జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంచల్‌గూడ జైల్లో షటిల్ ఆడుకున్నవాళ్లా.. నాకు నీతులు చెప్పేది! అంటూ.. మండిపడ్డారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్న పవన్.. తాజాగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అంటే తనకు ఏమాత్రం ద్వేషం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పారు. అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాల …
Read More »జగన్ సంచలన నిర్ణయం.. అమరావతిలో నిర్మాణాలు షురూ
అమరావతి వద్దంటే వద్దని భీష్మించిన ఏపీలోని జగన్ సర్కారు.. ఎట్టకేలకు హైకోర్టు తీర్పుతో దిగి వచ్చింది. రాజధాని అమరావతిలో పనులు ప్రారంభించింది. రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు.. అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఈ భవనాలను నిర్మించిన ఎన్సీసీ సంస్థకే.. నిర్మాణ పనులను అప్పగించారు. శాసనసభ్యుల నివాసాల్లో టైల్స్, నీటి పైపులు, విద్యుత్ కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే నిర్మాణ సామాగ్రిని రాయపూడికి …
Read More »కేఏ పాల్.. మళ్లీ ఏసేశాడుగా!!
క్యామెడీ రాజకీయాలకు కేరాఫ్‌గా మారిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. మళ్లీ నవ్వులు పూయించారు. తనకు దేశంలో ఉప ప్రధాని పదవిని ఆఫర్ చేశారని.. కానీ, తనే ఆ పదవిని వద్దన్నానని.. ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులంతా.. పోటీ పడి మరీ దోచుకుంటున్నారని పాల్ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన మొత్తం గాడి తప్పిందని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి …
Read More »ఏపీ అంటే జగన్.. చంద్రబాబేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నంతనే అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదంటే ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తప్పించి మరే నేత ప్రధాన మీడియాకు కనిపించదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎవరెన్ని చెప్పినా ఏపీ మీడియాలో రెండు పెద్ద కుంపట్ల ఉన్నాయని చెప్పాలి. ఈ కుంపట్లు జగన్.. చంద్రబాబు ఆప్షన్ లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవటమే తప్పించి.. అందుకు భిన్నంగా ఏపీకి మేలు చేస్తున్నవారు.. కష్టంలో ఉన్న వారికి …
Read More »నన్ను మాజీ మంత్రి అని పిలవొద్దు: కొడాలి నాని
ఏపీలోని వైసీపీ ప్రబుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నాయకుడు కొడాలి నాని తనను మాజీమంత్రి అని పిలవొద్దని .. మీడియాకు గట్టిగా చెప్పారు. తాజాగా ఆయన సొంత నియోజకవర్గం గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గంలో తొలిసారి ఆయన అడుగు పెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గం …
Read More »జగన్ మిస్సయిన పాయింట్ తో దూసుకెళ్తున్న పవన్
రాజకీయాల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న అవకాశాన్ని వదిలినా దానికి చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. అందుకే.. తమకు లబ్థి చేకూర్చే విషయాల్ని అస్సలు మిస్ కావు రాజకీయ పక్షాలు. అలాంటిది ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. అడిగిన వారికి.. అడగని వారికి.. ఉన్నా లేకున్నా.. కాదనకుండా తాయిలాల మీద తాయిలాలు ఇస్తూ మెస్మరైజ్ చేస్తోంది జగన్ ప్రభుత్వం. రాష్ట్రం అప్పుల కుప్పలా మారుతుందన్న హెచ్చరికల్ని పట్టించుకోకుండా …
Read More »పవన్ యాత్రకు చిక్కులు.. ఏపీ రాజకీయాల్ని వేడెక్కిస్తున్న ‘జేసీబీ’
జాతీయ.. అంతర్జాతీయంగా ‘జేసీబీ’ యంత్రం కారణంగా సాగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమార్కులు.. నేరస్తులు.. ఆందోళనతో ఆరాచకాన్ని క్రియేట్ చేసే వారి ఇళ్లను జేసీబీలతో ధ్వంసం చేయటం.. యూపీలో సక్సెస్ ఫార్ములాగా మారిన నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లోనూ అలాంటి విధానాలకు తెర తీస్తున్నారు. దీంతో.. జేసీబీలతో ఆరాచక పాలన సాగిస్తున్నారంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జేసీబీలను వినియోగిస్తున్న వైనాన్ని చూసిన ఏపీ …
Read More »పదే పదే ఈనాడుతోనే వైరమా? జగన్!
ఆయనొక మీడియా సంస్థకు అధినేత.. ఇంకా చెప్పాలంటే ఆయనకు అంగీకారం ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఈనాడు సపోర్ట్ కూడా కోరుకున్న నాయకుడు. వైఎస్సార్ తరువాత మళ్లీ అంతటి స్థాయిలో ఇన్నాళ్లకు ఈనాడు పేపర్ చూపిస్తూ, సంబంధిత ప్రధాన వార్తలు, శీర్షికలూ చదువుతూ ఓ సీఎం హోదాలో కోపం అయ్యారు జగన్. అదే ఇవాళ్టి టర్నింగ్ పాయింట్ .. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ కూడా ! నాలుగు మీడియా సంస్థలపై జగన్ …
Read More »‘KCR కేబినెట్ నుంచి నన్ను తప్పించేందుకు కుట్రలు’
కమ్మ సామాజికవర్గంపై కుట్రలు చేస్తున్నారని.. అదే సామాజికవ ర్గానికి చెందిన తనను కేసీఆర్ కేబినెట్ నుంచి తప్పించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని.. తెలంగాణ రవాణా శాఖ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో కమ్మలను కమ్మలే కాపాడుకోవాలని అన్నారు. ఇటీవల జరిగిన బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించిన మంత్రి.. చిన్న విషయాలను కొందరు రాద్దాంతం …
Read More »జగన్ పై కోర్టు ధిక్కార కేసు
అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి కోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి తదితరులపై కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది. అమరావతి నగరాన్ని ఆరు మాసాల్లో నిర్మించాలని, అంతకుముందు రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అందించాలని కోర్టు మార్చి 3వ తేదీన తీర్పిచ్చింది. నిజానికి కోర్టు తీర్పు యధాతధంగా అమలు చేయడం సాధ్యం కాదని అందరికీ తెలిసిందే. ఇదే విషయమై ప్రభుత్వం కూడా …
Read More »జానారెడ్డికి కీలక పదవి.. ఆ నేతలు సహకరించేనా?
తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా పాత కాపులను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కారణాలతో గతంలో పార్టీని వీడిన వారిని.. ఇతర పార్టీల్లో ఆసక్తి ఉన్న నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజకీయ దురంధరుడు జానారెడ్డికి …
Read More »అవంతి సైలెంట్ .. గంటా హైలెట్?
రాజకీయాల్లో ఏవీ స్థిరం అయి ఉండవు. ఉండాలని అనుకోకూడదు కూడా ! ఎందుకు ఉండాలి కొన్ని గాలివాటు గమనాలు కూడా ఉంటాయి. ఉండాలి కూడా ! అదే అంటే ఆ పద్ధతే కొన్ని సార్లు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు కూడా ! పద్ధతి తప్పి రాయడం కూడా ఓ పద్ధతే కదా ! అదేవిధంగా ఎటువంటి రూల్స్ నూ పాటించక ఇష్టం వచ్చిన విధంగా రాజకీయ అవసరాలకు అనుగుణంగా పార్టీలు …
Read More »