Political News

అమిత్ షా ముందు జగన్ కీలక ప్రతిపాదనలు

అధికార వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ప్రతిపాదనలకు మద్దతివ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో దాదాపు గంటపాటు భేటీ అయిన జగన్ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీచేయాలని విజ్ఞప్తి చేయటం గమనార్హం. ఎందుకంటే ఇప్పటివరకు మూడు రాజధానుల ప్రతిపాదన అన్నది రాష్ట్రపరిధిలోనే నలుగుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనకు అనుకూలంగా వ్యతిరేకంగా రాజకీయపార్టీల్లోను, న్యాయస్ధానాల్లోను అనేక …

Read More »

అమ‌రావ‌తి.. కేంద్రాన్ని సోము ఒప్పించ‌గ‌ల‌రా?

“బీజేపీ ప‌రంగా మేం రాజ‌ధాని అమ‌రావ‌తికే క‌ట్టుబ‌డి ఉన్నాం. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి మేం వ్య‌తిరేకం”- ఇదీ తాజాగా ఏపీ బీజేపీ చీఫ్‌.. సోము వీర్రాజు నోటి నుంచి జాలువారిన కీల‌క ప్ర‌క‌ట‌న‌. నేరుగా ఆయ‌న అమ‌రావ‌తి రైతుల మ‌ధ్య‌కే వెళ్లి.. ఈ విష‌యాన్ని చెప్పారు. ఒక ర‌కంగా.. ఇది రైతుల్లో ఉత్సాహం నింపేదే! అయితే.. దీనిలో నిజ‌మెంత‌? రాబోయే తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ను దృష్టి పెట్టుకుని చేసిన …

Read More »

ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయా ?

అమరావతి రాజధాని విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయా ? ఇదే అంశంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా తుళ్ళూరులో జరిగిన కిసాన్ సదస్సులో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. రాజధానిగా అమరావతే ఉంటుందని రైతులతో మాట్లాడుతు వీర్రాజు ప్రకటించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తోందంటూ ఆయన స్పష్టంగా చెప్పారు. పనిలోపనిగా తమకు అధికారం అప్పగిస్తే రూ. 5 వేల కోట్లతో రాజధానిని నిర్మించేస్తామని, రైతుల …

Read More »

తిరుపతిలో మూడు పార్టీల్లోను విచిత్ర పరిస్దితులేనా ?

అవును తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు సంబంధించి మూడు పార్టీల్లోను విచిత్రమైన పరిస్దితులే రాజ్యమేలుతున్నాయి. బీజేపీ, టడీపీ, వైసీపీల్లో ఏమి జరుగుతోందో అర్ధంకాక కొందరు జనాలు జుట్టు పీక్కుంటున్నారు. అభ్యర్ధిని ప్రకటించకుండానే హడావుడి చేసేస్తున్న పార్టీ ఒకటి. అభ్యర్ధిని ప్రకటించినా ప్రచారానికి దిగని పార్టీ మరోటి. ఇక అంతర్గతంగా డిసైడ్ అయినా అధికారికంగా ప్రకటించని పార్టీ ఇంకోటి. మూడు ప్రధాన పార్టీల వ్యవహారమే ఇలాగుంటే ఇక కాంగ్రెస్, వామపక్షాల గురించి …

Read More »

నిమ్మగడ్డ వాదనకు జగన్ మీడియా మద్దతిస్తోందా ?

స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వానికి స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నాయో కొత్తగా చెప్పక్కర్లేదు. మార్చిలో వాయిదాపడ్డ స్ధానిక సంస్ధల ఎన్నికలను జరపాలని ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మహా పట్టుదలగా ఉన్నారు. అందుకనే ఎన్నికల నిర్వహణపై ఇటు ప్రభుత్వానికి అటు న్యాయస్ధానానికి వరుసబెట్టి లేఖలు రాస్తున్నారు. నిమ్మగడ్డ వాదనకు, ప్రయత్నాలకు కౌంటరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరోనా కేసులను చూపుతున్నారు. నిమ్మగడ్డ …

Read More »

ఫాంహౌస్ లో తండ్రికొడుకులు.. ఏకాంత చర్చలు?

దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని ప్రత్యేకత తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సొంతం. సెక్రటేరియట్ కు వెళ్లకుండా.. పాలనా రథాన్ని అయితే పామ్ హౌస్ లేదంటే ప్రగతిభవన్ ద్వారా నడిపిస్తున్న వైనంపై తరచూ చర్చకు వస్తూ ఉంటుంది. అయినప్పటికీ.. ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోరు గులాబీ బాస్. ఎవరైనా ధైర్యం చేసి అడిగితే.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే సెక్రటేరియట్. ఆ మాత్రం తెలీదా? అంటూ ఆయన చేసే వ్యంగ్య …

Read More »

న్యాయవ్యవస్ధపై వ్యాఖ్యల కేసులో పెద్ద ట్విస్టు ?

న్యాయవ్యవస్ధపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అసలు ట్విస్టు బయటపడిందా ? విచారణ సందర్భంగా వెలుగుచూసిన విషయాల కారణంగా అందరిలోను ఇదే అనుమానం పెరుగుతోంది. ప్రభుత్వం విషయంలో హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు, విచారణకు తీసుకుంటున్న పిటీషన్లు, విచారణకు ఇస్తున్నఆదేశాల నేపధ్యంలో అధికార వైసీపీ నేతలతో పాటు మరికొందరు జనాలు న్యాయవ్యవస్ధ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనమయ్యాయి. దాంతో మీడియాతో పాటు సోషల్ …

Read More »

బీజేపీని గెలిపిస్తే తిరుపతిని స్వర్ణమయం చేస్తారట

విచిత్రంగా ఉంది కమలనాదుల మాటలు. ఆలూ లేదు చూలు లేదు కానీ మాటలు మాత్రం కోటలు దాటిపోతున్నాయి. ఇంకా తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు నోటీఫికేషనే రాలేదు. అప్పుడే ఉపఎన్నికలో బీజేపీని గెలిపిస్తే తిరుపతిని స్వర్ణమయం చేసేస్తామంటూ హామీలు మాత్రం గుప్పించేస్తున్నారు. బీజేపీని ఉపఎన్నికలో గెలిపించినంత మాత్రాన తిరుపతిని ఏ విధంగా స్వర్ణమయం చేస్తారో మాత్రం చెప్పటం లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఇటువంటి ఆచరణ సాధ్యంకాని ప్రకటనలే …

Read More »

త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయంతో టీఆర్ఎస్ కు తొలి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. దుబ్బాక గెలుపు…ఆ తర్వాత బల్దియా బరిలో అధికార పార్టీకి ఆధిపత్యానికి గండికొట్టడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎంపీ బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీ కేడర్ లో ఉత్సాహం వచ్చింది. సీఎం …

Read More »

చంద్రబాబు ఓటమికై పెద్దిరెడ్డి భీషణ ప్రతిజ్ఞ

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భీషణ ప్రతిజ్ఞ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతు సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కుప్పంలో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన ప్రకటన సంచలనంగా మారింది. చంద్రబాబు, పెద్దిరెడ్డి ఇద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన వారే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా ఉన్నాయి. వీళ్ళమధ్య వైరం రాజకీయంగానే కాకుండా ఓ రకంగా వ్యక్తిగతమనే …

Read More »

Big News: ఓవైసీతో కమల్ హాసన్ దోస్తీ?

ఇది ఎవ్వరూ ఊహించని కలయికే. తమిళ నాట రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్న కమల్ హాసన్.. ఒక మతానికి ముఖచిత్రంగా, ప్రతినిధిగా మారిన పార్టీతో దోస్తీ కట్టబోతున్నారట. ఆ పార్టీ.. హైదరాబాద్ పరిధిలో తిరుగులేని ఆదరణ ఉన్న ఎంఐఎంయేనట. హైదరాబాద్‌లో బలమైన పార్టీగా ఎదిగిన ఎంఐఎం.. దేశవ్యాప్తంగా ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలన్నింటికీ పార్టీని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ ముస్లింలు ఎక్కువుంటే అక్కడ ఎంఐఎం అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. …

Read More »

పాదయాత్రలతో వేడెక్కిపోనున్న తెలంగాణా

‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లాగ పాదయాత్ర చేయటానికి రెడీగా ఉన్నాను’ ..కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘రైతులు, జనాల సమస్యలు తెలుసుకునేందుకే తొందరలో పాదయాత్ర చేయబోతున్నాను’ జగ్గారెడ్డి ‘పీసీసీ ప్రెసిడెంట్ గా చేస్తే పాదయాత్ర చేస్తాను’.. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఇది పాదయాత్రకు సంబంధించిన లేటెస్టు హాట్ టాపిక్. విచిత్రమేమిటంటే పాదయాత్ర చేయటానికి రెడీ అవుతున్న ముగ్గురు నేతలు కూడా కాంగ్రెస్ వాళ్ళే. కోమటిరెడ్డి ఏమో మాజీమంత్రి భువనగిరి ఎంపి. …

Read More »