దళితులను జగన్ ప్రభుత్వం వేధిస్తోంది: నారా లోకేష్‌!

దళితులను జగన్ ప్రభుత్వం  వేధిస్తోందని… అక్రమ కేసులు పెట్టి భవిష్యత్తు లేకుండా చేస్తుందని తెలుగుదేశం  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం నాడు పెదకూరపాడులో ఎస్సీ సామాజికవర్గ నేతలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు.

ఈసందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రద్దు చేస్తున్నారు.విదేశీ విద్య పథకం రద్దు చేయడంతో దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ఫీజు రీయింబర్స‌మెంట్ పథకం అములు కాక సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు.జగన్ పాలనలో కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు. టీడీపీ హయాంలో ఎస్సీలకు సబ్సిడీలో జేసీబీలు, ఇన్నోవాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు లేక కిస్తీ కూడా కట్టలేని పరిస్థితి.

తన నాలుగేళ్ల చిన్నారి తప్పిపోయి మూడేళ్లు అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని లోకేష్ ముందు దళితుడు రమేష్ కన్నీరు పెట్టుకున్నారు. ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయాయి. పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇతర రాష్ట్రాలకి వెళ్లి పనులు చేసుకుంటున్నాం. దళితుల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది.

చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదు.ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలి. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దళిత ఉద్యోగులను వేధిస్తుంది.ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిని కూడా తొలగించారు’’ అని నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.