టీడీపీ, జనసేన పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్‌లు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తుపై వారు చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి ఇప్పటికే బీజేపీతో పొత్తు ఖరారు అయినట్లు చెబుతున్నారు. మరోవైపు చివరి విడత చర్చ ల కోసం వెళ్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇదిలావుంటే.. ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మార్చి …
Read More »ఇవే చివరి ఎన్నికలు.. వైసీపీ యువ నేత
వైసీపీ యువ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండో కుమారుడు మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి రాజంపేటలో నిర్వహించిన వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇవే తనకు చివరి ఎన్నికలని వ్యాఖ్యానించారు. తాను రెండు సార్లు రాజంపేట ఎంపీగా విజయం దక్కించుకోవడంలో నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారని.. వారిని తాను మరిచిపోలేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని అన్నారు. “రాజంపేట అభివృద్ధికి …
Read More »కురుక్షేత్ర యుద్ధంలో మీరు ఎటు వైపు?
మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఈ యుద్ధంలో మీరు(మహిళలు) ఎటువైపు నిలబడుతున్నారని ఆమె ప్రశ్నించారు. రాజకీయంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ వైపు నిలబడితే.. మీ కు భవిష్యత్తు ఉండదని తేల్చి చెప్పారు. చంద్రబాబు కోసం నిలబడితే.. మీ పిల్లల భవితవ్యం బంగారు బాట పడుతుందని వ్యాఖ్యానించారు. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి యాత్రలు చేస్తున్న …
Read More »కొడుకు ‘యువగళం’.. తండ్రి ‘ప్రజాగళం’
టీడీపీ అధినేత చంద్రబాబు మరోవినూత్న కార్యక్రమంతో ప్రజల మధ్యకు రానున్నారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా పార్టీ రూపకల్పన చేసింది. దీనికి ప్రజా గళం అని పేరుపెట్టారు. ఈ కార్యక్రమంలో ఐదు రోజుల పాటు నిర్విరామంగా చంద్రబాబు ప్రజల మధ్యే ఉండనున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోనున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో పాదయాత్రలు కూడా చేయనున్నారు. ప్రజాగళం కార్యక్రమంలో కేవలం చంద్రబాబు …
Read More »జనసేనకు మెగా ఫ్యామిలీ స్టార్ క్యాంపెయినర్
జనసేన పార్టీకి మరో స్టార్ క్యాంపెయినర్ రెడీ అయ్యారు. అది కూడా మెగా కుటుంబం నుంచే కావడం గమ నార్హం. వచ్చే ఎన్నికల్లో జనసేనను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని కూడా చెప్పడం విశేషం. అయితే.. ఆ స్టార్ క్యాంపెయినర్.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. బాబాయి(జనసేనాని పవన్)తో కలిసి …
Read More »నిజంగెలవాలి.. ఎన్నికలు వచ్చేదాకా!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నిజం గెలవాలి పేరుతో ఆయన సతీమణి నారా భువనేశ్శరి పరామర్శిస్తున్నారు. ఇప్పటివరకూ 8 టూర్లలో కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి చెక్కులు ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తల కుటుంబాలకు సాయం చేయడంలో భువనేశ్వరి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైన ఆమె.. రాజకీయంగా కూడా దూకుడు పెంచారు. వైసీపీని అంతం చేసేందుకు కలిసి …
Read More »నారా లోకేష్ ఎందుకు రాలేదు?
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఖరారై సీట్ల పంపిణీలో కూడా ఒక అవగాహనకు వచ్చాక కొన్ని రోజుల కిందటే అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఉమ్మడి ప్రెస్ మీట్‌తోనే ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లయింది. ఆ తర్వాత తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం ‘జెండా’ పేరుతో తొలి ఉమ్మడి బహిరంగ సభను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం యువనేత, నారా చంద్రబాబు …
Read More »జగన్ ఇప్పటికైనా ఆపుతాడా?
నిన్నటి ‘జెండా’ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అనేక మంచి విషయాలు చెప్పాడు. జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. వాటన్నింటినీ దాటి సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న కామెంట్.. జగన్‌ను తన నాలుగో పెళ్లాం అనడం. జనసేనాని మీద విమర్శలు గుప్పించడానికి జగన్ సహ వైసీపీ వాళ్లందరూ ఎప్పుడూ వాడే అస్త్రం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారమే. అంటే ప్యాకేజ్ స్టార్ అంటారు. …
Read More »పవన్ కంఠ శోష.. అర్ధం కావడం లేదా?
కాపులు ఐక్యంగా ఉండాలి.. కాపు నేతలు కలిసి రావాలి.. అప్పుడే వైసీపీని గద్దెదించగలం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. పిల్ల పుట్టగానే పరుగులు పెట్టదన్నట్టుగా.. జనసేన కూడా.. పరుగులు పెట్టేందుకు సమయం పడుతుందని.. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను పరిశీలనలోకి తీసుకుంటే ఈ విషయం అవగతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. “బలం ఉందో లేదో చూసుకోకుండా.. ఎగిరితే మనమే నష్టపోతాం” అని చెప్పుకొచ్చారు. …
Read More »సెంటిమెంటునే ఫాలో అవుతున్నారా ?
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ సెంటిమెంటునే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట. ఎలాగంటే మార్చి 10వ తేదీన కరీంనగర్లో పార్లమెంటు ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా. కేసీయార్ కు సెంటిమెంట్లు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. పూజలు, యాగాలు, హోమాలు చేయిస్తునే ఉంటారు. ఇపుడు విషయం ఏమిటంటే ఎన్నికలు ఏవైనా సరే కరీంనగర్ జిల్లా నుండే బహిరంగ సభలు నిర్వహించడం సెంటిమెంటు. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ బహిరంగసభతోనే …
Read More »బీకాంలో ఫిజిక్స్‌కు కెమిస్ట్రీ కుదిరింది.. ఎమ్మెల్సీ + పదవి!
టీడీపీ నేత, మైనారిటీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మెత్తబడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆయనకు మిత్రపక్షం కారణంగా ఈ దఫా టికెట్ దక్కలేదు. అయితే.. ఇలా టికెట్ దక్కనివారిని వైసీపీ గాలికి వదిలేసినట్టుగా టీడీపీ వదిలేయలేదు. వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరీ బుజ్జగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నారా లోకేష్ .. జలీల్ ఖాన్‌ను బుజ్జగించారు. ఆయన …
Read More »పేర్నివారి పురాణాలు.. పవన్ గురించి ఏమన్నారంటే..
వైసీపీ కీలక నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. తాజాగా పవన్‌పై విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత బుధవారం నిర్వహించిన జెండా సభలో చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చిన.. నాని.. పురాణాలతో పవన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ శల్యుడు, శిఖండి అని వ్యాఖ్యానించారు. “చంద్రబాబుకు సరైన జోడీ దొరికింది. శల్య సారథ్యంలో ఆయన ముందుకు సాగుతున్నాడు. తమ్ముళ్లే ఇక, తేల్చుకోవాలి” అని నాని అన్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates