ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని జగన్ రెడ్డి తన సొంత అజెండాతో సర్వనాశం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల పెంపుతో.. ఇళ్లల్లో స్విచ్ వేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు తెచ్చారని దుయ్యబట్టారు. అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్రంలో చీకట్లు కమ్మేలా చేశారని ఆక్షేపించారు. గజ దొంగలు కూడా ఆశ్చర్యపోయేలా.. ప్రజలను జగన్ దోచుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీ …
Read More »అంబటికి..రోజాకు నో ఛాన్స్..ఆశ పడొద్దు!
మంత్రి వర్గ విస్తరణలో ఇద్దరికి ఛాన్స్ ఉందని వార్తలొస్తున్నాయి. వారిలో ఒకరు అంబటి రాంబాబు కాగా మరొకరు రోజా. గుంటూరు జిల్లా కోటాలో అంబటి ఛాన్స్ కొట్టేసేందుకు లాబీయింగ్ చేస్తున్నారని టాక్. 1989లో తొలిసారి రేపల్లె నియోకవర్గం తరఫున ఎన్నికయిన తరువాత చాలా ఏళ్లకు ఎమ్మెల్యే అయిన అంబటి ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో వైసీపీకి నమ్మిన బంటులా ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలు జనంలోకి తీసుకెళ్లేందుకు …
Read More »ఆ దాడులకు భయపడను: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేవైఎం నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఘటనపై కేజ్రీవాల్ స్పందించారు. దేశం కోసం ప్రాణాలిస్తానంటూ కేజ్రీవాల్ భావోద్వేగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఢిల్లీలో ఈ-ఆటోలను ప్రారంభించిన సందర్భంగా ఆ ఘటనపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ముఖ్యం కాదని, తనకు ఈ …
Read More »జగన్ పాలనలో బాదుడే బాదుడు…లోకేశ్
ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచుతూ జగన్ సర్కార్ జనంపై మరో బాదుడుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కరోనా కాటు నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న జనం నడ్డి విరిచేలా కరెంటు బిల్లులు పెంచారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా లోకేశ్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. లాంతరు …
Read More »ఐఏఎస్ లపై నాగబాబు షాకింగ్ కామెంట్స్
కోర్టు ధిక్కరణ కేసులో ఆగ్రహానికి గురైన 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించిన వైనం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, వారంతా కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో శిక్ష తప్పింది. దానికి బదులుగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ 8 మంది ఐఏఎస్ లను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పాటు ప్రతీ నెలలో ఒకరోజు వెళ్లి సేవ చేయాలని తీర్పు …
Read More »వాళ్లను తీసేయాల్సిందే.. జగన్ సర్కారుకు హైకోర్టు అల్టిమేటం
ఏపీ సీఎం జగన్కు ఒకే రోజు ఏపీ హైకోర్టులో రెండు పెద్ద దెబ్బలు తగిలాయి. ఒకటి.. పాఠశాలల్లో సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన హైకోర్టు.. ఏకంగా.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 8 మంది ఐఏఎస్ అధికా రులకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అంతేకాదు.. వారు క్షమాపణ చెప్పినా.. వెనక్కి తగ్గని కోర్టు.. వారికి సేవను శిక్షగా విధించింది. పాఠశాలల్లో.. నెలకు ఒకరోజు సేవ చేయాలని… ఒక …
Read More »జగన్ సర్కారుపై ఐఏఎస్, ఐపీఎస్ల తిరుగుబాటు ఖాయం!
`మనందరం ప్రభుత్వం` అంటూ.. ఊదరగొడుతున్న జగన్ ప్రభుత్వంలో సర్కారు నిర్ణయాలను తూచ. తప్పకుండా అమలు చేస్తున్న అత్యంత కీలకమైన ఉన్నతాధికారులు.. అఖిల భారత సర్వీసు అధికారు లు.. ఐఏఎస్, ఐపీఎస్లకు ఘోరాతి ఘోరమైన అవమానాలు ఎదురవుతున్నాయి. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు.. రాజ్యాంగ వ్యతిరేక మని తెలిసి కూడా అధినేత మెప్పుకోసం.. అదికారులు చేస్తున్నపనులు.. హైకోర్టు నుంచి మొట్టికాయలు పడేలా చేయడమే కాదు.. ఇప్పుడు ఏకంగా.. జైలు శిక్షల వరకు …
Read More »మందుబాబులంతా మహాపాపులంటోన్న సీఎం
భారత దేశంలోని ఏ రాష్ట్రమైనా మద్యం వల్ల వచ్చే భారీ ఆదాయంపై ఆధారపడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే సంక్షేమపథకాలకు పెట్టే నిధుల్లో సగానికి పైగా ఆబ్కారీ శాఖ నుంచే వస్తాయి. అందుకే, మద్య నిషేధం వంటి వ్యవహారాల జోలికి వెళ్లడానికి చాలామంది సీఎంలు ఇష్టపడరు. మందుబాబులు కట్టే ట్యాక్స్ విలువ తెలిసిన చాలామంది సీఎంలు…వారిని పల్లెత్తు మాట అనరు. కానీ, మిగతా సీఎంలకు భిన్నంగా మందుబాబులపై బిహార్ సీఎం నితీశ్ …
Read More »జగన్ కొత్త కేబినెట్.. 20 మంది కొత్త నేతలు
త్వరలోనే జరగనున్న కేబినెట్ ప్రక్షాళనపై వైసీపీ నేతలు.. ఎవరికి వారు ఊహాలోకాల్లో విహరిస్తున్నారు. ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. మాకంటే.. మాకేనని లెక్కలు.. కూడా వేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ.. మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు కూడా లెక్కలు తీవ్రంగానే వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి మొత్తం 20 మందిని కొత్తగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎస్సీ నాయకుడు.. వివాద రహితుడు …
Read More »చరిత్రలోనే తొలిసారి.. 8 మంది ఐఏఎస్లకు జైలు శిక్ష
దేశ చరిత్రలోనే తొలిసారి.. ఇక, నవ్యాంధ్ర హిస్టరీలోనే.. ఫస్ట్ టైం.. గతంలో ఎక్కడా ఎప్పుడూ.. కనీ వినీ ఎరుగని సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ.. జరగని.. ఏరాష్ట్రంలోనూ.. ఇలాంటి పరిణామం.. ఎదురుకాని పరిస్థితి ఏపీలో ఏర్పడింది. ఒకేసారి.. ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్లకు.. ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. సీనియర్ ఐఏఎస్ అదికారులు.. విజయ్ కుమార్, శ్యామల రావు, గోపాల కృష్ణ ద్వివేది, బుడితి …
Read More »కొత్త జిల్లాల ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. వాలంటీర్ల సేవలకుగాను ఏప్రిల్ 6న ప్రభుత్వం సత్కారం చేయనుంది. ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమం చేపట్టి.. ఆయా కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తాజాగా.. జగన్.. ఆయా విషయాలపై సమీక్షించారు. కొత్త జిల్లాలపై సీఎం జగన్ …
Read More »చంద్రబాబు కోరిక తీర్చిన జగన్
చంద్రబాబునాయుడు కోరికను జగన్మోహన్ రెడ్డి తీర్చేశారు. ఇంతకీ ఆ కోరిక ఏమిటంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ పేరుతో కొత్తగా రెవిన్యు డిజన్ను ఏర్పాటు చేయటం. ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతున్నది. ఇందులో భాగంగానే 73 రెవిన్యు డివిజన్లను కూడా కొత్తగా ఏర్పాటుచేసింది. వీటిల్లో కుప్పం రెవెన్యూ డివిజన్ కూడా ఒకటి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ …
Read More »