Political News

మునుగోడు ఉపఎన్నిక ఎఫెక్టేనా ?

తెలంగాణా రాజకీయాల్లో ఇప్పుడు ఎన్ ఫోర్స మెంటు డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు సంచలనంగా మారింది. రెండు ప్రధాన పార్టీల నేతలే టార్గెట్ గా ఈడీ నోటీసులు, సోదాలు పెరిగిపోతున్నాయి. దాంతో రెండు పార్టీల నేతల్లోని నేతల్లో కలవరం మొదలైంది. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలను ఈడీ టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండు వేర్వేరు కారణాలతో ఈడీ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు నోటీసులిస్తోంది. ఫలానా తేదీన …

Read More »

మోడీకి షాక్ ఇచ్చిన వెంక‌య్య నాయుడు.. కీల‌క కామెంట్లు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ఎక్క‌డ వేదిక ఎక్కినా.. పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించే మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు.. తాజాగా సీరియ‌స్ కామెంట్లు చేశారు. మోడీపై ఒక‌ర‌కంగా.. సుతిమెత్త‌ని విమ‌ర్శ‌లే చేశార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఆయ‌న రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా ఉన్న స‌మ‌యంలో.. ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. విప‌క్షాల‌కు క్ర‌మ శిక్ష‌ణ లేద‌ని.. వారికి రాజ‌కీయాల ప‌ట్ల నిబద్ధ‌త లేద‌ని.. ప్ర‌తిదాన్నీ.. రాజ‌కీయం చేస్తార‌ని.. ఇలా విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. …

Read More »

అంకబాబు అరెస్ట్.. అసలు కథ ఏంటి?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీ పోలీసుల‌కు సూటిగా ఒక ప్ర‌శ్న సంధించారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ ప్ర‌శ్న‌కు.. ఆన్స‌ర్ ఉందా? పోలీసులూ.. అంటూ.. నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. విష‌యం ఏంటంటే.. అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్.. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. న్యాయమూర్తులను కించపరిచినవారిని ఎందుకు అరెస్ట్ చేయరని నిలదీశారు. …

Read More »

కాక‌ రేపుతున్న అంబ‌టి ట్వీట్‌.. ముంద‌స్తు ఖాయ‌మా?

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తున్నాయా? ఆ దిశ‌గా ఏపీ వైసీపీ ప్ర‌భుత్వం.. వ్యూహాత్మ‌కంగా అడ‌గులు వేస్తోందా? 2024లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల‌ను ముందుగానే నిర్వ‌హించాల‌ని భావిస్తోందా? అంటే.. తాజాగా మంత్రి అంబ‌టి రాంబాబు చేసిన ఒకే ఒక్క ట్వీటు ఈ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు.. రాజ‌కీయ వ్యూహాల‌కు.. తెర‌దీసిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా.. అంబ‌టి రాంబాబు.. ఓ ట్వీట్ చేశారు. అది కూడా.. సీఎం జ‌గ‌న్‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో …

Read More »

మరో రాష్ట్రంపై ఆపరేషన్ మొదలుపెట్టిన బీజేపీ

నాన్ బీజేపీ ప్రభుత్వాలను నిర్వీర్యం చేయలని నరేంద్రమోడీ కంకణం కట్టుకున్నట్లే ఉంది. అందుకనే ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లను ముందు పెట్టి నరేంద్రమోడీ సర్కారే వ్యవహారాలన్నింటినీ నడుపుతోంది. పంజాబ్ లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈనెల 27వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిపి తీరుతామని సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ …

Read More »

ఇదో విచిత్రమైన గొడవ !

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ షాకిచ్చారు. జోడు పదవుల్లో కంటిన్యు అవుదామని అనుకున్న అశోక్ కి నిరాస తప్పలేదు. వచ్చే నెల 17వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతోంది. ఆ ఎన్నికలో అశోక్ పోటీ చేస్తున్నారు. అశోక్ తో పాటు శశిథరూర్ కూడా పోటీకి రెడీ అయ్యారు. ఇంకా ఎంతమంది రంగంలోకి దిగుతారో తెలీదు. …

Read More »

ఇది మరో తలతిక్క నిర్ణయమేనా ?

జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలను ఎందుకు తీసుకుంటోందో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. తాజాగా కృష్ణా బోర్డును విశాఖపట్నంకు తరలించాలని డిసైడ్ చేసింది. ప్రస్తుతం కృష్ణాబోర్డు హైదరాబాద్ లో ఉంది. దీన్ని ఏపీలోని విశాఖకు తరలించాలని కోరుతూ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. విశాఖలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో బోర్డు కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన ఏడు వేల చదరపు అడుగుల స్ధలం ఉందని ప్రభుత్వం …

Read More »

జూనియర్ ను అనిల్ రెచ్చ గొడుతున్నారా ?

హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ అని పేరు పెట్టడంపై సెగలు ఇంకా రేగుతునే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం డైరెక్టుగా జూనియర్ ని టార్గెట్ చేశారు. పేరుమార్పుపై జూనియర్ ఒక ట్వీట్ చేశారు. నిజానికి ఆ ట్వీట్ ఎందుకు చేశారో కనీసం జూనియర్ కైనా క్లారిటీ ఉందో లేదో. ఆ ట్వీట్ గురించే అనిల్ మాట్లాడుతూ ఎన్టీయార్ …

Read More »

డైవ‌ర్ట్ చెయ్యాలంటే జ‌గ‌న్ త‌ర్వాతే..

ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే ఒక పెద్ద వివాదం ఏదో న‌డుస్తుంటుంది. ఓవైపు మీడియా, మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు ముప్పేట దాడితో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తుంటాయి. ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డిఫెన్స్ ఉండ‌దు. జ‌నాల్లోకి చెడు సంకేతాలు వెళ్తున్న‌ట్లు, త‌మ‌కు డ్యామేజ్ జ‌ర‌గ‌బోతున్న‌ట్లు ప‌రిస్థితి క‌నిపిస్తుంది. అప్పుడే ఇంకో ఒక కొత్త వివాదాన్ని తెర‌మీదికి తెస్తుంది ప్ర‌భుత్వం. అంద‌రి దృష్టి అటు మ‌ళ్లుతుంది. అంతే.. అప్ప‌టిదాకా హాట్ టాపిక్‌గా ఉన్న అంశం …

Read More »

చీరాల టీడీపీ నుండి దగ్గుబాటి పోటీ చేస్తారా ?

వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం లో దగ్గుబాటి చెంచురామ్ పోటీ చేయబోతున్నట్లు సమాచారం. దగ్గుబాటి చెంచురామ్ ఎవరంటే మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు. చెంచురామ్ టీడీపీ తరపున రంగంలోకి దిగబోతున్నట్లు జిల్లా పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. మొదటి సొంత నియోజకవర్గమైన పర్చూరు నుండి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వబోతున్నట్లు చంద్రబాబానాయుడు చేసిన ప్రకటనతో ఆ ప్రచారానికి తెరపడింది. పర్చూరు …

Read More »

డ్యామేజ్ కాక ముందు ఇదే క్లారిటీ ఇస్తే సరిపోయేదిగా సజ్జల?

దారిన పోయే దానిని మీదేసుకోవటంలో వైసీపీకి మించిన రాజకీయ పార్టీ మరొకటి ఉండదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే.. మరికొన్ని సందర్భాల్లో ఆయన పార్టీ నేతలు చేసే తప్పులతో తరచూ ఏదో ఒక వివాదంలో జగన్ సర్కారు వార్తల్లో నిలుస్తుందని చెప్పాలి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ముఖ్యమంత్రికి షాకిచ్చిందన్న వార్తలు రావటం తెలిసిందే. వైసీపీ శాశ్విత …

Read More »

ప్రతిపక్షాలను జగనే కలుపుతున్నారా ?

YS Jagan Mohan Reddy

రాష్ట్రంలో ప్రతిపక్షాలను కలిపిన క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటి పేరును ప్రభుత్వం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన విషయం తెలిసిందే. నిజానికి ఇది అనవసరమైన ప్రక్రియే అయినా జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి మరీ మార్పు చేశారు. పేరు మార్పుకు జగన్ చెప్పిన కారణాలు తన యాంగిల్లో ఓకేనే కానీ …

Read More »