తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెక్ పోస్టులను (జాతీయ రహదారులపై కాదు) రద్దు చేస్తూ.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణయం వెనుక రాష్ట్ర ప్రభుత్వంతోపాటు.. కేంద్ర ప్రభుత్వం కూడా ఉండడం గమనార్హం. ఎందుకంటే.. దాదాపు దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో ప్రభుత్వం స్థానికంగా రహదారులు నిర్మించలేదు. ఈ వ్యవహారం ఒకప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీనికి తాజాగా …
Read More »రంగంలోకి కేసీఆర్.. మరింత పదునెక్కనున్న ప్రచారం!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్.. గెలిచేందుకు ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే రెండు కీలక అంశాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నారు. వీటిలో ఒకటి హైడ్రా, రెండు బస్తీ దవాఖానాలు(పీహెచ్సీ). ఈ రెండు అంశాలపైనా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. పేదల ఇళ్లకు హైడ్రాశత్రువు అంటూ.. …
Read More »ఇండియాకి ఏపీ గేట్ వే: నారా లోకేష్
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్.. అక్కడి పెట్టుబడి దారులను ఆకర్షించే ప్రయత్నంలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని.. పెట్టుబడి దారుల తో చర్చలు జరిపారు. తాజాగా మరో కీలక మైలురాయిని ఆయన చేరుకున్నారు. బ్రిస్బేన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏపీలో ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. భారత్‌కు ఏపీ గేడ్‌వేగా మారిందని.. పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనలో …
Read More »అమరావతికి 100 కోట్ల విరాళం.. ఎందుకంటే!
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భారీ విరాళం లభించింది. 100 కోట్ల రూపాయల విరాళం ఇవ్వనున్నట్టు దుబాయ్ కు చెందిన శోభా గ్రూప్ సంస్థ చైర్మన్ పీఎన్సీ మీనన్ తెలిపారు. ఈ నిధులతో ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని నిర్మించాలని మీనన్ సూచించారు. ప్రస్తుతం దుబాయ్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్ర బాబును కలుసుకున్న మీనన్.. ఈ మేరకు ప్రతిపాదించారు. బుధవారం సాయంత్రం దుబాయ్‌లో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన మీనన్.. రాష్ట్రంలో పెట్టుబడులపై …
Read More »ఉమ్మడి కృష్ణాలో ఈ రెండు నియోజకవర్గాలు హాట్.. హాట్‌గా…!
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలు రాజకీయాలు హాట్ హాట్‌గానే కొనసాగుతున్నాయి. ఎన్నికల అనంతరం.. టీడీపీ నాయకులు విజయం దక్కించుకున్న ఈ రెండు నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీ నాయకుల మధ్యే విభేదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి. సాధారణంగా సొంత పార్టీ నయకులు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినా.. నాయకులు ఆయన మాటను పెడచెవిన పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాలే.. గన్నవరం, తిరువూరు. …
Read More »ఆ వైసీపీ నేతకు అధికారం పోయినా.. అహంకారం పోలేదా ..!
వైసీపీ నాయకులకు అధికారం పోయినా.. అధికార దర్పం మాత్రం పోలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అనేక విషయాల్లో వైసిపి నాయకులు ఇంకా తమ తీరు మార్చుకో లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ వైసీపీ నాయకులు మాత్రం తమ తీరులో ఏ మాత్రం మార్పు చూపించలేకపోతున్నారు. అనేక విషయాల్లో ఇప్పటికే నాయకులు కేసుల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. ఒకవైపు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం …
Read More »పోలవరంలో జగన్‌కు ముడుపులు.. జ్యోతుల సంచలనం..!
పోలవరం ప్రాజెక్టును తన తండ్రి మాజీ సీఎం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించారని దీనిని తాను ప్రాణప్రదంగా భావిస్తున్నామని వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోనూ పోలవరం ప్రాజెక్టుపై ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా నిర్మిస్తున్నామని కూడా చెప్పారు. అంతేకాదు 2014 19 మధ్య కాలంలో టిడిపి ఇచ్చిన కాంట్రాక్టు రద్దుచేసి రివర్స్ టెండర్లను పిలిచి …
Read More »జగన్ కు లోకేష్ కు తేడా వివరించిన ఎమ్మెల్యే
నాయకులు అంటే.. ప్రజలకు చేరువ కావడం ఒక భాగం మాత్రమే. వారిని మెప్పిస్తేనే తిరిగి ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. ఇదొక్కటే కాదు.. కదా? నాయకులు అన్నాక.. పార్టీ నాయకులతోనూ మమేకం కావాలి. అప్పుడే పార్టీలోనూ నాయకులకు బలమైన నేతల అండ లభిస్తుంది. అంతేకానీ.. అధికారంలో లేనప్పుడు.. అందరూ నావారని,, అధికారంలోకి వచ్చాక గేట్లు వేసేస్తే.. పరిస్థితి దారుణమనేది తెలిసిందే. గతంలో వైసీపీ అధినేత జగన్ పార్టీనిఅధికారంలోకి …
Read More »మాధవీలతకు షాకిచ్చిన జూబ్లీహిల్స్ ఓటర్లు…
బీజేపీ నాయకురాలు, గత ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైన ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు మాధవీ లతకు.. తాజాగా జూబ్లీహిల్స్ ఓటర్లు షాకిచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆమె ఇంటింటికీ తిరుగుతూ.. అభ్యర్థి లంకలపల్లి దీపక్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. పాంప్లేట్స్ అందిస్తూ.. అందరినీ కలుస్తున్నారు. అయితే.. పలువురు మహిళలు మాధవీ లతను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మాకు మీరు ఏం …
Read More »18 లక్షలు- 12 ఎకరాలు: ఆ కుటుంబానికి చంద్రబాబు సాయం!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న దారగానిపాడు గ్రామంలో జరిగిన దారుణ హత్య పై సీఎం చంద్రబాబు ఉదారంగా స్పందించారు. ఈ నెల 2న జరిగిన ఘటనలో లక్ష్మీనాయుడు అనే వ్యక్తిని టీడీపీకి చెందిన హరిశ్చంద్రప్రసాద్ అనే వ్యక్తి కారుతో గుద్దించి సినీ ఫక్కీలో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ఈ ఘటనకు కులం రంగు కూడా …
Read More »భూమనకు పోలీసుల నోటీసులు, రీజనేంటి?
తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి జాల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు రావాలని ఆయనకు సూచించారు. అదేవిధంగా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తిరుపతిలోని గోశాలపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కూడా తీసుకురావాలని పోలీసులు ఆయనకు తెలిపారు. విచారణకు రాకపోతే.. కేసు నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏం జరిగింది? రాష్ట్రంలో కూటమి …
Read More »భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ ఫైర్ .. రీజనేంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తరచుగా పోలీసుల వ్యవహారంపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఒకసారి ఆయన.. పోలీసు శాఖను తామే తీసుకునే వాళ్లమని కూడా అన్నారు. రాష్ట్రంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన పలు సందర్భాల్లో విమర్శించారు. అయితే.. చీటికీ మాటికీ కాకుండా.. చాలా తీవ్రమైన అంశాలు తెరమీదికి వచ్చినప్పుడు మాత్రమే పవన్ కల్యాణ్ స్పందిస్తున్నారు. అలా.. ఇప్పుడు మరోసారి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates