జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన జగన్ వ్యతిరేక ఓటును చీలనివ్వమన్న మాట.. పొత్తులపై కొత్త ఆశలు చిగురించేలా చేసింది. అయితే.. బీజేపీ రోడ్ మ్యాప్ నకు అనుగుణంగా ముందుకు వెళతామని చెప్పిన పవన్ మాట.. తెలుగు తమ్ముళ్లకు స్పీడ్ బ్రేకర్ మాదిరి పని చేస్తోంది. అయితే.. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో తాము అనుకున్నదే జరుగుతుందన్న ధీమా వ్యక్తమవుతోంది. పొత్తులపై …
Read More »ఓవైసీకి బంపర్ ఆఫర్..
ఒకప్పుడు కాంగ్రెస్ తో సఖ్యంగా ఉన్న ఆ గాలిపటం తరువాత ఆ బంధం ను తెంపుకుని ఇప్పుడు బీజేపీ తో పరోక్ష రీతిలో ప్రేమ పంచుకుంటోంది మరియు ప్రకటించుకుంటోంది. అందుకే ఓవైసీ తనకు తెలియకుండానే బీజేపీకి సాయం చేసి తరువాత దేశం గర్వించే స్థాయి పురస్కారాలకు ఎంపిక అయి ఉంటున్నారన్నది ప్రధాన విపక్షం ఆరోపణ.పైకి ఎంఐఎం ఏం మాట్లాడినా కూడా మతతత్వ పార్టీల అజెండా అంతా ఉద్రిక్తతలకు తావిచ్చేలా మాట్లాడడమేనని …
Read More »కాంగ్రెస్.. ఇక మూసేసుకోవడమే
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిక్కచచ్చిపోయిన కాంగ్రెస్‌కు జవసత్వాలు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం.. విశ్వప్రయత్నాలు చేస్తున్న సమయంలో కీలక నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.. కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆ పార్టీ ఉసురు తీసేస్తున్నాయి. అదేసమయంలో ప్రత్యర్థి పార్టీలకు ఆయుధాలను అందిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. తాజాగా కాంగ్రెస్‌ను పట్టాలెక్కించే కార్యక్రమానికి పార్టీ అధిష్టానం అహర్నిశలు కష్టపడుతోంది. అయితే.. పా ర్టీ జాతీయ నేతలు.. మాత్రం …
Read More »పవన్ సీఎం అభ్యర్థి అయితే..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి అయితే.. ఎలా ఉంటుంది?ఆయనను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. రాజకీయం ఎలా మారుతుంది? ఇదీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ. సామాన్యుల నుంచి మేధావుల వరకు కూడా ఇదే అంశంపై చర్చ చేస్తున్నారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభ నిర్వహించిన తర్వాత.. ఈ సభలో పవన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటిని బట్టి.. వైసీపీని నామ రూపాలు లేకుండా చేయడం …
Read More »టీడీపీ దూకుడు భేష్.. కానీ, ఇలా కావడం బాగోలేదు
ఏపీ అసెంబ్లీ సమావేశాలను గమనిస్తున్న వారు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న దూకుడును ప్రశంసి స్తున్నారు. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబు తాను చేసిన శపథం నేపథ్యంలో సభకు రావడం లేదు దీంతో తమకు సభను డీల్ చేయడం ఈజీనేనని.. వైసీపీ నాయకులు భావించారు. మరీ ముఖ్యంగా సీఎం సహా సభాపతి కూడా టీడీపీ అధినేత రంగంలో లేకపోవడంతో తమకు పని సులువు అవుతుందని అనుకున్నారు. కానీ.. అలా జరగడం …
Read More »ఎన్ని పార్టీలు కలిసినా.. వైసీపీ నేతల ధైర్యం ఇదే..
అధికార పార్టీ వైసీపీలో ధైర్యం చెక్కు చెదరడం లేదు. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కాను న్నప్పటికీ.. మేమే గెలుస్తాం అనే ధీమా వారిలో వ్యక్తమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి సీఎం జగనే స్వయంగా చెప్పినట్టు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీకాదు! వైసీపీని ఒంటరిని చేసి. అన్నిపక్షాలు కూటమి కట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఏవిధంగా పుంజుకోవా లి..ఎలా ముందుకు వెళ్లాలి.. అనే విషయాలపై …
Read More »పోలవరం లెక్కలు తీయండి.. కేంద్రం ఆదేశం: ఏపీకి మరో ఇరకాటం
పోలవరం ప్రాజెక్టు. అవునా..కాదా.. అన్నట్టుగా పనులు జరుగుతున్న ఈ ప్రాజెక్టులో అంతో ఇంతో కొంత పనులు పుంజుకుంటున్నాయని.. అందరూ సంబర పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం.. ఏపీని మరో ఇరకాటంలోకి నెట్టేసింది. 2004లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే.. తొలిదశ వరకు ఎంత ఖర్చు చేశారు? ఏం చేశారు? వంటి వివరాలను ఇవ్వాలని… ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. దీంతో ఇప్పుడు …
Read More »కొడాలి – వంగవీటి.. ఆటలో టీ తాగుతూ..
రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శాశ్విత శత్రువులు అనేటోళ్లు ఉండరు. రాజకీయంగా నిప్పులా ఉప్పులా ఉండే వారు సైతం వ్యక్తిగత జీవితాల్లో మాత్రం మంచి స్నేహితులుగా ఉండొచ్చు. అందుకు ఉదాహరణగా ఏపీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నేత వంగవీటి రాధాలను చెప్పొచ్చు. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు తూర్పు పడమర లాంటి పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం రాజకీయాలకు అతీమని చెబుతుంటారు. ఏపీ అధికార …
Read More »వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక అరాచకం.. కేంద్రం వెల్లడి
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకానికి, అవకతవకలకు పాల్పడినట్లు కేంద్రం పేర్కొంది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా కాగ్ నిర్ధారించిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ‘వైఎస్ఆర్ గృహవసతి’ ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారని పేర్కొంది. 2020 మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించి కాగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర విపత్తు నిధికి కేంద్ర వాటా కింద రూ.324.15 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. జాతీయ విపత్తు …
Read More »నా ఆస్తి పందెం… జగనే మళ్లీ సీఎం: ఏపీ మంత్రి
తమకున్న ఆత్మవిశ్వాసాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తుంటారు. అందుకు భిన్నంగా తాను అమితంగా అభిమానించి ఆరాధించే అధినాయకుడి గురించిన ఆత్మవిశ్వాసాన్ని చాలా తక్కువ మంది ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు ఆ కోవలోకే చేరారు ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. తాజాగా ఆయనో భీకర సవాలు విసిరారు. ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడన్న పేరున్న ఆయన.. జగన్ కు వీర విధేయుడన్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం జిల్లా పోలాకి..చెల్లాయి వలసలో కొత్తగా …
Read More »2023 ఎన్నికలు: కేసీఆర్ పోటీచేసే నియోజకవర్గం అదేనా?
తన బలము కన్న స్థాన బలము మిన్న అని అంటారు. కేసీఆర్ తన బలం ఎప్పుడో నిరూపించారు ఇప్పుడు స్థానం మార్పుతో స్థాన బలం కన్నా తన బలమే మిన్న అని నిరూపించేందుకు సిద్ధం అవుతుండడం విశేషం. ఇదే సమయంలో రాజకీయంగా మరింతగా ఎదిగేందుకు ముఖ్యంగా తనదైన మార్కు పాలనను వేగవంతం చేసేందుకు ఓ కొత్త నియోజకవర్గం ఎంపికకు తెలంగాణ చంద్రుడు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి …
Read More »ఆ క్రికెటర్ కోసం పార్టీల వేట!
వివిధ క్రీడల్లో తమ ప్రదర్శనతో గొప్ప పేరు తెచ్చుకున్న ఆటగాళ్లు రాజకీయాల్లో అడుగుపెట్టడం కామనే. గతంలో కంటే కూడా ఇప్పుడు క్రికెటర్లు ఎక్కువగా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రంలో ఈ ట్రెండు ఎక్కువగా ఉంది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మనోజ్ తివారీ, గౌతమ్ గంభీర్.. ఇప్పుడు హర్భజన్ సింగ్ ఇలా క్రికెటర్లు రాజకీయాల్లో అడుగుపెట్టారు. తాజాగా హర్భజన్ సింగ్ ఆప్ తరపున రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు. క్రికెటర్లు రాజకీయాల్లోకి …
Read More »