ఓ వైపు పార్టీలోని సీనియర్ నేతల నుంచి అసంతృప్తి.. మరోవైపు బీజేపీ దూకుడుతో రేసులో వెనకబడిపోతున్నామనే వ్యాఖ్యలు.. ఇక ఆ పార్టీ పుంజుకోవడం కష్టమేనన్న అంచనాలు.. ఇలా అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముడుతున్నా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రమే తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నా.. రాజీనామా చేస్తామంటూ సీనియర్ నేతలు చెబుతున్నా.. వాటిని పక్కకు పెట్టి పార్టీని …
Read More »బీజేపీని తిడుతున్నా.. టీఆర్ఎస్‌ను పొగిడేసిన పవన్
రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఉండడం సహజమే. ఎన్నికల్లో విజయం కోసమో తమ ప్రయోజనాల కోసమో.. ఇలా పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి. ఇలా బంధం ఏర్పరుచుకున్న రెండు పార్టీలు కలిసికట్టుగా ఒకే మాట మీద సాగుతాయని తెలిసిందే. విమర్శలైనా.. ఆరోపణలైనా.. కౌంటర్లైనా తమ ప్రత్యర్థి పార్టీల మీద కలిసికట్టుగా దాడి చేస్తాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడు ఓ రెండు పార్టీల మధ్య పొత్తు పరిస్థితి విచిత్రంగా ఉంది. …
Read More »అన్నంత పనీ చేస్తున్న జగ్గారెడ్డి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నంత పనీ చేస్తున్నారు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని.. అవమానిస్తున్నారని త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇటీవల చెప్పుకొచ్చారు. అధిష్ఠానానికి 15 రోజుల గడువు ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ తో తనకు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని తన బాధనంతా వారితో చెప్పుకుంటానని తెలిపారు. లేదంటే పార్టీని విడిచి పెడతానని బెదిరిస్తున్నారు. అయితే.. పార్టీ సీనియర్లు నచ్చచెబుతున్నా జగ్గారెడ్డి …
Read More »వివేకా హత్య.. ఎంపీ అవినాశ్‌రెడ్డి పెద్దనాన్న ఇచ్చిన వాంగ్మూలం ఇదే
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ వై.ఎస్. అవినాశ్‌రెడ్డి పెదనాన్న వై.ఎస్. ప్రతాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. 2021 ఆగస్టు 16వ తేదీన సీబీఐకి ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు. గుండెపోటుతో రక్తపు వాంతులు చేసుకుని వివేకా మృతి చెందినట్లు… తన సోదరుడు వై.ఎస్. మనోహర్‌రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం ఆరున్నరకే తనకు చెప్పారన్నారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి, …
Read More »పవన్ హవాను జగన్ నిలువరించగలరా?
సినిమా వేరు, రాజకీయం వేరు అని అనుకున్న ప్రతి సందర్భంలోనూ జగన్ మరియు పవన్ మధ్య యుద్ధం నడుస్తూనే ఉంది. కానీ సినిమా పరంగా పవన్ ను ఇప్పటికిప్పుడు ఢీ కొనేంత శక్తి జగన్ కు లేదు గాక లేదు. ఇదే సమయంలో రాజకీయంగా జగన్ ను ఢీ కొన్నా పవన్ ఆశలు అనుకున్నంత సులువుగా నెరవేరవు గాక నెరవేరవు. అయినా కూడా ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు పై …
Read More »సతీష్ రెడ్డి.. ఏమిటీ గతి?
పులివెందులలో వైఎస్ కుటుంబంపై పోటీ చేసిన నేతగా ఆయనకు గొప్ప పేరుంది.. తెగించి మరీ పార్టీని ముందుకు నడిపారనే గుర్తింపు ఉంది. కానీ ఆ నేత ప్రస్తుత రాజకీయ భవిష్యత్ అయోమయంగా మారింది. ఇప్పుడు ఏ పార్టీలో లేక.. ఏం చేయాలో పాలుపోక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని తెలిసింది. ఆ నాయకుడే సతీష్ రెడ్డి. కడప జిల్లా సీనియర్ నేత అయిన సతీష్ ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. టీడీపీకి రాజీనామా …
Read More »భీమ్లాతో పండగ చేసుకుంటున్న వైసీపీ!
పోయినేడాది వకీల్ సాబ్.. ఇప్పుడేమో భీమ్లా నాయక్.. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాలపై ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జగన్ సర్కారు ఎలా ఉక్కుపాదం మోపిందో అందరికీ తెలుసు. వకీల్ సాబ్‌కు ఉన్నట్లుండి టికెట్ల రేట్లు తగ్గించేసి, స్పెషల్ షోలేవీ పడకుండా చూసి ఆ సినిమాను గట్టి దెబ్బే తీసింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలోనూ అదే జరుగుతోంది. టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను వేరే …
Read More »జగన్ మాటకు విలువ లేదా?
టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తాం. త్వరలోనే కొత్త రేట్లు వస్తాయి. ఐదో షోకు కూడా అనుమతి ఇస్తాం.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు తనను కలిసినపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలివి. ఇప్పుడున్న రేట్లతో థియేటర్లు నడపడం కష్టమన్న వాదనతో ఆయన ఏకీభవించారు. టికెట్ల ధరలు సవరించాల్సిన అవసరాన్ని గుర్తించినట్లే మాట్లాడారు. ఆయనతో పాటు చిరు బృందంలోని వారు …
Read More »అమరావతి: ఉద్యమం ఆగదు ఫలితం తేలదు?
అమరావతి ఉద్యమానికి 800 రోజులు పూర్తయ్యాయి నేటితో..ఈ నేపథ్యంలో ఉద్యమం ఉద్ధృతి మాత్రం తగ్గబోదని సంబంధిత నిరసనకారులు, భూములు ఇచ్చి సర్వం కోల్పోయిన రైతులు ముక్త కంఠంతో చెబుతున్నారు.ఆ రోజు తాము భూములు ఇచ్చింది రాష్ట్రా ప్రభుత్వానికే తప్ప చంద్రబాబు కో లేదా తెలుగుదేశం పార్టీ కో కాదని అంటూ వీళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. తమ సమస్యను కులం కోణంలో కాకుండా సామాజిక ఇతివృత్త పరంగా చూడాలని వేడుకుంటున్నారు. ఈ …
Read More »పవన్‌కు మద్దతుగా సీమ రెడ్డి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `బీమ్లా నాయక్` ఓ వైపు విడుదలకు సర్వం సిద్ధం చేసుకోగా మరోవైపు టికెట్లను జీవో ప్రకారమే విక్రయించాలని మౌఖిక ఆదేశాలు వెలువరించడం సంచలనంగా మారింది. టికెట్ ధరలు పెంచి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడంపై సినీ వర్గాలు, పవన్ ఫ్యాన్స్ స్పందిస్తుండగా తాజాగా రాయలసీమకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రియాక్టయ్యారు. సినిమాలపై …
Read More »ఆనం చూపు.. మళ్లీ టీడీపీ వైపు!
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతలే వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. అలాంటి నాయకుల్లో వైసీపీ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై జగన్‌ను కలవాలనుకుంటే ఆయనకు అపాయింట్‌మెంట్ దొరకలేదని …
Read More »తనయుడి కోసం తప్పుకోనున్న బొత్స!
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ తన పొలిటికల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారా? రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి తన తనయుడి రంగప్రవేశం కోసం ఆయన తప్పుకుంటున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరని, తన కొడుకును బరిలో దించుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయాలకు, వయసుకు పెద్దగా సంబంధం లేకపోయినా బొత్స సత్యనారాయణ ప్రస్తుతమున్న రాజకీయాల నుంచి …
Read More »