తెలంగాణ కాంగ్రెస్ చీఫ్.. రేవంత్‌రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీల గేమ్ ప్లాన్ అందరికీ తెలుసని.. అన్నారు. వ్యూహాత్మకంగా..రెండూ వ్యవహరిస్తున్నాయని.. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకే ఆ పార్టీల నేతలు ఒకరిపైనొకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు. మోటార్లకు మీటర్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు సభకే హాజరుకాలేదని …
Read More »కాంగ్రెస్ చేస్తున్న అదే తప్పు.. మునుగోడులో కూడా!
పదే పదే తప్పులు చేయడం.. కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలోనూ.. ఇదే తరహాలో కాంగ్రెస్ వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. పలితంగా.. పార్టీకి అపారమైన నష్టం వస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో.. అభ్యర్థిని నిర్ణయించేందుకు చాలా సమయం తీసుకున్నారు. అప్పటికే ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారం కూడా ప్రారంభించేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిలోనూ.. కార్యకర్తల్లోనూ.. నీరసం వచ్చేసింది. …
Read More »అన్నా క్యాంటీనే లక్ష్యం.. కుప్పంలో అదే రచ్చ
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో మళ్లీ అదే రచ్చ తెరమీదికి వచ్చింది. అన్న క్యాంటీన్లపై వైసీపీ కార్యకర్తలు.. రాత్రికి రాత్రి దాడి చేసి.. ఎక్కడికక్కడ.. వాటిని నాశనం చేశారని.. టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడు సందర్భంగా.. కుప్పంలోని ఆర్టీసీ బస్టాండు కూడలిలో అన్నక్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. వాస్తవానికి అప్పట్లోనే దీనికి అధికారులు అనుమతులు ఇవ్వలేదు. అయితే.. ఎట్టకేలకు …
Read More »కేంద్రం నిర్ణయం.. తెలంగాణ బీజేపీని చిక్కుల్లో పడేసిందా?
కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. ఒకవైపే చూస్తున్నారా? తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు సానుకూలంగా వ్యవహరిస్తున్నారా ? తమతో విబేధిస్తున్నవారికి షాకులు ఇస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని.. తెలంగాణను బాగు చేస్తామని.. చెబుున్న కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. తాజాగా తీసుకున్న నిర్ణయం.. ఆ పార్టీనే ఇరుకున పడేసింది. అదే సమయంలో తెలంగాణను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఏపీకి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని.. …
Read More »తెలంగాణకు మరోషాక్.. ఏపీ బాకీ చెల్లించాలని కేంద్రం ఆదేశం
తెలంగాణలోని కేసీఆర్ సర్కారుకు కేంద్రం తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను వడ్డీతో సహా కలిపి మొత్తం 6,800 కోట్ల రూపాయలను చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే ఇవ్వాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పునర్విభజన చట్టం ప్రకారం విద్యుత్ బకాయిలు చెల్లించాలని సూచించింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు ఏపీ డిస్కంలు …
Read More »దేశానికి 5 రాజధానులు ఉంటే తప్పేంటి
ప్రాంతీయ భేదం తలెత్తకుండా దేశానికి ఐదు రాజధానులు ఉండాలని అసోం సీఎం, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వశర్మ ప్రతిపాదించారు. ప్రతి జోనుకు ఒకటి చొప్పున ఐదు రాజధానులు అవసరమని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రితో ట్విట్టర్లో మాటల యుద్ధం నడుస్తున్న సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడుతున్నప్పుడు… ఆయనకు పక్క రాష్ట్రాలను ఎగతాళి చేసే అలవాటు ఉందని తెలిపారు. రాష్ట్రాల …
Read More »ఆంధ్రా అష్టదిగ్బంధం.. కాలు కదిపితే నిఘా నేత్రం!
మరొక్క రోజులో వినాయచవితి పండుగ. పిల్లాపాపలతో అందరూ ముచ్చటగా చేసుకునే తొలి పండుగ. ఇంటిల్లి పాదీ బయటకు వచ్చి.. అంతో ఇంతో సంతోషంగా గడిపే సమయం. కానీ.. ఇది ఏపీ ప్రజలకు దూరం కానుంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ ఇప్పు డు పోలీసుల అష్టదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. కాలు కదిపితే.. ఎవరు ఉద్యోగో.. ఎవరు సామాన్య పౌరులో తెలుసుకునేందుకు పోలీసులు వెంటాడేస్తున్నారు. దీంతో బయటకు వచ్చే పౌరులు తమ గుర్తింపు పత్రాలతో రావాల్సిన …
Read More »వైసీపీ సర్కారుకు ఎదురుదెబ్బ
ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బతగిలింది. గతంలో ప్రతిపక్షాలు సహా ప్రజాస్వామ్య వాదులు.. స్వచ్ఛంద సంస్థలు ఏం చెప్పాయో.. ఇప్పుడు అక్షరాలా.. హైకోర్టు కూడా అదే చెప్పింది. రాజకీయ వ్యూహంలో భాగంగా అమలు చేసిన కొన్ని పథకాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో.. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించింది. అయితే.. వీటిని …
Read More »మోడీ గోల్ మాల్ ప్రధాని: కేసీఆర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై నిత్యం విరుచుకుపడే తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా.. క్యామెడీ పంచ్‌లు రువ్వారు. బీజేపీని పారద్రోలి కేంద్రంలో రైతు ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. గోల్మాల్ ప్రధాని అంటూ.. పంచ్‌లు వేశారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. దేశంలోని రైతులు సాగుకు వాడే విద్యుత్ 20.8 శాతమేనని తెలిపారు. దేశంలో సాగుకు వాడే విద్యుత్ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు అని వెల్లడించారు. కార్పొరేట్ దొంగలకు దోచి …
Read More »ఈసారి ఆ ఫైర్ బ్రాండ్ గెలుపు కష్టమేనా?
అనిల్ కుమార్ యాదవ్. మాజీ నీటిపారుదలశాఖా మంత్రి. మాట తూటాలు పేల్చే మంత్రిగా ఆయన పేరు గడించారు. ఎంతోకాలం రాజకీయాల్లో ఉంటే కానీ సాధ్యంకాని విషయాలన్నీ అనిల్ చాలా తక్కువ కాలంలోనే సాధించేశారు. అలాగే అంతే వేగంగా కింద పడిపోయారనే టాక్ వినిపిస్తోంది. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ఏపని అడిగినా.. మనం అధికారంలో లేం… అధికారంలోకి వస్తే చిటికెలో చేసేస్తాననేవారు. 2019లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. …
Read More »ఆ మంత్రి గ్రాఫ్ పడిపోయిందా?
వైసీపీ అధినేత సీఎం జగన్ తన మంత్రి వర్గంలో మరోసారి ఛాన్స్ ఇచ్చిన మంత్రుల్లో ఉన్నత విద్యావంతుడు.. డాక్టర్ సీదిరి అప్పలరాజు ఒకరు. ఆయన రాజకీయాలకు కొత్తే అయినా.. పెద్దగా సీనియర్ కాకపోయినా.. ఎంతోమంది సీనియర్లను.. పార్టీ జెండాను భుజాన వేసుకుని ఆది నుంచి పనిచేసిన వారిని కూడా పక్కన పెట్టి.. సీఎం జగన్.. సీదిరికి మంత్రి పదవి ఇచ్చారు. ఇది రాజకీయంగా వివాదానికి దారితీసినప్పటికీ.. జగన్ పట్టించుకోలేదు. పశుసంవర్థక …
Read More »వైసీపీ దాగుడు మూతలు?
రాజకీయాల్లో ఎక్కడైనా.. ఎప్పుడైనా.. కొన్ని పరిణామాలు.. ఊహించనివి ఉంటాయి. పార్టీలు.. నాయకులు కూడా అక్కడ నెలకొన్ని పరిస్థితిని.. పరిణామాలను అంచనా వేసుకుని.. ముందుకు సాగుతుంటారు. కాబట్టి.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నా.. చూసీ చూడనట్టే వ్యవహరిస్తారు.. అయితే.. ఇది ఒకటి రెండు నియోజకవర్గాల్లో అయితే పర్వాలేదు. కానీ, లెక్కకు మించిన నియోజక వర్గాల్లో అయితే.. ఎలా ఉంటుంది? ఇదీ.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీలో జరుగుతున్న …
Read More »