉమ్మడి ఏపీలో అధికారం చలాయించిన ఆ పార్టీ.. ఇప్పుడు తెలంగాణలో మునుపటి వైభవం దిశగా అడుగులు వేయాలనే పట్టుదలతో ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడు పెంచింది. సభలు, ధర్నాలు, నిరసనలు, ఆందోళనలంటూ కేసీఆర్ ప్రభుత్వంపై …
Read More »మూర్తి గారు దిగారు.. థియేటర్లు తెరుచుకున్నాయ్
ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల వ్యవస్థ ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది కొంత కాలంగా. ఏపీలో జనాల సినీ అభిమానం ఎలాంటిదో.. సినిమాలను అక్కడ ఏ స్థాయిలో ఆదరిస్తారో.. థియేటర్లకు ఏ స్థాయిలో ఆదాయం వస్తుందో తెలిసిందే. ఐతే గత ఏడాది నుంచి మామూలుగా థియేటర్ల పరిస్థితి ఏమీ బాగా లేదు. కరోనా వల్ల ఆ ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అది చాలదన్నట్లు ఏపీలో టికెట్ల రేట్ల మీద నియంత్రణ తీసుకురావడం, …
Read More »చీప్ లిక్కర్ హామీ.. మహిళల కోసమే.. సోము కామెంట్లు
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటల తూటాలు పేల్చడంలో ఎక్కడా వెనుకడుగు వేయడం వేయడం లేదు. విజయవా డలో నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో సోము మాట్లాడుతూ.. కోటి మంది తమకు దన్నుగా నిలవాలని అన్నారు. అదేసమయం లో తాము అధికారంలోకి వస్తే.. చీప్ లిక్కరును 70 రూపాయలకే విక్రయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఆర్థిక పరిస్థితి బాగుంటే.. ఈ ధరను 50 రూపాయలకే తగ్గిస్తామని వ్యాఖ్యానించారు. అయితే.. …
Read More »సీఎం సార్ సహకరిస్తారా? ఎమ్మెల్యేల ఎదురు చూపు!
రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేల ఎదురు చూపులు తలకో విధంగా ఉన్నాయి. ఎవరి సమస్యలు వారివి. ఎవరి నియోజకవర్గాలు వారివి. ఎక్కడ ఉండాల్సిన సమస్యలు అక్కడే ఉన్నాయి. అయితే.. కొందరు ఎమ్మెల్యేల సమస్యలు చాలా చిత్రంగా ఉన్నాయి. తమకు ఓటు బ్యాంకుతో సంబంధం లేకపోయినా.. సదరు సమస్యలను పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. ఆయా సమస్యలు తమపై ప్రభావం చూపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అదే.. సరిహద్దు ప్రాంత ఎమ్మెల్యేలు. మన …
Read More »రాజుగారి లాయర్లు ఫుల్ హ్యాపీ
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం భలే విచిత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు విషయంలో తొందరలోనే సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికి ఇదే విషయమై సీబీఐ ప్రత్యేక కోర్టులో వేసిన పిటీషన్ను కొట్టేశారు. అక్కడ నుండి హైకోర్టులో కేసు వేశారు. ఇక్కడ విచారణ అయిపోయి తీర్పును రిజర్వులో ఉంచారు. అయితే చివరి రోజు విచారణలో న్యాయమూర్తి చాలా తీవ్రంగానే స్పందించారు. రాజు లాయర్ కు సాక్ష్యాలు ఏవంటూ …
Read More »నోరు జారి.. ఇచ్చిన హామీ.. సోముకు పదవీ గండం!
రాజకీయాల్లో ఉన్న నాయకులు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ చిన్న తేడా వచ్చినా.. పరిస్థితి చేయి దాటి పోవడం ఖాయం. బీజేపీ రాష్ట్ర చీఫ్.. ఆర్ ఎస్ ఎస్ వాది సోము వీర్రాజు చేసిన ఒకే ఒక్క కామెంట్.. సంప్రదాయ బీజేపీ వాదులను పార్టీకి దూరం చేసే ప్రమాదాన్ని తీసుకువచ్చింది. అంతేకాదు.. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మీడియా ఇప్పుడు ఆయనను ఏకేస్తోంది. దీంతో సోము వ్యాఖ్యలపై …
Read More »రాధా నామాట విను.. చంద్రబాబు సలహా
టీడీపీ అధినేత చంద్రబాబు సాధారణంగా.. ఉదయం 8 గంటల తర్వాత కానీ.. ఏ పనినీ మొదలు పెట్టరు. ప్రస్తుతం ఆయన విపక్షంలో ఉన్నారు కాబట్టి.. కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. అదే అధికారంలో ఉండి ఉంటే.. ఆ లెక్క వేరు. ఉదయం 6 గంటలకే పనులు ప్రారంభించేవారు. అయితే.. ఆయన బుధవారం అనూహ్యంగా ఉదయం 6 గంటలకే లైన్లోకి వచ్చేశారు. తెలతెల వారుతూనే ఆయన చర్యలు ప్రారంభించారు. ఒకవైపు పార్టీ కీలక …
Read More »టీడీపీలో మూడు ముక్కలాట!
ఏపీలో ఖాళీగా ఉన్న ఇన్చార్జ్ పదవులను పార్టీ అధినేత చంద్రబాబు వేగంగా భర్తీ చేస్తూ వస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గాలపై కూడా ఆయన సమీక్షించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్చార్జి పదవులను భర్తీ చేస్తున్న బాబు పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు – చింతలపూడి నియోజకవర్గాలపై దృష్టి పెట్టడంలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త ఇన్చార్జిలుగా ఎవరిని ఎంపిక చేస్తారా ? …
Read More »31 కేసులున్న జగన్కు సీఎం పోస్ట్ ఇచ్చి తప్పు చేశారు.. సోము వీర్రాజు
రాష్ట్ర బీజేపీ నాయకులు విజయవాడలో నిర్వహిస్తున్న ప్రజాగ్రహ సభ రాజకీయ విమర్శలకు, హాట్ కామెంట్లకు వేదికగా మారింది. ఈ సభలో వైసీపీ సర్కారు వైఫల్యాలను పార్టీ నేతలు ఓ రేంజ్లో ఎండగట్టారు. సీఎం జగన్.. లేనిపోని వైరాలతో ఏపీని అభివృద్ధికి దూరం చేశారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతేకాదు.. 31 సీబీఐ కేసులున్న జగన్కు సీఎం పోస్టు …
Read More »చిరు సినిమాకు చంద్రబాబు పర్మిషన్ ఇవ్వలేదా?
ఆంధ్రప్రదేశ్లో ఇంకే సమస్యా లేనట్లు సినిమా టికెట్లు, థియేటర్ల వ్యవహారాన్ని నెత్తికెత్తుకుంది అక్కడి యంత్రాంగం. ఉన్నతాధికారులు థియేటర్ల మీద దాడులు చేస్తుంటే.. మంత్రులు టికెట్ల ధరల అంశం మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎవరు కాస్త నోరు విప్పినా.. వారిని గట్టిగా కౌంటర్ చేస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రుల టార్గెట్గా మారాడు నేచురల్ స్టార్ నాని. టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వ తీరును …
Read More »