ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడే కొద్దీ బెట్టింగుల హోరు, జోరు పెరిగిపోతోంది. నవంబర్ 30వ తేదీన జరిగిన పోలింగ్ కు డిసెంబర్ 3వ తేదీ అంటే ఆదివారం నాడు కౌంటింగ్ జరగబోతోందని తెలిసిందే. పోలింగుకు ముందే మొదలైన బెట్టింగ్ రాయళ్ళ హడావుడి ఎగ్జిట్ పోల్స్ జోస్యాలతో బాగా ఊపందుకున్నది. బెట్టింగంతా ముఖ్యంగా రెండు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ కేంద్రంగానే జరుగుతోంది. అందుబాటులోని సమాచారం ప్రకారం బెట్టింగ్ మొత్తం సుమారు …
Read More »కమలం కుదేలైపోయిందా ?
పోలింగ్ ముగిసి ఎగ్జిట్ పోల్స్ జోస్యాలు వచ్చేయడంతో బాగా డీలా పడిపోయిన పార్టీ ఏదన్నా ఉందంటే అది బీజేపీ మాత్రమే. పోలింగ్ ముందు వరకు కూడా అధికారంలోకి రాబోయేది తామే అని ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన కమలనాదులు ఇపుడు ఎక్కడా చప్పుడు చేయటంలేదు. మొదటినుండి కూడా బీజేపీయేతర పార్టీల్లో కమలం పార్టీ గెలుచుకోబోయే నియోజకవర్గాల విషయంలో ఒక క్లారిటీ ఉంది. మిగిలిన పార్టీలన్నీ బీజేపీకి పట్టుమని పది సీట్లు కూడా …
Read More »రేవంత్ ఇంటికి భద్రత పెంపు.. ఈ సంకేతాలు దేనికోసం?
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఎన్నికల పోలింగ్ అనంతరం.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత జరిగిన ఈ పరిణామం.. ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మారిన సీన్.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 30 మంది పోలీసులు రేవంత్ ఇంటి చుట్టుపక్కల భద్రతకు కేటాయించడం గమనార్హం. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద …
Read More »సీఎంగా రేవంత్ రెడ్డి.. ఎంత మంది జై కొట్టారంటే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుంటుందనే భావనతో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? అధికార పీఠం ఎవర దక్కించుకుంటారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ సీటు కోసం 12 మంది నాయకులు పోటీ పడుతున్నారని వెల్లడించి బాంబు పేల్చారు. ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. అక్కడ ఇద్దరు మాత్రమే సీఎం సీటుకోసం పోట్లాడుకున్నారు. కానీ, దాదాపు పదేళ్ల …
Read More »‘చే’ జారకుండా జాగ్రత్తలు.. క్యాంపు రాజకీయాలు షురూ!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరొ 24 గంటల్లో ఫలితం కూడా రానుంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ఫలితాల వెల్లడి ప్రారంభం కానుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కీలకైన నాలుగు రాష్ట్రాలు.. మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్(మరోసారి), ఛత్తీస్‌గఢ్ల(మరోసారి)లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ప్రత్యర్థులకు తన అభ్యర్థులు చిక్కకుండా ముందస్తు జాగ్రత్తలకు …
Read More »తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే హాట్ న్యూస్ ఇదే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. పోలింగ్ పూర్తయిన అరగంట తర్వాత.. అనేక సర్వేలు వచ్చాయి. ఈ సర్వేలన్నీ కూడా అధికార బీఆర్ ఎస్‌కు ప్రమాద హెచ్చరికలనే హెచ్చరించాయి. తన మన అనే తేడా లేకుండా సాగిన ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ.. బీఆర్ ఎస్‌కు అధికారం దక్కడం కష్టమనే విషయాన్ని చాటి చెప్పాయి. అయితే.. ఒకింత ఆలస్యంగా తన ఎగ్జిట్ పోల్ సర్వేను వెల్లడించిన ‘ఇండియా టుడే’ కూడా.. ఇదే …
Read More »వైసీపీ అరాచకాలను పార్లమెంటులో లేవనెత్తండి: చంద్రబాబు
ఏపీ అధికార పార్టీ వైసీపీ అరాచకాలను పార్లమెంటులోనూ లేవనెత్తాలని టీడీపీ ఎంపీలకు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అదేసమయంలో రాష్ట్రంలోనూ యుద్ధం ప్రకటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలుప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలతో చంద్రబాబు ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో వైసీపీ అరాచకాలు.. …
Read More »తక్షణమే నీటి విడుదల ఆపేయండి: ఏపీపై కృష్ణా బోర్డు ఫైర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ నీటి విడుదల విషయంలో వ్యవహరించిన తీరుపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీవ్రంగా స్పందించింది. ఔను.. మీది దుందుడుకే! అని వ్యాఖ్యానించింది. తక్షణమే అక్కడ నుంచి బలగాలను వెనక్కి మళ్లించాలని.. నీటి విడుదలను ఆపేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీఏపీ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తాజాగా లేఖ రాసింది. ఒప్పందాన్ని …
Read More »నాకు పదవులు వద్దు.. మీరు కూడా.. ఆలోచించాలి: పవన్
“పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. నాకు ఎలాంటి పదవులు అవసరం లేదు. మీరు(జనసేన నాయకులు) కూడా ఈ దిశగానే ఆలోచించాలి. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. పదవుల కోసం ఆరాటం ఎందుకు? పదవులు ఇప్పుడు ఉంటాయి రేపు పోతాయి. క్షణకాలం ఉండే పదవుల కోసం ఆరాటం ఎందుకు” అని జనసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర …
Read More »టీడీపీని ఇరుకున పెడుతున్న రెండు నియోజకవర్గాలు..!
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి బలమైన జిల్లాలు చాలానే ఉన్నాయి. ఉభయ గోదావరులు, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కృష్ణా వంటివి కేడర్ పరంగా బాగున్న జిల్లాలు. వీటిలో మరీ ముఖ్యంగా సీమ పరిధిలో ఉన్న అనంతపురం టీడీపీకి కంచుకోట. 2014 ఎన్నికల్లో ఇక్కడి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ గెలుచుకుంది. అయితే.. 2019 ఎన్నికల్లో మాత్రం ఒక్క హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లోనే విజయం సాధించింది. అయినప్పటికీ.. కేడర్ …
Read More »చెక్కిన శిల్పంలా రేవంత్‌రెడ్డి.. ఆటుపోట్లు, ఎదురీతలు..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంటుందని.. మెజారిటీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ సొంతం చేసుకుంటుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఒకటి రెండు తప్ప.. మిగిలిన సర్వేలు.. పూర్తిస్థాయిలో మెజారిటీ కూడా కాంగ్రెస్ పంపాయించుకుంటుందని అంచనా వేశాయి. సో.. డిసెంబరు 3నాటి ఫలితం ముందు.. ఇప్పుడు వచ్చిన సర్వేల రిజల్ట్.. సహజంగానే కాంగ్రెస్‌లో ఊపు తెచ్చింది. తెలంగాణ ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్.. గత పదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. …
Read More »ఏపీలో వలంటీర్ల వ్యవస్థ రద్దవుతుందా…?
ఏపీలో వలంటీర్ల వ్యవస్థ మరోసారి చర్చకు వచ్చింది. అసలు ఈ వ్యవస్థ ఉంటుందా? ఎన్నికల సమయానికి రద్దవుతుందా? అదే జరిగితే వైసీపీ నాయకులు ఏం చేయాలి? పార్టీ అధిష్టానం ప్రత్యమ్యాయ మార్గాలను అన్వేషిందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2019 అక్టోబరులోనే వచ్చిన వలంటీర్ వ్యవస్థపై రెండు రకాల చర్చలు సాగుతున్నాయి. ఒకటి దీనిలో పాజిటివ్. రెండు నెగిటివ్. ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువ చేయడం.. పాజిటివ్. అంతేకాదు.. నెలనెలా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates