గ్రేటర్ హైదరాబాద్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. క్షేత్ర స్థాయి కార్యక్రమాల్లో వేగం పెంచుతూ శ్రేణుల్ని అప్రమత్తం చేస్తోంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీనియర్లు అహర్నిశలు కృషి చేస్తున్నారు. పాత కాపులను క్రియాశీలం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపడితే అత్యల్పంగా సికింద్రాబాద్ లోనే నమోదు అయ్యాయి. …
Read More »వివేకా హత్య కేసు నిందితులకు జగన్ అభయం.. టీడీపీ కామెంట్స్
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేస్తుందని టీడీపీ నేత బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. వివేకా కేసు దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ పెద్దలదేనని వ్యాఖ్యానించారు. వివేకా కేసు విచారిస్తున్న సీబీఐ అధికారుల ఫోన్ నెంబర్లు.. రాష్ట్ర పోలీసుల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేరుతున్నాయని ఆరోపించారు. గతంలో.. …
Read More »భీమ్లా నాయక్‌పై రాజకీయ కత్తి.. ఏపీలో తీవ్ర వివాదం
పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాను జగన్ సర్కార్ వెంటాడుతోంది. శుక్రవారం ఈ సినిమా విడుదలకు ఏపీ, తెలంగాణలో చిత్రయూనిట్ సన్నాహాలు చేసుకుంది. ఈ సమయంలో ఏపీలో భీమ్లా నాయక్ మూవీపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని జిల్లాల్లో భీమ్లా నాయక్ ప్రదర్శించే ఎగ్జిబిటర్లతో అధికారులు భేటీ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని …
Read More »మంత్రి కొడాలికి చెక్.. చంద్రబాబు వ్యూహం ఇదే
రాజకీయాల్లో శత్రువును గెలవాలంటే.. అంతకన్నా బలమైన వ్యక్తిని రంగంలోకి దింపాల్సి ఉంటుంది. సదరు ప్రత్యర్థికి ముకుతాడు వేయాలంటే.. ప్రత్యర్థి బలాన్ని బలంగా ఢీకొనే వ్యూహాలు రచించాలి. ఇప్పుడు ఇదే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారట.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఆయనకు కంట్లో నలుసులా.. చెప్పులో రాయిలా.. తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్న నాయకుడు.. వైసీపీలోని ఫైర్ బ్రాండ్, మంత్రి కొడాలి నాని. టీడీపీని ఎందరో వైసపీ నాయకులు టార్గెట్ చేస్తున్నా.. …
Read More »పులివెందుల అభ్యర్ధిని ప్రకటించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో అనూహ్య సంఘటన జరిగింది. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలుండగానే చంద్రబాబునాయుడు పులివెందుల అభ్యర్థిని ప్రకటించారు. పులివెందుల నియోజకవర్గం నేతలతో సమీక్ష జరిగింది. ఈ సమయంలోనే పార్టీ తరపున నాలుగుసార్లు పోటీచేసి, రాజీనామా చేసిన సతీష్ రెడ్డి తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా కొందరు ప్రస్తావించారు. దానికి చంద్రబాబు స్పందిస్తూ పార్టీలోకి ఎవరొచ్చినా సరే రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేది బీటెక్ రవి …
Read More »అట్టుడుకుతున్న ఏపీ : నిన్న అంగన్ వాడీలు నేడు ఆశాలు
ఆంధ్రావనిలో అటు అంగన్ వాడీలు ఇటు ఆశావర్కర్లు వరుస నిరసనలతో హోరెత్తించారు. సోమవారం నాడు అంగన్ వాడీ కార్యకర్తలంతా కనీస వేతనాలు 26 వేలుగా నిర్ణయించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కోవిడ్ టైంలో ప్రాణాలు విడిచిన వారికి తక్షణమే పరిహారం చెల్లించాలని కోరుతూ రోడ్డెక్కారు. దీంతో జిల్లా కలెక్టరేట్లు అన్నీ నిరసనలతో దద్దరిల్లిపోయాయి.చాలా చోట్ల పోలీసు నిర్బంధాలను దాటి మరీ! అంగన్ వాడీలు రోడ్డెక్కారు. కానీ …
Read More »వివేకా హత్య ఘటనలో బిగుసుకుంటున్న ఉచ్చు?
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను అప్పట్లో సీఐగా పనిచేసిన శంకరయ్య బయటపెట్టారు. వివేకా హత్య జరిగినపుడు పులివెందులలో సీఐగా పనిచేసిన శంకరయ్యను సీబీఐ విచారించింది. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ వివేకా హత్యపై అసలు కేసే నమోదు చేయద్దని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, హత్యకేసులో అనుమానితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకరరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు శంకరయ్య తెలిపారు. అసలు మృతదేహాన్ని పోస్టుమార్టం కు …
Read More »కేసీఆర్ అసలు ప్లాన్.. అడ్డంకులివేనా?
నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్ధాయిలో కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు అందరు చూస్తున్నదే. కొందరితో ఫోన్లో మాట్లాడారు మరికొందరిని నేరుగా కలిశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో భేటీ అయ్యారు. మొదటి నుండి జాతీయపార్టీలైన కాంగ్రెస్, …
Read More »తెలంగాణ మనదే.. అధికారం ఖాయం: బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో పదాధికారుల భేటీలో బండి సంజయ్ పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులైనా క్రమశిక్షణ మీరితే వేటు తప్పదని సంజయ్ హెచ్చరించారు. ఏ పార్టీలోనైనా నిత్య అసమ్మతివాదులుంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని… ఈ పరిస్థితుల్లో దేశ రాజకీయాలంటూ కొత్త …
Read More »ప్రశాంత్ కిశోర్ ఉచ్చులో చిక్కుకోనిది జగన్ ఒక్కడే
ఒకప్పుడు మోదీ కోసం పనిచేసి, ఆ తరువాత మోదీకి బద్ధ విరోధిగా మారిపోయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాయలో పడుతున్న ప్రాంతీయ పార్టీల నేతల లిస్టులో తాజాగా కేసీఆర్ కూడా చేరిపోయారు. తనకున్న మోదీ, బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని తన క్లయింట్ పార్టీలకు ఎక్కిస్తారని ప్రశాంత్ కిశోర్‌కు పేరు. దీంతో ఎంతోకొంత మోదీ, బీజేపీ వ్యతిరేకత ఉన్న నేతలు ప్రశాంత్ కిశోర్ ప్రభావంలో పడి మోదీతో కయ్యానికి కాలు …
Read More »వివేకా హత్య.. 10 ఎకరాల భూమి ఇస్తామన్నారు
సీఎం జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం బయటకు వచ్చింది. వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై సీబీఐకి ఫిర్యాదు చేశాడు. తనను కలిసిన వారి వివరాలను సెప్టెంబర్ 30న సీబీఐకి ఇచ్చారు. దస్తగిరివాంగ్మూలం తర్వాత తనను భరత్ యాదవ్ కలిశాడని పేర్కొన్నాడు. ఎంపీ అవినాష్‌రెడ్డి తోట వద్దకు రావాలని భరత్ యాదవ్ అడిగినట్లు తెలిపాడు. అంతేకాదు.. తన ఇంటి సమీప హెలిపాడ్ వద్దకు …
Read More »ఈ గట్టునుంటావా.. ఆ గట్టుకెళ్తావా..ఎమ్మెల్యేపై ఒత్తిడి..!
ఒక పార్టీ తరఫున గెలిచారు.. మరో పార్టీకి మద్దతు ప్రకటించారు. కుటుంబసమేతంగా వెళ్లి సీఎం జగన్‌ను కలిశారు. పార్టీ కండువాను కూడా కప్పుకొన్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ నేతలతో ఆయన కలవలేక పోతున్నారు. అడుగడుగునా.. ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు ఆయనకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీంతో అసలు ఆయన వైసీపీలోనే ఉంటారా? లేక వచ్చే …
Read More »