దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం తాజాగా గవర్నర్ల భవనాలకు సోమవారం పేర్లు మార్చిన విషయం తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా రాజ్ భవన్‌లుగా పేర్కొంటున్న గవర్నర్ల బంగళాలకు..’లోక్ భవన్లు’గా పేరు మార్చింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఈ పరంపరలో తాజాగా ప్రధాన మంత్రి నివాసం, కార్యాలయం పేరునుకూడా మార్పు చేసింది.. ఇక నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం, నివాసం(పీఎంవో)ను ‘సేవా తీర్థ్'(సేవల క్షేత్రం)గా మార్పు చేసింది.
ఈ నిర్ణయం కూడా తక్షణమే అమల్లోకి వచ్చినట్టు కేంద్ర హోం శాఖ మంగళవారం విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. ఇక, ఇప్పటి వరకు కొన్నిదశాబ్దాలుగా ప్రధాని నివాసం ఉంటున్న భవనాన్ని కూడా మార్పు చేశారు. ఇప్పటి వరకు ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఉన్న భవనం నుంచి ప్రధాన మంత్రి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి ఈ భవనాన్ని కొత్తగా నిర్మించిన ‘సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలను ‘న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్’లోకి మార్చనున్నారు. దీనికే సేవా తీర్థ్‌గా పేరు పెట్టారు.
అయితే.. ఈ భవనాన్ని కూడా మూడు భాగాలుగా విభజించారు. న్యూ ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లోని ఒక భవనాన్ని సేవా తీర్థ్-1, రెండో దానిని సేవా తీర్థ్-2, మూడో దానిని సేవాతీర్థ్ -3 గా పిలవనున్నారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో సేవాతీర్థ్-1లో ప్రధాని కార్యాలయం, ఆయన నివాసం కూడా ఏర్పాటు చేస్తారు. దీనికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. జీపీఎస్ నేవిగేషన్‌ను కేడా ఏర్పాటు చేశారు. ప్రతి కదలికలను అధికారులు గమనించనున్నారు. సుమారు 50 మీటర్ల దూరం వరకు దృష్టి పెట్టగల అత్యత బలమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక, సేవాతీర్థ్-2, 3 ప్రధాన మంత్రి వర్గ సచివాలయంగా నిర్వహిస్తారు. దీనిలో జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం,నివాసంకూడా ఉంటాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates