వైసీపీ నాయకుడు, న్యూడ్ ఎంపీగా అందరికీ గుర్తుండి పోయిన.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సెంట్రిక్‌గా ఆయన నోరు పారేసుకున్నా రు. 2024 ఎన్నికల సమయంలోనే చంద్రబాబు ఛస్తాడని.. జగనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మాధవ్ వ్యాఖ్యానించారు. వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయ యాత్రలో భాగంగా.. హిందూపురంలో శుక్రవారం పర్యటించిన మాధవ్.. టీడీపీపై విమర్శలు చేశారు.
“చంద్రబాబు ఒకప్పుడు నిన్న మొన్నటి వరకు బస్సు యాత్రలు చేశాడు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నాడు. ఆయన బయటకు వచ్చేది లేదు. వచ్చినా.. 2024 ఎన్నికలకు ముందే ఛస్తాడు. ఇక, సీఎం జగనే., ఆయనను ఎదరించే నాయకులు కూడా లేరు. పవన్ సినిమాల దారి చూసుకుంటాడు” అని మాధవ్ వ్యాఖ్యానించారు.
ఇక, జనసేన అధినేత పవన్‌పైనా మాధవ్ నోరు పారేసుకున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పూర్తి చేసి.. ప్రస్తుతం పారిపోయే యాత్ర చేస్తున్నారని విమర్శించారు. పవన్ వారాహి యాత్ర ఆపేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము ఈ రెండు పార్టీలకూ లేదన్నారు. టీడీపీ యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడన్నారు. లోకేష్ తన పాదయాత్ర చుట్టి పెట్టి పారిపోయాడని గోరంట్ల మాధవ్ విమర్శలు గుప్పించారు.
ఇదిలావుంటే.. జైల్లో ఉన్న చంద్రబాబును చంపేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారంటూ.. టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆయనను తీవ్ర అనారోగ్యానికి గురి చేసి.. ఏదో ఒక రకంగా ఆయనను లేకుండా చేయాలనే కుయుక్తులు పన్నుతున్నారని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ కూడా సందేహాలు వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే.. జగనే బాధ్యత వహించాలని కూడా తేల్చి చెప్పారు. ఇలాంటి సమయంలో మాధవ్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates