త్వరలో జనసేన ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేయనుంది. ఇందుకు సంబంధించి సన్నాహాలు సైతం చేస్తోంది.ఇప్పటికే వైసీపీలో ఉంటూ, అధికారం ఉండి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేని అవస్థ తమదని,తమ స్వేచ్ఛను ముఖ్యమంత్రి హరిస్తున్నారని భావిస్తున్న కీలక నేతలంతా తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన పిలుపునిస్తోంది.ఈ నేపథ్యంలో జనసేన తరఫున కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.ఇదే సమయంలో అటు టీడీపీ నుంచి కొందరు ఇటుగా వచ్చే అవకాశాలు …
Read More »రేవంతా.. మజాకా.. నిశ్చేష్టులైన అధికారులు..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. తన ప్రసంగంలో ఎంత వాడి వేడి ఉంటుందో చూపించారు. తనకు పదవులు ఊరికే రాలేవని.. తనకున్న ప్రతిభ ఏమిటో చాటి చెప్పారు. ఆయనకున్న సబ్జెక్టును ఇంకోసారి బయటపెట్టి అధికారులను నిశ్చేష్టులను చేశారు. 2022-23 సంవత్సరానికిగాను రూ.6831 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచాలని విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన ప్రతిపాదనలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి శుక్రవారం …
Read More »పవన్ ఫ్యాన్స్ కు కూడా షాకిచ్చిన జగన్ సర్కారు
మునెపెన్నడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు చెందిన భీమ్లానాయక్ సినిమా ఫ్యాన్స్ తో పాటుగా రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో టిక్కెట్ ధరలు పెంచడం, ఐదో షోకు అనుమతులు ఇవ్వగా ఏపీలో ఈ మేరకు వెసులుబాటు దక్కలేదు. అయితే, తెలంగాణ సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తూ పవన్ అభిమానులు కేసీఆర్ మీద తమ అభిమానాన్ని చాటుకున్నారు. …
Read More »భీమ్లా నాయక్ : బొత్సతో పవన్ కు చెడిందా?
మెగా ఫ్యామిలీతో ఎంతో సన్నిహితంగా మెలిగే మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్నటి వేళ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.భీమ్లా నాయక్ సినిమా విడుదలను వాయిదా వేసుకోవాల్సిందని అన్నారు.ప్రభుత్వ నిబంధనలు,టికెట్ ధరలు నచ్చకపోతే సినిమా విడుదలనే వాయిదా వేసుకోవాల్సిందని, తాము చట్టప్రకారమే ముందుకు వెళ్తామని అన్నారు.ఈ వ్యాఖ్యలే ఇప్పుడు మరింత చర్చకు తావిస్తున్నాయి.ఎందుకంటే బొత్సకూ,పవన్ కూ మంచి అనుబంధం ఉంది.ఎప్పుడో కానీ బొత్స మీడియా ముందుకు వచ్చి పవన్ …
Read More »ఆంధ్రాలో కేసీఆర్ కటౌట్లు దేనికి సంకేతం?
ఏపీలో తన సినిమాను బతకనివ్వడం లేదు అని,వకీల్ సాబ్ మొదలుకుని భీమ్లా నాయక్ వరకూ జగన్ సర్కారు తనను వేధిస్తూనేఉందని పవన్ వాపోతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ వాకిట తన సినిమాకు ఐదు షోలు ఇవ్వడంపై ఆయన వర్గం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఓ వైపు ఆంధ్రాకు సినిమా ఇండస్ట్రీ తరలి రావాలని జగన్ చెబుతూనే మరోవైపు మాత్రం కనీసం టికెట్ల విషయమై కొత్త జీఓ ఇవ్వకపోగా, సవరించిన ధరలపై …
Read More »బాబు వస్తానంటే.. ఎన్టీఆర్ వద్దన్నారంటా!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీలోకి వస్తానంటే మొదట స్వర్గీయ ఎన్టీఆర్ వద్దన్నారంటా? ఈ విషయాన్ని ఎవరో కాదు.. స్వయంగా బాబే వెల్లడించారు.తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిది నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ జీవితం. ఈ పొలిటికల్ కెరీర్‌లో ఆయన ఎన్నో చూశారు. మొదటిసారిగా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 44 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆయన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆసక్తికర వ్యాఖ్యలు …
Read More »అన్ని వేళ్లూ తనవైపే.. అయినా అవినాష్ మౌనమేల?
వైఎస్ వివేకానంద హత్య కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీబీఐకి కొంతమంది ఇచ్చిన వాంగ్మూలాలు వెలుగులోకి రావడంతో అనూహ్యమైన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన వాంగ్మూలాల వివరాల ప్రకారం అన్ని వేళ్లూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డివైపే చూపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివేకాను ఆయనే హత్య చేయించారనే అభిప్రాయాలు కలిగేలా ఈ వాంగ్మూలాలు ఉన్నాయి. తన మెడకు ఉచ్చు బిగుస్తుందని తెలిసి కూడా అవినాష్ ఎందుకు సైలెంట్‌గా …
Read More »రష్యాను ఎదిరించే దమ్మే లేదా
రష్యాను ఎదిరించే ధైర్యం ప్రపంచంలో ఏ దేవానికి లేదా ? ఇపుడిదే విషయమై చర్చ పెరిగిపోతోంది. రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ అనేది చాలా చిన్నదేశం. ఏ విధంగా తీసుకున్నా ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య లేదా యుద్ధానికి దిగటం ఆమోదయోగ్యం కానేకాదు. కానీ ప్రపంచదేశాలతో సంబంధం లేకుండానే తన సొంతప్రయోజనాలే లక్ష్యంగా రష్యా యుద్ధానికి దిగేసింది. రష్యా దెబ్బకు ఉక్రెయిన్ ఇపుడు విలవిల్లాడుతోంది. యుద్ధం ఆరంభానికి ముందు నాటో …
Read More »పవనన్నకు ప్రాణం ఇస్తాం.. జగనన్నకు ఓటు వేస్తాం
సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. సినిమా రంగం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో రాణిస్తారనే గ్యారంటీ ఉండదు. వెండితెరపై తమ ఆరాధ్య నటుడిని చూసి ఈలలు వేసే జనం.. ఎన్నికల్లోనూ ఓట్లు వేస్తేనే ఆ నటుడు రాజకీయ నాయకుడు అవుతారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇలాగే సినీ రంగం నుంచి వచ్చి గొప్ప నాయకులుగా ఎదిగిన వాళ్లు ఉన్నారు. మరోవైపు ఆ అభిమానం ఓట్లుగా మారకపోవడంతో దెబ్బతిన్న …
Read More »మోడీ మెడకు 6000 కోట్ల గుజరాత్ స్కాం?
మంచి అయినా… చెడు అయినా కావచ్చు గుజరాత్ లోని పరిణామాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కనెక్ట్ అయిపోతాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్థానికంగా జరిగే అభివృద్ధి పనులు, రాజకీయాలు, అవకతవకలు బీజేపీ రథసారథిని టార్గెట్ చేస్తుంటాయి. తాజాగా ఓ భారీ కుంభకోణం విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. గుజరాత్‌లో రూ.6 వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగినట్టు వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్ తెలిపింది. ఈ …
Read More »జనసేన జేబు నింపుతున్న జగన్
జగన్ ఏంటి.. జనసేన జేబు నింపడం ఏంటి అని ఆశ్చర్యంగా అనిపిస్తోందా? అదే చిత్రం. జనసేనాని దెబ్బ కొట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని పవన్ అభిమానులు, జనసైనికులు తిప్పికొట్టే క్రమంలో జరుగుతున్న ఆశ్చర్యకర పరిణామమిది. 2014లో తాను ముఖ్యమంత్రిని కాకపోవడానికి చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణే కారణమని నమ్మే జగన్.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా జనసేన అధినేతను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో …
Read More »అసెంబ్లీకి వెళ్లాలా? వద్దా?
తెలుగు దేశం పార్టీ ఇప్పుడో గొప్ప సందిగ్ధంలో పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అని మల్లగుల్లాలు పడుతోంది. వచ్చే నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే ఆ అసెంబ్లీ సమావేశాల సమాచారం వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు లేకుండా సభకు వెళ్లడంపై టీడీపీ నేతల మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశాలకు వెళ్లడంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి పార్టీ రాలేదని తెలిసింది. బాబు శపథం..నిరుడు అసెంబ్లీ …
Read More »