రాష్ట్రాన్ని కుదిపేస్తున్న పెగాసస్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. పెగాసెస్‌పై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. పెగాసెస్‌పై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఏపీలో పెగాసస్ స్పై వేర్ కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారన్న పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కామెంట్లతో ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. పెగాసెస్ స్పైవేర్ ఏపీ ప్రభుత్వం …
Read More »పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధం : నారా లోకేష్
పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. బాబాయ్ వివేకా హత్య, మద్యం మరణాలపైనా విచారణ కమిటీ వేయగలరా? అని ముఖ్యమంత్రి జగన్ కు ఆయన సవాల్ విసిరారు. పెగాసస్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమత అసెంబ్లీలో మాట్లాడారనే దానిపై స్పష్టత లేదన్నారు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను తాము కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తు దారుకు సమాధానం ఇచ్చారని గుర్తు …
Read More »కేంద్రానికి తెలంగాణ ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తా
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్రానికి తెలంగాణ ఉద్యమం ఎలా ఉంటుందో రుచి చూపిస్తామన్నారు. దీనికి కారణం.. ధాన్యం. కేంద్రం ధాన్యం సేకరణపై అంగీకరించకపోతే తెలంగాణ ఉద్యమ పంథాలో పోరాడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం మంత్రులు, ఎంపీల బృందం కేంద్రమంత్రిని కలుస్తారని… అక్కడ సానుకూల స్పందన రాకుంటే… పెద్దఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే …
Read More »జగ్గారెడ్డికి అధిష్ఠానం షాక్.. వాట్ నెక్ట్స్?
అంతా అనుకున్నట్లే అయింది. టీ కాంగ్రెస్ లో వర్గ పోరు ముదిరి పాకాన పడింది. విమర్శలు.. ప్రతి విమర్శలతో పార్టీ పరువు బజారున పడింది. రేవంతుపై ఆది నుంచీ అసంతృప్తిగా ఉన్న సీనియర్లకు పార్టీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రేవంత్ అంటే అగ్గిమీద గుగ్గిలం అవుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డికి అధిష్ఠానం జలక్ ఇచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. పార్లమెంటు ఇన్చార్జి బాధ్యతల నుంచి …
Read More »పెగాసస్ : ఏబీ వెంకటేశ్వర్లు ఇచ్చిన క్లారిటీ ఇదే!
వైసీపీ ఆరోపిస్తున్న విధంగా పెగాసస్ సాఫ్ట్వేర్ ను అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసిందా అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూపీ లాగుతుండగా తాజాగా సీన్లో కి అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ వచ్చి తన దైన వివరణ ఒకటి ఇచ్చారు. ప్రభుత్వమే కాదు ఏ ప్రయివేటు సంస్థ కూడా సంబంధిత నిఘా సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసిన దాఖాలాలు ఏవీ లేవని కూడా పదే …
Read More »కశ్మీర్ ఫైల్స్.. దిక్కుమాలిన వ్యవహారం: కేసీఆర్
ప్రధాని నరేంద్ర మోడీ సైతం మెచ్చుకుని దేశం ప్రజలు తప్పకుండా చూడాలంటూ.. కామెంట్ చేసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంతేకాదు.. ఈ సినిమాను చూడొద్దని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు సమాజానికి మంచిది కావని హితవు పలికారు. బీజేపీ కశ్మీర్ ఫైల్స్ నినాదాన్ని లేవనెత్తి ఓట్ల రూపంలో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సమాజానికి అవాంఛనీయ, అనారోగ్యమైన …
Read More »బీజేపీ మీద కోపంతో కలిసిపోయిన రెండు పార్టీలు
ఇటీవల అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో గెలిచి తిరిగి అధికారం నిలబెట్టుకున్న బీజేపీ జోష్‌లో ఉంది. దేశంలో తమకు పోటీగా నిలిచే పార్టీయే లేదని కాషాయ దళం ధీమాగా చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు.. మోడీని ఇంటికి పంపేందుకు తాము ఏకమవుతున్నట్లు రెండు పార్టీలు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకునే మార్పు జరిగింది. శరద్ యాదవ్ చెందిన …
Read More »సీఆర్డీఏకు లీగల్ నోటీసులు
పరిహారం కోరుతు రాజధాని అమరావతి రైతులు సీఆర్డీఏ కి లీగల్ నోటీసులు పంపారు. భూసమీకరణ నిబంధనల ప్రకారం తమ నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం మాట తప్పినందుకు తమకు పరిహారం ఇవ్వాల్సిందే అంటూ కొందరు రైతులు లీగల్ నోటీసులు జారీ చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన భూములను రాజధాని నిర్మాణం చేస్తామంటే భూసమీకరణలో ఇచ్చామన్నారు. భూసమీకరణలోని నిబంధనల ప్రకారం తుది ప్రకటన ఇచ్చిన ఏడాదిలోగా ప్లాట్ల విభజన, రోడ్లు నిర్మించి, భౌతికంగా …
Read More »ఆమెకు ఇంకోసారి టికెట్ ఇవ్వొద్దు.. వైసీపీలో తిరుగుబాటు!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో సొంత పార్టీ నేతపైనే నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. “ బాబోయ్.. ఆమె మాకు వద్దు!“ అంటూ.. తేల్చి చెబుతున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించిన ఉండవల్లి శ్రీదేవిపై స్థానిక వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి ఉండవల్లి శ్రీదేవి.. తండ్రి సుదీర్ఘ కాలం రాజకీయాలు చేశారు.. ఆయనకు ఇదే నియోజకవర్గంలో మంచి పేరు కూడా ఉంది. …
Read More »చైనాలో కుప్పకూలిన విమానం…133 మంది మృతి?
ప్రపంచ పౌర విమానయాన చరిత్రలో మరో ఘోర ప్రమాదం జరిగింది. నైరుతి చైనాలో 133 మంది ప్రయాణికులతో వెళుతోన్న విమానం కుప్పకూలింది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం పెను ప్రమాదానికి గురైంది. పర్వతాల్లో హఠాత్తుగా విమానం కుప్పకూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు శరవేగంగా సమీపంలోని అడవిలోకి వ్యాపించడంతో అక్కడ కార్చిచ్చు అంటుకుంది. ఈ నేపథ్యంలోనే బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు చేయడం కష్టతరంగా …
Read More »కొత్త పార్టీ ఎందుకు బ్రదర్ ..ఓవర్ టు షర్మిల!
మత ప్రాతిపదికన ఓ పార్టీ పెట్టేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారా లేదా ఆమె భర్త అనిల్ ఇందుకు పావులు కదుపుతున్నారా? మహానేతగా పేరున్న వైఎస్సార్ కుటుంబంలో స్పర్థలే ఓ ప్రధాన మీడియా హైలెట్ చేస్తుంది తప్ప! వాస్తవాలు మాత్రం ఇందుకు భిన్నం అన్నది నిజమేనా ? ఇంకా చెప్పాలంటే ఏపీ చరిత్రలో మత ప్రాతిపదికన ఇప్పటిదాకా ఒక్కపార్టీ కూడా ఆరంభానికి నోచుకోలేదు.ఉమ్మడి ఆంధ్రాలో ఎంఐఎం (ఇప్పటి తెలంగాణలో) హవా చూపుతున్నా కూడా …
Read More »బీజేపీని ఎవరైనా నమ్ముతారా?
కడపలో నిర్వహించిన రణభేరి సభ తర్వాత జనాల్లో మళ్ళీ ఇదే చర్చ మొదలైంది. అధికార వైసీపీపై బీజేపీ నేతలు చాలా ఆరోపణలు చేశారు. బహిరంగసభ అన్నాక కచ్చితంగా అధికారపార్టీ పైన ఆరోపణలు, విమర్శలు చేస్తారని అందరికీ తెలిసిందే. కాబట్టి రాజకీయంగా చేసుకునే ఆరోపణలు-ప్రత్యారోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తాను చేయాల్సిందేమీ చేయకుండానే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటమే. విభజన హామీలను …
Read More »