Political News

ముందుగానే టికెట్లా.. ఆ నేతలు జిల్లాల్లో తిరగాలా?

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసి బీఆర్ఎస్ ఓ మెట్టుపైనే నిల్చుంది. కాంగ్రెస్ ఏమో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది. కానీ ఈ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటన్నది అర్థం కాకుండా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పట్లో బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే సూచనలు కనిపించడం లేదు. అయితే దీని …

Read More »

మోడీలో ఓటమిభయం పెరిగిపోతోందా ?

నరేంద్రమోడీలో ఓటమిభయం పెరిగిపోతున్నట్లుంది. అందుకనే వరసబెట్టి నిత్యావసరాల ధరలు తగ్గిస్తున్నారు. ఇంతకాలం జనాల నడ్డివిరుస్తు అన్నింటి ధరలను ఆకాశానికి పెంచేసిన మోడీ ప్రభుత్వంకు ఇపుడు హఠాత్తుగా జనాల ఇబ్బందులు గుర్తుకొస్తున్నాయి. రాఖీపౌర్ణమి సందర్భంగా వంటగ్యాస్ సిలిండర్ ధర 200 రూపాయలు తగ్గించటమే ఇందుకు నిదర్శనం. అలాగే పేదలు వాడే ఉజ్వల్ పథకంలోని గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 400 రూపాయలు తగ్గింది. వంటగ్యాస్ ధరలు తగ్గించటం వల్ల సుమారు 36 …

Read More »

సస్పెన్సులో షర్మిల పర్యటన

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన సస్పెన్సును పెంచేస్తోంది. కొంతకాలంగా షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోతుందని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్లే షర్మిల మూడుసార్లు బెంగుళూరు వెళ్ళి కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. తర్వాత మూడుసార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఒకసారి స్పీడుగా జరుగుతున్న మంతనాలు మరోసారి నత్తను తలపిస్తున్నది. దాంతో విలీనం చర్యలు ఎందుకు స్పీడుగా …

Read More »

రజినీని తిట్టిపోసి.. రజినీ‌తోనే ఎలివేషనా?

కొన్ని నెలల ముందు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని పొగిడినందుకు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన నాయకులు ఆయన్ని ఎంత తీవ్ర స్థాయిలో విమర్శించారో తెలిసిందే. జగన్‌ను కానీ, ఆయన ప్రభుత్వాన్ని కానీ పల్లెత్తు మాట అనకపోయినా చంద్రబాబును పొగడ్డమే రజినీ తప్పయిపోయింది. కొడాలి నాని, రోజా సహా చాలామంది …

Read More »

చంద్రబాబు తీరును తప్పుబట్టిన సీపీఐ నారాయణ

ఏపీ, తెలంగాణ రాజకీయాలపై కొంతకాలంగా వామపక్ష పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీతో టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్ నెత్తిన పాలుపోసినట్లేనని, వైసీపీ గెలుపునకు చంద్రబాబు గేట్లు తెరచినట్లేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. వామపక్ష పార్టీలతో కలిసి బరిలోకి దిగితే వైసీపీని ఓడించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా …

Read More »

ఆ వైసీపీ ఎమ్మెల్యేకు గడ్డుకాలం!

ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి గడ్డు కాలం నడుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులే ఆయనకు వ్యతిరేకంగా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నారంటూ ఏకంగా వైసీపీ అధిష్ఠానాకి ఆ పార్టీ నాయకులే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 1999లో పలమనేరు నుంచి కాంగ్రెస్ తరపున తిప్పేస్వామి …

Read More »

కేసీఆర్ కే బీఆర్ఎస్ ఎమ్మెల్యే డెడ్ లైన్

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేదు. ఆయన ఎంత చెబితే అంతా. నచ్చితే ఏ నాయకుడినైనా తలమీద ఎక్కించుకుంటారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేస్తారు. రెండో అవకాశం ఇవ్వడం, బెదిరింపులకు లొంగడం కేసీఆర్ కు తెలియదనే చెప్పాలి. అలాంటిది తాజాగా కేసీఆర్ కే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేనే డెడ్ లైన్ విధించడం చర్చనీయాంశంగా మారింది. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో విజయంతో మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో …

Read More »

కోడి కత్తికి బొత్స మేనల్లుడికి లింకేంటి?

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడిగకత్తితో దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసిన శ్రీనివాసరావు దాదాపుగా ఐదేళ్లుగా బెయిల్ కూడా లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక, ఈ కేసులో విచారణకు రావాలని సీఎం జగన్ ను విజయవాడలోని ఎన్ ఐఏ కోర్టు ఆదేశించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య ఈ కేసు విశాఖకు బదిలీ …

Read More »

గోరంట్ల రాజకీయం ముగిసినట్లేనా ?

2019 ఎన్నికల సమయంలో గోరంట్ల మాధవ్ అంటే పెద్ద సంచలనం. అంతకుముందు జిల్లాలోని తాడిపత్రిలో ఒక ఆశ్రమం గొడవల్లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి మీసం మెలేసి తొడకొట్టారు. జేసీ బ్రదర్స్ అంటే వణికిపోయే అధికారులను జనాలు చూశారే కానీ వాళ్ళకే చాలెంజ్ విసిరి మీసం మెలేసి తొడలు కొట్టిన అధికారిని అందులోను పోలీసు అధికారిని జనాలు ఎప్పుడూ చూసిందిలేదు. దాంతో మీడియా, …

Read More »

కేసీయార్ అపరిచితుడైపోయారా ?

అప్పుడెప్పుడో వచ్చిన అపరిచితుడు సినిమాలో హీరో ఎలా యాక్ట్ చేశాడో అందరు చూసిందే. ఒకే నిమిషంలో మూడు రకాల షేడ్లలో హీరో నటించి జనాలను ఆశ్చర్యపరిచాడు. ఇపుడు అచ్చంగా కేసీయార్ కూడా అదే పద్ధతిలో వెళుతున్నారట. ఇంతకీ విషయం ఏమిటంటే 119 నియోజకవర్గాలకు గాను 115 స్ధానాల్లో టికెట్లను కేసీయార్ ప్రకటించేసిన విషయం తెలిసిందే. అభ్యర్ధుల ప్రకటన తర్వాత కనీసం 35 నియోజకవర్గాల్లో తీవ్ర గొడవలు జరగుతున్నాయి. సిట్టింగుల్లో ఏడుగురికి …

Read More »

మోడీ ప్రభుత్వంపై మండిపోయిన సుప్రీంకోర్టు

నరేంద్రమోడీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపోయింది. జమ్మూ-కాశ్మీర్ విషయమై కేంద్రప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను రద్దుచేసి ఎంతకాలం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచుకుంటారో చెప్పాలంటు నిలదీసింది. అసలు ఏ అధికారంతో, ఏ కారణంగా రాష్ట్ర హోదాను రద్దుచేశారో చెప్పాలని ప్రశ్నించింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన కేసును సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసం విచారించింది. దాదాపు నాలుగేళ్ళ క్రితం …

Read More »

రాజాసింగ్ కు మరోసారి టికెట్?

ప్రస్తుతం పార్టీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? పార్టీ ఆయన పట్ల సానుకూలంగా ఉందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ విషయంలో అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తాజాగా …

Read More »