Political News

పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్

వ‌ల్ల‌భ‌నేని వంశీ.. కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం శాస‌న స‌భ్యుడు. గ‌త ఎన్నిక‌ల్లోనే కాదు.. అంత‌కుముందు కూడా.. ఆయ‌న టీడీపీ నాయ‌కుడిగానే ఇక్క‌డ నుంచి గెలుస్తున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అప్ప‌ట్లో చంద్ర‌బాబుపైనా.. పార్టీ యువ నాయ‌కుడు.. నారా లోకేష్‌పైనా.. విరుచుకుప‌డ్డారు. అయితే.. అప్ప‌ట్లోనే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వంశీ గతం మరిచి మాట్లాడున్నారని నియోజకవర్గంలోనే చర్చ జరిగింది. అయితే.. రాజ‌కీయాల్లో …

Read More »

ప‌వ‌న్ విష‌యంలో బీజేపీది స్వ‌యంకృతమేనా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌మ‌తోనే ఉన్నాడ‌ని.. త‌మ రెండు పార్టీలూ పొత్తుతోనే ముందుకు వెళ్తున్నాయ‌ని.. బీజేపీ నేత‌లు ప‌దే ప‌దే చెప్పుకొంటున్న విష‌యం తెలిసిందే. అయితే.. గ‌త కొన్నాళ్లుగా ప‌వ‌న్ వ్య‌వ‌హారం.. మారుతున్నా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్నా… ఏమీ మాట్లాడ‌లేని.. ప‌న్నెత్తు మాట అన‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. బీజేపీ చేసుకున్న స్వ‌యంకృత‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. …

Read More »

డీజీపీ పై మ‌రోసారి చంద్ర‌బాబు ఫైర్‌.. ఎందుకంటే

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోసారి రాష్ట్ర పోలీసుల‌పై ఫైర‌య్యారు. తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశా రు. రాష్ట్ర పోలీసులు అనుస‌రిస్తున్న వ్య‌వ‌హారంపై ఆయ‌న ఫైర‌య్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న లేఖ రాశారు. “టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్ అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ కార్యాలయానికి, పోలీస్ బెటాలియన్ …

Read More »

ఏ గ్రౌండ్స్ లో పట్టాభికి హైకోర్టు మంజూరు చేసింది?

గడిచిన మూడు నాలుగు రోజులుగా ఏపీతో పాటు తెలంగాణలోనూ హాట్ టాపిక్ అయిన రాజకీయ రగడకు సెంటర్ గా మారారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య చేసిన ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రాత్రి వేళ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ ఆయన్ను అరెస్టు చేయటం.. తాజాగా ఆయన రాజమహేంద్రవరం జైలుకు తరలించటం తెలిసిందే. దీంతో.. పట్టాభికి …

Read More »

ఈ దీక్ష‌ల‌తో ఎవ‌రికెంత లాభం?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజకీయాలు ఇప్పుడు మంచి కాక మీదున్నాయి. అధికార ప్ర‌తిప‌క్ష నాయ‌కుల ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు.. బూతులు.. తిట్లూ.. పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు ఇలా రాష్ట్ర వాతావ‌ర‌ణం వేడెక్కింది. టీడీపీ పార్టీ కార్యాలయాల‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయంటూ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 36 గంట‌ల దీక్ష‌కు పూనుకున్నారు. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నాయ‌కులు బూతులు వాడుతూ మాట్లాడ‌టాన్ని నిర‌సిస్తూ వైసీపీ కూడా పోటీగా జనాగ్ర‌హ దీక్ష‌కు శ్రీకారం …

Read More »

ఆ పదానికి అర్థమేంటి.. తెగ వెతికేస్తున్న నెటిజన్లు

బోసిడీకే.. ఇప్పుడీ పదం ఎక్కడ లేని ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి అర్థమేంటో తెలియకుండానే ఎప్పట్నుంచో తెలుగు జనాలు తెగ వాడేస్తున్నారు. సరదాగా తిట్టాల్సి వచ్చినపుడు ఈ మాటను ఉపయోగిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం నేత పట్టాభిరామ్ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ మాట అనడంతో పెద్ద దుమారమే రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ కార్యాలయాలు, అలాగే పట్టాభిరామ్ ఇంటిపై వైసీపీ శ్రేణులు భయానక రీతిలో …

Read More »

ప్లేస్.. టైం డిసైడ్ చేస్తే కొట్టేసుకుందాం : నాని

ఏపీలో రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా మారాయన్నది తెలిసిందే. ఎవరికి వారు తమ లక్ష్మణ రేఖల్ని దాటేస్తూ.. తమకు తగ్గ వాదనను వినిపిస్తున్నారు. ఈ క్రమంలో బూతులు తిడతారా? అంటూ ఆవేదనగా ప్రశ్నిస్తూనే.. మరిన్ని బూతుల్ని ప్రయోగించటం కనిపిస్తోంది. దీనికి వారి ప్రత్యర్థులు సైతం ఏ మాత్రం తగ్గకుండా.. తమ యథాశక్తితో మాటల్ని రువ్వుతున్నారు. ఇలాంటివేళ.. విజయవాడ ఎంపీ కమ్ సీనియర్ టీడీపీ నేత కేశినేని నాని మరింత …

Read More »

‘నాలుగైదు రోజులుగా పొట్టు పొట్టు అవుతోంది’.. కేసీఆర్ పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య

సాధారణంగా ముఖ్యమంత్రి కమ్ పార్టీ బాస్ కమ్ తండ్రి కేసీఆర్ మీద నేరుగా వ్యాఖ్యలు చేయడం లాంటివి మొదట్నించి కేటీఆర్ మాటల్లో కనిపించదు. వినిపించదు. ఎప్పుడో ఒకసారి అరుదుగా ఆయన మాటల్లో తన తండ్రి ప్రస్తావన వస్తుంది. అప్పుడు కూడా బాస్ అని ప్రస్తావిస్తారే కానీ.. నాన్న అన్న మాటను తీసుకురారు. అలాంటి కేటీఆర్.. తాజాగా ‘బాస్’ గురించి మాట్లాడారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి ఒక మీడియా సంస్థకు …

Read More »

జగన్ తర్వాత సెకండ్ హయ్యెస్ట్… వైసీపీకి జీరో స్పందన ఎందుకిలా?

ఆ ఎమ్మెల్యే సీఎం జగన్ తర్వాత అత్యంత మెజార్టీతో విజయం సాధించారు. దీన్ని బట్టి సహజంగా మనం అక్కడ వైసీపీకి బలమైన పునాదులున్నాయని అనుకుంటాం. పార్టీకి బలమైన కేడర్ ఉంది అనుకుంటాం. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముతుమల అశోక్‌రెడ్డిపై  వైసీపీ అభ్యర్థి అన్న రాంబాబుపై అక్షరాల 81520 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జగన్ తర్వాత వైసీపీకి అత్యధిక మెజారిటీ …

Read More »

ప‌వ‌న్ విష‌యంలో బీజేపీ.. మౌనం ఎందుకు?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. బీజేపీతో పొత్తులో ఉన్నారు. 2020లోనే ఆయ‌న ఎన్నిక‌లు ముగిసిన సంవ‌త్స‌రంలోనే బీజేపీ పెద్ద‌ల‌తో పొత్తు కుదుర్చుకున్నారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి మంత్రాంగం న‌డిపివ‌చ్చారు. ఇక‌.. అప్ప‌టి నుంచి బీజేపీతో పొత్తులో ఉన్నాన‌ని.. ప‌వ‌న్ చెబుతున్నారు. ఢిల్లీ పెద్ద‌లు త‌ర‌చుగా ప‌వ‌న్‌ను వివిధ కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆహ్వానిస్తున్నారు. ఇక‌, రాష్ట్రంలోనూ అప్పుడ‌ప్పుడు.. ప‌వ‌న్‌.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. సోము వీర్రాజు త‌దిత‌రుల‌తో భేటీ అవుతున్నారు. ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాల‌కు …

Read More »

ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు

ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరుకోబోతున్నాయి. ఇటు అధికార వైసీపీ అటు ప్రధాన ప్రతిపక్షం మధ్య మొదలైన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని టీడీపీ నేత పట్టాభి అనుచితమైన పదాన్ని వాడటం, దాంతో ఒళ్ళు మండిన వైసీపీ నేతలు టీడీపీ ఆఫీసులపై దాడులు చేయటంతో రాజకీయంగా ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. దాంతో చంద్రబాబునాయుడు రాష్ట్ర బంద్ కు పిలుపిచ్చారు. దాని తర్వాత 36 గంటల నిరసన దీక్షకు …

Read More »

పొలిటికల్ మైలేజ్ కోసమేనా ?

జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలు కేవలం రాజకీయంగా మైలేజీ కోసమే అని పోలీసులు తేల్చేశారు. పట్టాభి అరెస్టు సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు. సీఎంను టార్గెట్ చేసుకునే ఉద్దేశ్యపూరితంగా, సమాజంలో అశాంతిని రేకెత్తించే ఉద్దేశ్యంతోనే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రిమాండ్ రిపోర్టు ద్వారా కోర్టుకు తెలిపారు. పట్టాభి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో ఎలాంటి అంశాంతి …

Read More »