పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న కెనడా దేశాల పర్యటనకు వెళ్లారు. 5 రోజుల పాటు ఆయా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. తొలుత అమెరికాకు చేరుకున్న నారా లోకేష్‌కు డల్లాస్‌లో ఏపీ ఎన్నార్టీ నాయకులు, స్థానిక ప్రవాసాంధ్రుల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం.. ఆయన తెలుగు ప్రవాసులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అండగా ఉన్న తెలుగు వారికి ధన్యవాదాలు తెలిపారు.
వరల్డ్ బ్యాంకులో పనిచేశా..
తాను అమెరికాలోనే చదువుకున్నానని.. ఇక్కడి ప్రపంచ బ్యాంకులోనూ పనిచేశానని నారా లోకేష్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. అమెరికాతో తనకు తొమ్మిది సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. కాగా.. ప్రవా సాంధ్రులు ఎక్కడ ఉన్నా.. వారికి అండగా నిలుస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు చేసిన కృషి.. ఏపీ ప్రజలు బాగుండాలని వారు చేసిన ప్రచారాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు. తాను విదేశీ పర్యటనలు పెట్టుకున్నప్పుడు కూడా వారు అంతే మద్దతు ఇస్తున్నారన్నారు.
టీ-11.. వైసీపీపై సెటైర్లు
ఈ సందర్భంగా వైసీపీపై నారా లోకేష్ సెటైర్లు వేశారు. టీ-11 అంటూ వైసీపీని సంబోధించిన ఆయన.. వారికి తన పర్యటనలు చూసి, తన ప్రసంగాలు విని.. తనకు వస్తున్న మద్దతును చూసి నిద్ర కూడా పట్టడం లేదన్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని తెలిపారు. చంద్రబాబు స్పీడును అందుకునేందుకు తాను ఎంతో శ్రమిస్తున్నట్టు చెప్పారు. తెలుగు వారి మద్దతు ఇలానే ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
నాలుగు రోజుల షెడ్యూల్ ఇదీ..
7వ తేదీ: డల్లాస్‌లో తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ పాల్గొంటారు.
8, 9 తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమావేశం చేపట్టారు.
10న కెనడా వెళ్లారు. అక్కడి టొరంటోలో నిర్వహించే పెట్టుబడుల సదస్సులో పాల్గొని పారిశ్రామిక వేత్తలను ఏపీకి ఆహ్వానిస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates