వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు జనసేన ప్రధాన కార్యదర్శి ఫైర్ బ్రాండ్ నాగబాబు భారీ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం అనంతపురంజిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో సీఎం జగన్ జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే నాగబాబు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరోసారి ప్రారంభమైంది.
ఏం జరిగింది..?
రాప్తాడు సిద్ధం జభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఫ్యాన్ ఎప్పుడూ ప్రతి ఇంట్లో ఉండాలని, సైకిల్ ఎప్పుడూ బటయే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లోనే జనం చొక్కాలు మడతపెట్టి, చంద్రబాబు కుర్చీలు 23కి మడతపెట్టారంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ జనం మరోసారి చంద్రబాబు కుర్చీలు మడతపెట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
నాగబాబు కౌంటర్ ఇదీ..
సీఎం జగన్ రాప్తాడులో చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ‘గ్లాస్’ సింక్ లో ఉన్నా తెల్లారితే మళ్లీ తేనేటి విందునిస్తుందని తెలిపారు. కానీ ‘ఫ్యాన్’ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వదన్నారు. అయినా సారూ.. మీరు పబ్లిక్ మీటింగ్స్‌లో ప్రాసలు, పంచులు మీద పెట్టిన శ్రద్ధలో సగం ‘ప్రజా పరిపాలన’ మీద పెట్టుంటే బాగుండేదని నాగబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. మరిదీనిప వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates