Political News

ఆ ఏపీ మంత్రి గారు.. ఊరు దాటి రారా ?

ఆయన మంత్రి కాక ముందు బాగా చురుకు. అసలు రాజకీయాల్లోకి రాక ముందు ఇంకా చురుకు. ఆయన చదువుల్లో టాపర్. డాక్టర్ కోర్స్ చదివి తానున్న ఊరికి డాక్టర్ గా సుపరిచితులు. సేవాభావం కూడా ఎక్కువ. అందుకే జగన్ ఆయన్ని ఇలా పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేశారు. ఆ తరువాత ఏడాది తిరగకుండానే మంత్రిని చేశేశారు. ఇదంతా కూడా శ్రీకాకుళం జిల్లా పలాస‌ ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు రాజకీయ …

Read More »

చిరంజీవి విష‌యంలో కాంగ్రెస్ క్లారిటీ..!

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి విష‌యంలో కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీకి వ‌చ్చిందా? ఆయ‌న ఇక‌, త‌మ‌కు దూర‌మేన‌ని.. మాన‌సికంగా సిద్ధ‌మైందా ? అంటే.. తాజాగా మారిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్నాళ్ల కింద‌ట‌.. తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌.. కేర‌ళ‌కు చెందిన ఊమెన్ చాందీ.. చిరంజీవి త‌మ పార్టీలో లేర‌ని వ్యాఖ్యానించారు. ఈ ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం రేపింది. అయితే.. ఆ వెంట‌నే …

Read More »

ప్రైవేటుపరం అవుతున్న ప్రభుత్వాస్తులు

నిధుల సమీకరణ పేరుతో దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేస్తోంది. దీనికి ముద్దుగా మానిటైజేషన్ అనే పేరు పెట్టింది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ అన్నా మానిటైజేషన్ అన్నా జరిగేది ప్రైవేటు సంస్థలకు అప్పగించేయటమే. కాకపోతే కొన్నింటిని డైరెక్టుగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తారు. మరికొన్నింటిని పరోక్షంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో రు. 6 లక్షల కోట్లు సమీకరించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు …

Read More »

ఏపీకి స్పీకర్ కూడా కొత్తవారే… ?

రాజకీయాలు మామూలుగా ఏపీలో సాగడంలేదు. గతంలో ఏనాడో ఎపుడో సంచలనాలు నమోదు అయ్యేవి. కానీ వైసీపీ రాజకీయాల్లోకి వచ్చాక ప్రతీదీ సెన్షేషన్ అవుతోంది. దాంతో అటు టీడీపీలోనూ ఆ రాజకీయ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. అక్కడా ఇక్కడా వెరసి ఏపీ రాజకీయమే ఎపుడూ మీడియా హెడ్ లైన్స్ లో ఉంటోంది. ఇవన్నీ పక్కన పెడితే శ్రీకాకుళానికి చెందిన వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారామ్ స్పీకర్ గా ఉన్నారన్నది తెలిసిందే. ఆయన …

Read More »

మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్యేనే..

ఆంధ్రప్రదేశ్‌‌లో పేరున్న రాజకీయ నాయకుల్లో చాలా సాదాసీదాగా కనిపించే నేతల్లో నిమ్మల రామానాయుడు ఒకరు. తెలుగుదేశం పార్టీ నేత అయిన నిమ్మల రామానాయుడు తొలిసారి 2014లో తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాతి పర్యాయం కూడా ఎన్నికల్లో గెలిచారు. ఐతే ఎమ్మెల్యేల్లో సాధారణంగా కనిపించే దర్పం ఆయనలో కనిపించవు. సైకిలేసుకుని నియోజకవర్గంలో ఒక్కడే తిరిగేస్తుంటాడు. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఆయనకు సైకిలే వాహనంగా …

Read More »

అమెరికాకే తాలిబన్ల డెడ్ లైన్

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు, వెళ్ళిపోవడానికి గడువు పొడిగించే సమస్యే లేదని తాలిబన్లు తేల్చిచెప్పారు. అమెరికా, ఇంగ్లాండ్ తో పాటు నాటో దళాలు దేశాన్ని విడిచిపెట్టడానికి గతంలో నిర్ణయించుకున్న ఆగస్టు 31 డెడ్ లైన్ ఎట్టి పరిస్థితుల్లోను పొడిగించేది లేదని తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ తేల్చిచెప్పారు. ఒకవేళ గడువు దాటినా దేశం విడిచి వెళ్ళని దళాలకు ఏదైనా జరిగితే దాని బాధ్యత తమది కాదని కూడా తాలిబన్లు …

Read More »

24 మందిపై క్రిమినల్ కేసులా ?

రాష్ట్రంలోని 24 మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులున్నట్లు తాజాగా వెలుగులోకొచ్చింది. వీరిలో వైసీపీకి చెందిన ఎంపిలు, ఎంఎల్ఏలే ఎక్కువ మందున్నారు. అలాగే టీడీపీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. 2019-21 మధ్య జరిగిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వివరాలు సేకరించినట్లు ఏడీఆర్ చెప్పింది. సెక్షన్ 8 (1), (2), (3) ప్రకారం వీళ్ళ పై నమోదైన కేసులు రుజువైతే తీవ్రమైన శిక్ష …

Read More »

వైసీపీలోనూ ఈ పరిస్థితి ఉందా?

వైసీపీలో ఎప్పటి నుంచో అసంతృప్తులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో గోరంట్ల ఎపిసోడ్ తర్వాత ఇది చర్చకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా, ముఖా ముఖి మాట్లాడాలన్నా కష్టమనే మాట ఎక్కువగా వినబడుతోంది. ఈ మాటలు పెరిగి పెరిగి పెద్దవై పోయి చివరకు గోరంట్ల బుచ్చయ్యలా ఎదురు తిరిగే పరిస్ధితిగా మారకూడదని అనుకుంటే జగన్ వెంటనే మేల్కొనాల్సిందే. వాస్తవానికి రఘురామరాజు చేసిన ప్రధాన ఆరోపణ కూడా ఇదే. ఆయన …

Read More »

ఏపీ స్కూళ్లలో బయపడతున్న కరోనా ..

మొన్న 16వ తేదీన స్కూళ్ళు తెరిచిన దగ్గర నుంచి కరోనా వైరస్ మళ్ళీ బయటపడుతోంది. 16వ తేదీ నుంచి ఏపీలో హై స్కూళ్ళు తెరిచిన విషయం అందరికీ తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఒంగోలులోని ఓ స్కూల్ లో పరీక్షలు చేస్తే నలుగురు టీచర్లు, ముగ్గురు విద్యార్ధులకు కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దాంతో వెంటనే స్కూలును మూసేశారు. తాజాగా కృష్ణ జిల్లా, ముదినేపల్లి మండలంలోని పెదపాలపర్రు గ్రామంలోని స్కూల్ …

Read More »

రేవంత్ హెచ్చ‌రిక‌లు.. సీనియ‌ర్ల‌కేనా!

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు మ‌రోస్థాయికి చేరింది. ఓ వైపు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫ‌ల్యాల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తూ.. స‌భ‌లు, ర్యాలీలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందే దిశ‌గా అడుగులు వేస్తున్న ఆయ‌న‌.. మ‌రోవైపు పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించారు. పార్టీలో ప‌నిచేసే యువ‌కుల‌కే ప్రాధాన్య‌త ఉంటుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాళ్ల‌కే టికెట్లు ద‌క్కుతాయ‌ని స్ప‌ష్టం …

Read More »

కేసీఆర్ అటు నుంచి న‌రుక్కొస్తున్నారా?

ఉద్య‌మ నేత‌గా తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో కీల‌క పాత్ర పోషించి ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చున్న కేసీఆర్ అంటే మొండిఘ‌ట‌మ‌నే పేరుంది. ఆయ‌న అనుకున్న‌ది సాధించి తీరుతార‌ని బ‌య‌ట అంద‌రూ అనుకుంటుంటారు. ఇప్పుడు ఆ సంగ‌తి ఎందుకంటారా.. తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణ‌మైన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసం కేసీఆర్ అనుస‌రిస్తున్న వ్యూహాలే అందుకు నిద‌ర్శ‌నం. త‌న‌పై భూ క‌బ్జాకోరు ఆరోప‌ణ‌లు రావ‌డంతో టీఆర్ఎస్ …

Read More »

ఫరూఖ్ చంద్రబాబుకు ఆ హెల్ప్ చేస్తారా.. ?

తెలుగుదేశానికి ఇపుడు అన్ని వర్గాల మద్దతు కావాలి. టీడీపీ అంటే బీసీల పార్టీ అని ముద్ర పడింది. అయితే ఆ బీసీలను వైసీపీ ఒడుపుగా లాగేసింది. 2019 ఎన్నికల్లో వారు బాగానే ఫ్యాన్ పార్టీ వైపు టర్న్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వారిలో కొంత అసంతృప్తి ఉన్నా కూడా పూర్తిగా టీడీపీ కొమ్ము కాస్తారని ఎవరూ చెప్పలేరు. ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో బీసీల ఓట్లను వైసీపీతో కలసి పంచుకోవలసిందే. మరో …

Read More »