దేశంలో హోరాహోరీగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముగిసింది. బెంగాల్, తమిళనాడు, కేరళలలో ప్రభుత్వాలు మారిపోయాయి. ఈ మూడు రాష్ట్రాల్లో తొలి రెండు రాష్ట్రాల్లో సీఎంలుగా కొనసాగిన ఎంకే స్టాలిన్, మమత బెనర్జీలు సీఎం కుర్చీతో పాటు ఎమ్మెల్యే పదవులనూ కోల్పోయారు. బెంగాల్ లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన దీదీ మాజీ అనుచరుడు సువేందు అధికారి చేతిలో ఆమె ఓడిపోయారు. ఇక విజయ్ దళపతి …
Read More »విజయ్ మాత్రమే కాదు.. డ్రైవర్ కొడుకు కూడా
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. వీటిలో అత్యంత చర్చనీయాంశం అవుతున్నది తమిళనాడు ఫలితం గురించే. ఎందుకంటే మిగతా నాలుగు చోట్లా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లే ఫలితాలు వస్తున్నాయి. కానీ తమిళనాట మాత్రం సంచలనం తప్పలేదు. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ విజయ్ పార్టీ టీవీకే 30 లోపు సీట్లే సాధిస్తాయని అంచనా వేశాయి. యాక్సిస్ ఇండియా మాత్రమే టీవీకేకు వందకు పైగా సీట్లు రావచ్చని …
Read More »విజయ్‌కు కలిసి వచ్చిందేంటి?
తమిళనాట ఎవరి అంచనాకు అందని విదంగా దళపతి విజయ్ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మెజారిటీ పైకొంత సందిగ్ధత కొనసాగుతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం.. విజయ్‌కు 108 స్థానాల్లో గెలిచారు. కానీ.. మెజారిటీ దక్కించుకునేందుకు మరో 10 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఈ విషయం ఎలా ఉన్నా.. ఇప్పుడు విజయ్ విజయం వెనుక ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి …
Read More »ఎన్టీఆర్, ఎంజీఆర్.. మధ్యలో విజయ్
దేశంలో సినిమా వాళ్లను దేవుళ్లలా ఆరాధించి, వారికి రాజకీయాల్లోనూ అద్భుత ఫలితాలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముందుంటాయి. తమిళనాట ముఖ్యమంత్రులుగా సుదీర్ఘ కాలం పాలన చేసిన కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ముగ్గురూ సినిమా వాళ్లే. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టే దిశగా దూసుకెళ్తున్న విజయ్ కూడా సినిమా వాడే. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఆ …
Read More »కమ్యూనిస్టుల పాలన… కనుమరుగు!
దేశంలో కమ్యూనిజం సిద్ధాంతాలను బలోపేతం చేసిన కమ్యూనిస్టు పార్టీలు.. తాజా ఎన్నికలతో కనుమరుగయ్యాయి. ప్రజా పాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సీపీఐ, సీపీఎం పార్టీలు.. పలు రాష్ట్రాల్లో అధికారం చలాయించాయి. అయితే.. ఒక్కొక్క దశలో ఎదురైన అనేక సంఘర్షణల కారణంగా కాలానికి అనుగుణంగా దూసుకుపోయే తత్వాన్ని అలవరుచుకోని కామ్రెడ్లు.. ప్రజా క్షేత్రంలో తమను తామే ఓడించుకుని.. అధికారానికి దూరమయ్యారు. తాజాగా కేరళలో ఎల్‌డీఎఫ్ కూటమి సైతం ఓటమి పాలవడంతో …
Read More »పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ వస్తున్న దీదీ… నాలుగో సారి మాత్రం ఓటమి బాటలో సాగుతున్నారు. వామపక్షాల నుంచి అధికార పగ్గాలను చేజిక్కించుకున్న దీదీ… బెంగాల్ లో తనకు తిరుగు లేదన్నట్లుగా వ్యవహరించారు. పాలనలో తనదైన నిర్ణయాలు తీసుకున్న దీదీ… ఆ నిర్ణయాల అమలులో చివరకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎదిరించిన తీరు నిజంగానే …
Read More »విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ దుందుభి మోగించారు. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ టీవీకే నామమాత్రపు సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. కానీ, మాజీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే మాత్రం టీవీకే గెలుపును ఏడాది ముందుగానే …
Read More »ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత విజయం దక్కించుకుంది. వీటిలో ఒక్క రాష్ట్రంలో మాత్రమే కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లగా, మిగిలిన రెండు రాష్ట్రాల్లోనూ ఒంటరిగానే గెలుపు గుర్రం ఎక్కింది. అదే సమయంలో తమిళనాడులో కూడా ఎన్నికల అనంతరం పొత్తు కుదిరితే, బీజేపీ నేతృత్వంలోని అన్నాడీఎంకే + టీవీకేలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా …
Read More »టీవీకే విజయ్ డబుల్ బొనాంజా
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయ దుందుబి మోగించారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ లో భారీ మెజారిటీతో విజయ్ విజయం సాధించారు. పెరంబూరులో డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్ పై 40 వేల ఓట్ల తేడాతో విజయ్ గెలుపొందారు. తిరుచ్చి ఈస్ట్ …
Read More »ఎమ్మెల్యేగా ఆ రాష్ట్ర సీఎం ఓటమి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే. 110కు పైగా స్థానాల్లో లీడ్ లో ఉన్న టీవీకే తమిళనాట ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు లాంఛనమే. అదే సమయంలో సీఎం స్టాలిన్ కు తమిళ ప్రజలు భారీ షాకిచ్చారు. కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్ ఓడిపోయారు. టీవీకే అభ్యర్ధి వీ.ఎస్ బాబు చేతిలో …
Read More »విజయ్ విజయమే.. మేనిఫెస్టోలో ఏం చెప్పాడంటే?
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్‌లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే గెలుపు ముంగిట ఉన్న విజయ్ ఇచ్చిన భారీ హామీలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశంలో ఎందరో నాయకులు ఎన్నికల ముందు అద్భుతమైన వాగ్దానాలు చేసి, గెలిచాక వాటిని విస్మరించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో విజయ్ ప్రకటించిన సంక్షేమ పథకాలు కేవలం ఓట్ల కోసమేనా లేక …
Read More »విజయ్ గెలిస్తే… వైసీపీకి ఒరిగేదేంటి?
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా దూసుకెళ్తుండడం. విజయ్ ఈ ఎన్నికల్లో కింగ్ మేకర్ కాగలడన్న అంచనా ముందు నుంచి ఉంది. కానీ అతను ఏకంగా ‘కింగ్’గా అవతరిస్తాడని ఊహించన వాళ్లు మాత్రం తక్కువ. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా, పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే సీఎం అయి చరిత్ర సృష్టించబోతున్నాడు విజయ్. తమిళనాడు ఎన్నికల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates