Political News

విజయ్‌తో పీకే భేటీ.. ఏం జరగబోతోంది?

తమిళనాట రాజకీయాలు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ విజయం చాలా ముందే ఖరారైపోయింది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ అంతకంతకూ బలహీనపడిపోవడం.. మరోవైపు కొత్తగా వచ్చిన కమల్ హాసన్ పార్టీ కనీస ప్రభావం కూడా చూపించలేకపోవడం, మిగతా పార్టీల నుంచి కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో ఎన్నికల్లో విజయం స్టాలిన్‌కు నల్లేరుపై నడకే అయింది.  ఇక ఎన్నికల్లో గెలిచాక స్టాలిన్ …

Read More »

జ‌న‌సేన లోకి టీడీపీ నేత‌లు.. నిజ‌మేనా?

ఏపీలో రాజ‌కీయాలు మారుతున్నాయి. నాయ‌కులు ఎటు నుంచి ఎటైనా జంప్ చేసే ప‌రిణామాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. దీనికి ప్ర‌ధానంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని అధికారంలో నుంచి దింపేయ‌డ‌మే ల‌క్ష్యం! అది కూడా టీడీపీ నుంచే జంపింగులు ఉంటాయ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అదేంటి.. చిత్రంగా ఉందే! అనుకుం టున్నారా? అస‌లు విష‌యానికి వ‌స్తే.. వచ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో చిత్ర‌మైన పొత్తులు తెర‌మీదికి వ‌స్తున్నాయనే  సంకేతాలు వ‌చ్చాయి. ఇటీవ‌ల జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. …

Read More »

చంద్రబాబు పెగాసస్ కొన్నారా?

తన హయాంలో చంద్రబాబు నాయుడు వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ కొన్నారా ? కొన్నారనే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు . చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొన్నట్లు మమత చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. సాఫ్ట్ వేర్ కొనుగోలుపై తమను ఇజ్రాయెల్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఎస్ఓ సంస్ధ సంప్రదించిందని మమత అన్నారు. ఇజ్రాయెల్ అడిగినా తాము ఆ సాఫ్ట్ వేర్ …

Read More »

ఏపీ వైద్యులకు సెల్ఫీ షాకులిచ్చిన జగన్ సర్కార్

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ వైద్యులకు గుదిబండలా మారటమే కాదు.. పేషెంట్లకు వైద్యం చేయటం కంటే.. రోజువారీగా పోస్టు చేయాల్సిన సెల్ఫీలతోనే పుణ్యకాలం గడిచేలా తాజా నిర్ణయం ఉందంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు తీసుకున్న ఈ సెల్ఫీ నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా తాజా మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ పాలసీ ప్రకారం చూస్తే.. ఏపీ వ్యాప్తంగా …

Read More »

రెబల్ ఎమ్మెల్యేతో జగన్ ఆసక్తికరమైన భేటీ

YS Jagan Mohan Reddy

శాసనసభలో గురువారం ఆసక్తికర ఘటన జరిగింది. అదేమిటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో నెల్లూరు జిల్లా ఎంఎల్ఏ ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. మామూలుగా అయితే సీఎంతో ఎంఎల్ఏ భేటీ అవ్వడం చాలా సహజమే. కానీ ఇక్కడ ఎందుకని ఆసక్తిగా మారిందంటే గడచిన మూడేళ్ళుగా ప్రభుత్వంపై ఆనం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఎంతో సీనియర్ అయిన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదనే అసంతృప్తి జగన్ పై ఆనంలో బాగా …

Read More »

ప‌వ‌న్ లేకుండా బీజేపీ ఏం చేస్తుంది?

దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల‌కు పైగా స‌మ‌యం ఉంది. అందులో భాగంగానే 2024లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. కానీ ఇప్ప‌టి నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని రాజ‌కీయ పార్టీలు వేడి రాజేస్తున్నాయి. ఏపీలో రాజ‌కీయాలు ఇప్ప‌టికే ఊపందుకున్నాయి. పొత్తులు, సీట్ల వ్య‌వ‌హారంపై అప్పుడే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. సీఎం జ‌గ‌న్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించేందుకు విప‌క్షాలు ఏకమ‌య్యేలా క‌నిపిస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే పొత్తులో ఉన్న జ‌న‌సేన‌, బీజేపీ …

Read More »

జ‌గ‌న్‌కు పూర్తి వ్య‌తిరేకంగా కేసీఆర్‌!

ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్‌, కేసీఆర్‌కు వ్య‌క్తిగ‌తంగా మంచి సంబంధాలే ఉన్నా రాజ‌కీయాలు, పాల‌న పరంగా అభిప్రాయ భేదాలున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని విష‌యాల్లో రెండు రాష్ట్రల ప్ర‌భుత్వాల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇక పాల‌న విష‌యానికి వ‌స్తే కూడా ఇరు సీఎంల‌ది వేర్వేరు దారులు. తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్న బీజేపీపై కేసీఆర్ పోరాటం చేస్తుంటే.. ఏపీకి ఏమీ ఇవ్వ‌ని కేంద్ర ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ మాత్రం మౌనంగా ఉంటున్నారు. …

Read More »

ఏడేళ్లుగా ఇవే రాజీనామా ఆట‌లు.. కాంగ్రెస్‌కు బోర్ కొట్ట‌ట్లేదా?

దేశ రాజకీయాల్లో ఘ‌న చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఒక‌ప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన ఆ పార్టీ ఇప్పుడు క‌నీసం స‌మ‌ర్థ‌వంత‌మైన అడుగులు కూడా వేయ‌డం లేదు. కేంద్రంలో వ‌రుస‌గా అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు చేతుల్లో ఉన్న రాష్ట్రాల‌నూ చేజార్చుకుంటోంది. కానీ పార్టీ అధిష్ఠానం వైఖ‌రిలో మాత్రం ఎలాంటి మార్పు రాక‌పోవ‌డం ఆ పార్టీ శ్రేణుల‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది. కాంగ్రెస్‌లో …

Read More »

పవన్‌కు నేషనల్ ఎలివేషన్

దక్షిణాది ఎంత పెద్ద రాజకీయ పరిణామాలు నార్త్ ఇండియన్స్ పెద్దగా పట్టించుకోరు. నేషనల్ మీడియా కూడా సౌత్ వ్యవహారాలపై శీత కన్నేస్తూ ఉంటుంది. ఇక్కడి నాయకులు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చినా వాటికి మీడియాలో ప్రాధాన్యం దక్కదు. సోషల్ మీడియాలోనూ లోకల్‌ జనాలు చర్చలు పెట్టడమే తప్ప.. ఉత్తరాది వాళ్లు మన టాపిక్స్ మాట్లాడటం తక్కువే. అలాంటిది ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ …

Read More »

రాజ‌గోపాల్ బీజేపీలోకే.. ఎనీ డౌట్‌?

కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ దిశ‌గా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ వ్యాఖ్య‌లు ఎవ‌రో చెప్పిన‌వి కావు.. స్వ‌యంగా రాజ‌గోపాల్‌రెడ్డి ప‌రోక్షంగా త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టారు. ఆయ‌న బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నార‌ని తెలిసిపోయింద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. కేసీఆర్‌తో గ‌ట్టిగా కొట్లాడే పార్టీతోనే క‌లిసి ప్ర‌యాణిస్తాన‌ని తాజాగా రాజ‌గోపాల్‌రెడ్డి ప్ర‌క‌టించారు. అంటే తెలంగాణ‌లో …

Read More »

రాజ్య సభకు ఆ వివాదాస్పద క్రికెటర్

ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. సిక్కుల కోటలో కాంగ్రెస్, బీజీపీ సీట్లను చీపురు పెట్టి క్లీన్ స్వీప్ చేశారు కేజ్రీవాల్. భగవంత్ మాన్ వంటి యువనేతను పంజాబ్ 18వ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. పంజాబ్‌లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్…మొత్తం 117 స్థానాలకు గాను 92 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో, …

Read More »

టీఢీపీ: హ‌మ్మ‌య్య ! టాప్ క్లాస్ టాపిక్ దొరికిందోచ్ !

చాలా రోజుల‌కు టీడీపీకి టాప్ క్లాస్ టాపిక్ ఒక‌టి దొరికింది.అదే జంగారెడ్డి గూడెం (ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా) సారా మ‌ర‌ణాలు.దీనిపై నారా లోకేశ్ మొదలుకుని మిగ‌తా నాయ‌కులంతా అదే ప‌నిగా మాట్లాడుతున్నారు.నిన్న‌టివేళ లోకేశ్ ఇంకాస్త గొంతు కూడా పెంచారు.పార్ల‌మెంట్ వేదిక‌గా కూడా టీడీపీ స‌భ్యులు ఇదే విష‌యాన్న ప్రస్తావించారు. యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. త‌మ ప్ర‌భుత్వం ఆ రోజు న‌డుచుకున్న తీరు ఇప్ప‌టి …

Read More »