ఆంధ్రావనిలో సర్కారు తరఫున భూముల వేలాన్ని అడ్డుకుంటూ, వద్దని చెబుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్గాల అత్యుత్సాహంపై హైకోర్టు నీళ్లు జల్లింది. భూములను ప్రభుత్వం వేలం వేయడం ఏంటన్నది కోర్టు వారి ప్రశ్న. పేదలకు ఇవ్వాల్సిన భూములను కార్పొరేషన్ పేరిట ఎలా బహిరంగ మార్కెట్లో వేలం వేస్తారని కూడా అంటోంది. దీంతో జగన్ సర్కారు పునరాలోచనలో పడిపోయింది. విశాఖ కేంద్రంగా జరుగుతున్న భూముల వేలం అన్నది ఇప్పుడొక చర్చకు తావిస్తోంది. …
Read More »ఎవరీ ద్రౌపది.. ఎక్కడి వారు.. ఏం చేసేవారు?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. ఎన్డీఏ పక్షాలు అన్నింటితో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రపతిగా పనిచేసే అవకాశం గిరిజన వర్గాల వారికి లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేకాదు.. ఒక గిరిజన మహిళకు.. అందునా ఆదివాసీ మహిళకు అవకాశం దక్కడం ప్రప్రథమం. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము ఎవరు? ఏం చేసేవారు? ఎక్కడ నుంచి వచ్చారు? …
Read More »దగ్గుబాటికి చంద్రబాబు పరామర్శ.. కలుస్తున్న మనసులు!
ఎన్టీఆర్ పెద్ద అల్లుడు.. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి భర్త, సీనియర్ రాజకీయ నాయకుడు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వల్ప గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. స్టంట్ వేశారు. ప్రస్తుతం దగ్గుబాటి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అయితే.. దగ్గుబాటి అనారోగ్యానికి గురయ్యారని తెలుసుకున్న ఆయన తోడల్లుడు, అన్నగారిచిన్నల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే అపోలో ఆసుపత్రికి వెళ్లి.. పరామ ర్శించారు. …
Read More »టీడీపీ సాహసం చేస్తే వైసీపీ వినోదం చూస్తుందా ?
వచ్చే ఎన్నికల్లో ఫైట్ మామూలుగా ఉండదు అని తేలిపోయింది. రెండు పార్టీలూ కొట్టుకున్నా కొట్టుకుంటాయి. పరస్పర దాడులు చేసుకున్నా చేసుకుంటాయి. ఆ విధంగా ఆ రెండు పార్టీలూ ఉన్నాయి. ఓ విధంగా టీడీపీది ఇప్పుడు సాహసం. ఎందుకంటే ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలన్నవి ఉన్నా కూడా ఆ పార్టీ వీలున్నంత మేరకు నిరసనలు చేసి, ప్రజా బలం కూడగట్టుకోవాలని తెగ ప్రయత్నిస్తోంది. ఆ విధంగా టీడీపీకి ఇవాళ ప్రజా మద్దతు కూడా …
Read More »ఈ ప్రతిపక్షాలా మోడీని ఎదుర్కొనేవి ?
దేశంలో ప్రతిపక్షాల పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కాబట్టే నరేంద్ర మోడీ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్లమెంటులో కానీ బయట కానీ ప్రభుత్వాన్ని నిలదీసేంత దమ్మున్న పార్టీలు లేవని మోడీకి బాగా అర్ధమైపోయింది. పోనీ కేంద్రానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతాయా అంటే ఆ భయం కూడా ప్రధానమంత్రికి లేదు. ఎందుకంటే ప్రతిపక్షాల పరిస్ధితి అలాగుంది మరి. ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్ధినే ఎంపిక చేసుకోలేకపోతున్న ఈ …
Read More »పవన్ సర్వేలో షాకింగ్ విషయాలు !
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో పోటీచేస్తే గెలుపు కష్టమేనా ? ఇపుడిదే విషయమై చర్చ మొదలైంది. పవన్ తిరుపతిలో పోటీచేస్తే లక్ష ఓట్ల మెజారిటితో గెలిపిస్తామని ఈమధ్యనే జనసేన లోకల్ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. అంతేకాకుండా తిరుపతి నేతలంతా కలిసి పవన్ పోటీపై ఒక తీర్మానంకూడా చేసి పంపారు. వీళ్ళ తీర్మానం, లక్ష ఓట్లమెజారిటి లాంటి అనేక విషయాలు చూసి పవన్ సర్వే చేయించుకున్నారట. అయితే ఈ సర్వేలో …
Read More »డీఎస్సీ-98లో చిత్ర విచిత్రాలు
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా క్లియర్ చేసిన డీఎస్సీ-98లో కొన్ని చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న వాళ్ళకి, మరో పదిరోజుల్లో ఉద్యోగాల నుండి రిటైర్ అవుతున్న వారికే కాదు చివరకు ఎంఎల్ఏకి కూడా టీచర్ పోస్టింగ్ రాబోతోంది. 1998లో డీఎస్సీ రాసి క్వాలిఫై అయి టీచర్ ఉద్యోగాల కోసం వేలాది మంది అభ్యర్ధులు ఎదురుచూస్తున్నారు. అయితే వివిధ కారణాలతో కోర్టులో కేసులు దాఖలయ్యాయి. విచారణ తర్వాత …
Read More »పవన్లో ఇంత పొలిటికల్ కన్ఫ్యూజా…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కన్ఫ్యూజ్ మాస్టరా? అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజులు పొత్తులు అంటారు.. మరికొన్ని రోజులు వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకుండా తానే నడుం బిగిస్తానని.. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తానని.. ఆయన ప్రకటించారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని కూడా చెప్పారు. అంతేకాదు.. తనతో పొత్తు పెట్టుకునేందుకు ఎవరు ముందుకు వచ్చినా.. తాను …
Read More »ఇంత వయొలెన్స్ అవసరమా జగన్ ?
వరుస అరెస్టులతో టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు యువ ముఖ్యమంత్రి వైఎస్.జగన్. ఆ విధంగా ధూళిపాళ నరేంద్రను అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్త ఒకటి వచ్చింది. అక్కడి తెలుగుదేశం పార్టీ అప్రమత్తం అయిపోయింది. పొన్నూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా జరుగుతోందని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ఛలో అనుమర్లపూడికి పిలుపునిచ్చిన నేపథ్యాన ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు అత్యంత …
Read More »బాబు నడిస్తే చాలదు… నేతలను నడిపించాలిగా…!
టీడీపీ అధినేత చంద్రబాబు వయసు 70+ కానీ, ఆయన మాత్రం 20+ మాదిరిగా జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. వైసీపీ నేతలకు సవాళ్లు రువ్వుతున్నారు. గతంలో కూడా లేని ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఇది మంచి పరిణామమే. చంద్రబాబుపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టేదే. అయితే.. చంద్రబాబు ఒకవైపే చూస్తున్నారనేది విశ్లేషకుల మాట. తాను మాత్రమే నడిస్తే.. పార్టీలో జోష్ పెరగదని అంటున్నారు. తను ఎంచుకున్న లక్ష్యాన్ని మరింత బలంగా ముందు …
Read More »బాసర : వీళ్లను చూసి నేర్చుకోండి ?
ఎండ, వాన పట్టకుండా ఉంటున్నారు. అబ్బా! ఇంటికి పొండి మీకు సెలవులు ఇచ్చేస్తాం అని కేసీఆర్ అంటూ ఉంటే పట్టించుకోకుండా అక్కడే ఉండిపోతున్నారు ఆ బిడ్డలు. నిరసనకు ఓ కొత్త నిర్వచనం చెబుతున్న ఈ బిడ్డలు తాము అనుకున్నవి సాధించే వరకూ తరగతి గదుల్లోకి తొంగి చూడం అని అంటున్నారు. ఇది కదా ! కావాలి..బాసర విద్యార్థులు (ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అని రాయాలి) దేశానికే ఒక కొత్త మార్గం …
Read More »షర్మిల ఎంపిక వ్యూహాత్మకమేనా ?
వైఎస్సార్టీపీ అద్యక్షురాలు చేసిన ప్రకటన వ్యూహాత్మకమేనా ? ఇపుడిదే చర్చ తెలంగాణా రాజకీయాల్లో మొదలైంది. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేయబోతున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. షర్మిల ప్రకటనపై రాజకీయపార్టీల్లో చర్చలు మొదలైతే ఖమ్మం జిల్లాలో అయితే ఒక్కసారిగా వేడి రాజుకుంది. పాలేరు నుండి పోటీచేయాలన్న షర్మిల ప్రకటన వ్యూహాత్మకమనే చెప్పాలి. ఎలాగంటే యావత్ తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో దివంగత సీఎం వైఎస్సార్ కు స్ట్రాంగ్ మద్దతుదారులు, అభిమానులున్న …
Read More »