హైదరాబాద్ ఓటరు అస్సలు మారలేదు. నేతలు గొంతు చించుకున్నా.. మీడియా చైతన్యం చేసినా.. ఎన్ని కల సంఘం రండి బాబూ రండని ఆహ్వానించినా.. హైదరాబాద్ ఓటరు మాత్రం కిమ్మనలేదు. కిక్కురుమనలేదు. తన మానాన తను సైలెంట్ అయిపోయారు. దాదాపు 42 రోజుల పాటు మైకులు హోరెత్తాయి. నాయకలు ప్రచారంతో ఊరూవాడా దద్దరిల్లింది. ఇక, పోలింగ్ కూడా గురువారం ఉదయం ప్రారంభమైంది. వీధి చవర్లోనో.. రోడ్డు మధ్యలోనో పోలింగ్ కేంద్రాన్ని కూడా …
Read More »ఉమ్మడి మేనిఫెస్టోపై టీడీపీ- జనసేన.. అంతర్గత పోరు..!
టీడీపీ-జనసేన మిత్రపక్షంగా ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుడే లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి. అయితే.. దీనిని కొందరు టీడీపీ నాయకులు, జనసేన నేతలు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. వీరిని ప్రసన్నం చేసుకునేందుకు సమన్వయ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా.. కొన్ని జిల్లాల్లో సక్సెస్ అయి.. మరికొన్ని జిల్లాల్లో వివాదంగా మారాయి. ఈ తతంగం కొనసాగుతుండగానే.. ఇప్పుడు జనసేన నేతలు మరో కొత్తవాదన తెరమీదకి …
Read More »పోలింగ్ వేళ.. ‘సాగర్’ గోల.. వ్యూహాత్మకమా?
ఒకవైపు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. అయితే.. ఇంతలోనే సాగునీటి ప్రాజెక్టుల వివాదం తెరమీదికి వచ్చింది. నాగార్జున సాగర్ వద్ద.. ఏపీ, తెలంగాణ పోలీసులు ఘర్షణకు దిగారు. ఏపీ సరిహద్దుల్లోని అన్ని గేట్లను వైసీపీ ప్రభుత్వం మూసేసింది. అంతేకాదు..ఈ రోజు(గురువారం) ఉదయం 5 గంటల నుంచి …
Read More »ఓటేసిన కవిత.. కామెంట్సే వివాదం.. కాంగ్రెస్ రెడీ!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ రోజు(గురువారం) ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొద్ది సేపటికే.. ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లలో నిలబడ్డారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగం, పారిశ్రామిక రంగాలకు చెందిన దిగ్గజాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. ఓటు …
Read More »తాడేపల్లికి రండి.. ద్వారంపూడికి జగన్ పిలుపు!
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. “రండి.. ఒక్కసారి మాట్లాడుకుందాం” అని సీఎంవో కార్యాలయం నుంచి ఆయన సందేశం వెళ్లినట్టు ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. ఇటు తాడేపల్లి వర్గాలుకూడా దీనిని ధ్రువీకరించాయి. దీంతో శుక్రవారం ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. అయితే.. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. తొలిసారి ఇలా వ్యక్తిగతంగా ద్వారంపూడికి సీఎం ఆఫీస్ నుంచి ఆహ్వానం రావడం గమనార్హం. తాజాగా …
Read More »ఒకరిపై ఒకరు.. ఏపీలో దొంగ ఓట్ల రాజకీయం!
వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ-జనసేన కూటమి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలకు 120 రోజుల ముందుగానే ఉత్కంఠ నెలకొంది. పైగా ఎవరికి వారు రాజకీయ ప్రచారం కూడా ఊపు పెంచారు. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహారం తెరమీదకి వచ్చింది. పొరుగు రాష్ట్రానికి చెందిన వారికి(సరిహద్దుజిల్లాల్లో) ఏపీలో ఓట్లు ఉండడం, …
Read More »‘వై ఏపీ నీడ్స్ జగన్’కు హైకోర్టు బ్రేక్!
‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి మరోసారి జగన్ సీఎం కావాలని, రాష్ట్రానికి జగన్ అవసరం ఎందుకు ఉంది అన్న నినాదంతో వైసీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, ‘వై ఏపీ నీడ్స్’ జగన్ స్లోగన్ పై టీడీపీ సోషల్ మీడియా విభాగం సెటైర్లు కూడా వేసింది. ఏపీకి జగన్ అవసరం లేదు….ఏపీకి …
Read More »‘జేడీ’ వారి కొత్త పార్టీ.. ముహూర్తం ఎప్పుడంటే!
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లో కొత్త అడుగు వేస్తున్నారు. సొంతగా పార్టీ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తాజాగా ప్రకటించారు. అయితే.. దీనికి ‘అవసరం అయితే’ అని ట్యాగ్ జోడించడం గమనార్హం. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేని జేడీ.. గత 2019 ఎన్నికలకు ముందు సీబీఐ ఉద్యోగానికి రాజీనామా సమర్పించి.. రాజకీయ అరంగేట్రం చేశారు. వస్తూ వస్తూనే జనసేన కు జై కొట్టారు. …
Read More »ఓడితే శవయాత్రే.. : ఎన్నికల సంఘం సీరియస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసినా.. అభ్యర్థులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఒకవైపు వారు ప్రచారానికి చేసిన ఖర్చు లెక్కలు తేల్చేందుకు ఎన్నికల సంఘం రెడీ కావడంతో అందరూ సతమతం అవుతున్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారం చివరి రోజు.. చివరి నిముషంలో ప్రజలను ఎమోషనల్‌గా ఆకట్టుకునేందుకు, వారిని సెంటిమెంటుతోతమవైపు తిప్పుకొనేందుకు.. ప్రయత్నించడం.. కీలక వ్యాఖ్యలు చేయడంపట్ల కూడా.. ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. తాజాగా బీఆర్ఎస్ అభ్యర్థి …
Read More »బీఆర్ఎస్ లో ‘బాండ్ల’ కలకలం
బీఆర్ఎస్ లో కాంగెస్ పార్టీ ఇస్తున్న బాండ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రచారం యావత్తు కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారెంటీస్ మీదనే ఎక్కువగా దృష్టిపెట్టి ప్రచారం చేసింది. హస్తంపార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయంలో జనాలు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సిక్స్ గ్యారెంటీలపైనే కేసీయార్, కేటీయార్, హరీష్ రావు కూడా పదేపదే ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. దాంతో ఏమైందంటే కాంగ్రెస్ సిక్స్ గ్యారెంటీస్ కు కేసీయార్ అండ్ కో కూడా …
Read More »మూడు చోట్ల తమ్ముళ్ళు డిసైడ్ అయ్యారా ?
ఉమ్మడి కడప జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్ధులు ఫైనల్ అయిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఫైనల్ అయిపోయానట్లేనట. ఎందుకంటే నియోజకవర్గాల ఇన్చార్జిల హోదాలో ముగ్గురు తమ్ముళ్ళు నియోజకవర్గాల్లో బాగా తిరుగుతున్నారు. జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి, మైదుకూరులో పుట్టా సుధాకరయాదవ్, కమలాపురంలో పుత్తా నర్సింహారెడ్డి పోటీ …
Read More »కాంగ్రెస్ కు కీలక మద్దతు
మరో 24 గంటల్లో పోలింగ్ మొదలవ్వబోతున్న సమయంలో కాంగ్రెస్ లో మంచి జోష్ కనబడుతోంది. దీనికి కారణం ఏమిటంటే ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మద్దతు ప్రకటించటమే. ఆర్టీసీలోని ఉద్యోగ, కార్మిక యూనియన్లలో మజ్డూర్ యూనియన్ కూడా బలమైనదనే చెప్పాలి. వేలాది మంది సభ్యులు ఉన్న మజ్దూర్ యూనియన్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించాలని డిసైడ్ చేసినట్లు యూనియన్ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. యూనియన్లోని అన్ని స్థాయిల్లో చర్చించిన తర్వాతే ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates