Political News

ఆముదాలవ‌ల‌స రాజ‌కీయం స‌ల‌స‌ల‌మంటోందే!

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం స‌ల స‌ల‌మంటోంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక్క‌డ చిత్ర‌మైన రాజ‌కీయం క‌నిస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన వారు పోటాపోటీగా రాజ‌కీయాల‌లో త‌ల‌ప‌డ‌తారు. మ‌ళ్లీ వారానికి ఒక‌సారైనా ఇళ్ల‌లో క‌లుసుకుంటారు. ఇదీ.. ఇక్క‌డి రాజ‌కీయం. వారే టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన ర‌వికుమార్‌, ప్ర‌స్తుత వైసీపీ నాయ‌కుడు, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం. ఇద్ద‌రూ కూడా వ‌ర‌సుకు మేన‌ల్లుడు, మేన‌మామ‌లు. కానీ, రాజ‌కీయంగా …

Read More »

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ: వినుకొండ‌లో పోలీసుల కాల్పులు

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని వినుకొండ‌లో తీవ్ర ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది. టీడీపీ-వైసీపీ నేత‌ల మ‌ధ్య చోటు చేసుకున్న తీవ్ర వివాదం.. పోలీసులు గాలిలోకి కాల్పులు జ‌రిపే వ‌ర‌కు చేరింది. దీంతో ఇక్క‌డ ప‌రిస్థితి ర‌ణ‌రంగంగా మారింది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హింసకు దారి తీసింది. వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు మ‌ట్టి, ఇసుక అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. కోట్ల రూపాయ‌లు దోచుకుంటున్నార‌ని కొన్నాళ్లుగా టీడీపీ నాయ‌కులు …

Read More »

డేంజ‌ర్లో క‌డెం ప్రాజెక్టు

భారీ వ‌ర్షాల కార‌ణంగా నిర్మ‌ల్ జిల్లాలోని క‌డెం ప్రాజెక్టు ప్ర‌మాదంలో ప‌డేలా క‌నిపిస్తోంది. వ‌ర‌ద ముప్పు పొంచి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఈ ప్రాజెక్టుకు 3 ల‌క్ష‌ల 87 వేల క్యూసెక్కుల వ‌ర‌ద ప్ర‌వాహం వ‌స్తోంది. ప్రాజెక్టులో ప్ర‌స్తుత నీటి మ‌ట్టం 697 అడుగుల‌కు చేరుకుంది. ఈ ప్రాజెక్టు గ‌రిష్ఠ నీటి మ‌ట్టం 700 అడుగులుగా ఉంది. ఈ భారీ వ‌ర్షం కార‌ణంగా మ‌రింత వ‌ర‌ద ప్ర‌వాహం ప్రాజెక్టును …

Read More »

జనసేన … ఇంకా ఇంకా స్పీడు పెంచాలండీ

జ‌న‌సేన పార్టీ విష‌యం ఏపీలో త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌చుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని.. చెబుతున్నారు. అంతేకాదు.. ఎవ‌రు ఆపుతారో చూద్దామ‌ని కూడా అంటు న్నారు. ఓకే.. ఎవ‌రు ఆపుతారు..? ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే ప్ర‌భువులు కాబ‌ట్టి.. ఎన్నిక‌ల్లో వారే ఎవ‌రినైనా ముందుకు న‌డిపించాలి.. లేదా వెన‌క్కి తిప్పి కొట్టాలి. సో.. ఈ విష‌యాన్ని తీసుకుంటే.. ప్ర‌స్తుతం జ‌న‌సేన ఊపు ఏమేర‌కు పెరిగింద‌నే …

Read More »

టార్గెట్ వైసీపీ.. టీడీపీ వివేకా వెబ్‌సైట్ లాంచ్‌

ఏపీలో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా అనేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టిన ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ.. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. వివిధ అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసు కువెళ్తోంది. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుతోంది. అదేస‌మ‌యంలో ఇప్పుడు మ‌రో కార్య‌క్ర మానికి కూడా శ్రీకారం చుట్టింది. తాజాగా కొత్త‌గా ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీనిలో సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి …

Read More »

అది కుంత‌ల రాజ్యం.. ఇది గుంత‌ల రాజ్యం: నారా లోకేష్

ఏపీ స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా మ‌రోసారి పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డారు. “బాహుబ‌లి సినిమాలో కుంత‌ల రాజ్యం చూశాం.. ఇప్పుడు ఏపీలో గుంత‌ల రాజ్యం చూస్తున్నాం ” అని పంచ్‌లు పేల్చారు. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న నారా లోకేష్ ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసింది. ఈ క్ర‌మంలో కీల‌క వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి …

Read More »

ఉమెన్ ట్రాఫికింగ్.. ఏపీ, తెలంగాణ‌ల లెక్క తేల్చిన కేంద్రం!

ఉమెన్ ట్రాఫికింగ్‌. ఈ విష‌యం ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం. వారాహి యాత్ర 2.0 చేప‌ట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏలూరులో నిర్వ‌హించిన స‌భ‌లో ఉమెన్ ట్రాఫికింగ్‌లో ఏపీ ముందుంద‌ని, వ‌లంటీర్లు పెద్ద ఎత్తున దీనిని ప్రోత్స‌హిస్తున్నార‌ని వ్యాఖ్యానించి రాజ‌కీయ దుమారానికి తెర‌దీశారు. ఇక‌, ప‌వ‌న్‌కు వైసీపీ నుంచి అదే రేంజ్‌లో ఎదురు దాడి వ‌చ్చింది. స‌రే.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ఉమెన్ …

Read More »

పవన్ పెళ్లిళ్ల గురించి నీకెందుకు జగన్?:నారాయణ

వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, అదే స్థాయిలో పవన్ పై కూడా జగన్, వైసీపీ నేతలు ప్రతివిమర్శలు కూడా చేస్తున్నారు. కానీ, రెండు రకాల విమర్శలు ఒకటి కాదు. పవన్ ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా జగన్ టార్గెట్ చేస్తున్నారని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు దుయ్యబట్టారు. తన పెళ్లిళ్ల గురించి జగన్ …

Read More »

తిరుప‌తి నుంచి ప‌వ‌న్ కాదు.. మ‌రి ఎవ‌రు?

అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వారాహి యాత్ర‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆ పార్టీ సాగుతోంది. ఇప్ప‌టికే బీజేపీతో పొత్తులో ఉన్న జ‌న‌సేన‌.. ఎన్నిక‌ల్లో టీడీపీతోనూ క‌లిసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో సీట్ల స‌ర్దుబాటు ఎలా అనే ప్ర‌శ్న‌లు క‌లుగుతున్నాయి. కానీ జ‌న‌సేన మాత్రం తాను కోరుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌చ్చితంగా పోటీ చేసేలా క‌నిపిస్తోంది. ఇందులో తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంపై జ‌న‌సేన ప్ర‌త్యేక …

Read More »

మోడీకే మ‌ద్ద‌తు.. వైసీపీ తేల్చేసింది!

పార్ల‌మెంటులో ఈ రోజు జ‌రిగిన ప‌రిణామాలు మ‌రోసారి వైసీపీ-మోడీ మ‌ధ్య బంధాన్ని స్ప‌ష్టం చేశాయి. తాజాగా పార్ల‌మెంటులో మోడీ స‌ర్కారుపై ప్ర‌తిప‌క్ష కూట‌మి పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాయి. ఈ రోజు ఉద‌యం స‌భ ప్రారంభం కాగానే.. మోడీ స‌ర్కారుపై విశ్వాసం లేదంటూ.. కాంగ్రెస్ స‌భ్యుడు గొగోయ్ అవిశ్వాస తీర్మానాన్ని స్పీక‌ర్ ఓం బిర్లాకు అందించారు. దీనిని దాదాపు ఇండియాలోని అన్ని ప‌క్షాలు స‌మ‌ర్థించాయి. అయితే.. ఇండియాలోనే ఉన్నా.. …

Read More »

కేసీఆర్ స‌ర్కారుపై బాబు ప్రేమ‌.. ఇక టీ టీడీపీ ఎందుకు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరిగి పార్టీని అధికారంలోకి తేవాల‌ని చూస్తున్న టీడీపీ అధినేత‌.. అధికార వైసీపీ ప్ర‌భుత్వం, సీఎం జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌ను ప‌దునెక్కించారు. రైతుల స‌మ‌స్య‌లు ప‌ట్ట‌ని వైసీపీ ప్ర‌భుత్వం అంటూ బాబు ధ్వ‌జ‌మెత్తారు. కానీ ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో రైతులు సంతోషంగా ఉన్నారంటూ.. ఇక్క‌డి కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని పొగుడుతూ వ్యాఖ్యానించ‌డం మాత్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ అధినేతే.. కేసీఆర్‌కు సానుకూలంగా మాట్లాడితే ఇక తెలంగాణ‌లో టీడీపీ ఉండ‌డం ఎందుక‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. …

Read More »

వంగ‌వీటి వార‌సురాలు వ‌స్తున్నారా?

వంగ‌వీటి రంగా.. విజ‌య‌వాడ‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లోనూ కీల‌క పాత్ర పోషించిన దివంగ‌త నాయ‌కుడు. బెజ‌వాడ రాజకీయాల్లో ఆయ‌న ఆధిప‌త్యం గొప్ప‌గా సాగింది. ఈ సారి ఏపీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పేరు నిల‌బెట్టాల‌నే ల‌క్ష్యంతో.. వంగ‌వీటి రంగా కుమార్తె ఆశాల‌త రాజ‌కీయం రంగ‌ప్ర‌వేశం చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. తండ్రి వార‌స‌త్వాన్నిపుణికిపుచ్చుకుని రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసేందుకు ఆమె రానున్నార‌ని, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేయ‌నున్నార‌ని స్థానిక రాజ‌కీయ …

Read More »