Political News

ఆ రోజు కాంగ్రెస్ మా మాట విని ఉంటే.. ల‌గ‌డ‌పాటి

ఏపీ రాజ‌కీయాల్లో త‌ర‌చుగా వినిపించే పేరు విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేరే. ఆయ‌న ఎక్క‌డున్నారు.. ఏం చేస్తున్నారు.. అనేది ప‌క్క‌న పెడితే.. విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌.. ఇలా ఆయ‌న ఎక్క‌డ మీడియాకు తార‌స‌ప‌డినా.. వెంట‌నే ఆయ‌న చుట్టూ రాజ‌కీయాలు ముసురుకుంటాయి. మీరు ఏ పార్టీలో చేరుతున్నారు? ఎక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు? అంటూ.. మీడియా ఆయ‌న‌ను ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేయ‌డం.. తెలిసిందే. తాజాగా ఏపీలో అసెంబ్లీ …

Read More »

కాబోయే సీఎం చంద్రబాబే: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్ది నెలల క్రితం వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీపై, సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై కోటంరెడ్డి సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. పార్టీకి రెబల్ గా మారిన కోటంరెడ్డి…తమ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. తాజాగా, చంద్రబాబు గురించి కోటంరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, టీడీపీ …

Read More »

వారికి ఏపీలో ఎంపీ సీట్లు ఇప్పిస్తా: సీఎం రేవంత్

ఏపీలో ఎంపీ టికెట్ల విష‌యంపై తెలంగాణ సీఎం, కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి చెందిన‌ కొంద‌రు అభ్య‌ర్థులు త‌న‌ను క‌లుసుకున్నార‌ని, టికెట్లు కోరుతున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ విష‌యంలో వారికి టికెట్లు ఇవ్వ‌క‌పోతే.. ష‌ర్మిల ద్వారా అయినా.. వారికి టికెట్లు వ‌చ్చేలా చేస్తానని ఆయ‌న చెప్పారు. అయితే, ఆయ‌న ఏ పార్టీ అనేది స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. ఇక‌, ఏపీ సీఎం జ‌గ‌న్ తో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా …

Read More »

ఈ సీట్ల‌న్నీ ఎన్నారైల‌కేనా…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఎన్నారైల‌కు పెద్ద‌పీట వేయ‌నుందా? మెజారిటీ స్థానాల్లో ఎన్నారై టీడీపీ నాయ‌కు ల‌కు సీట్లు కేటాయించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారా? అంటే.. ఔన‌నే చ‌ర్చే తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టికే కీల‌క‌మైన గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఎన్నారై నాయ‌కుడు వెనిగ‌ళ్ల రాముకు చంద్ర‌బా బు కేటాయించారు. దీంతో రాము ప్ర‌చారంలోనూ దూసుకుపోతున్నారు. పార్టీని గాడిలో పెట్టే కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. మినీ మేనిఫెస్టోను తీసుకుని ప్ర‌జ‌న‌లు కూడా క‌లుస్తున్నారు. ఇక‌, ఒక్క …

Read More »

అప్ప‌ట్లో వంగ‌వీటి.. ఇప్పుడు యార్ల‌గ‌డ్డ‌.. అంతా బాబు కోసం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోసం.. యాగాలు.. య‌జ్ఞాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుని.. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయాల‌న్న ల‌క్ష్యంతో గ‌న్న‌వ‌రం టీడీపీ ఇంచార్జి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. యాగం త‌ల‌పెట్టారు. దీనిని ఆయ‌న త‌న స‌తీస‌మేతంగా ప్రారంభించారు కూడా. యాగాల‌లో కెల్లా శ్రేష్ట‌మైన‌ది.. కార్యం త‌ల‌పెట్టిన వెంట‌నే సాకారం చేసుకోగ‌లిగిందిగా పేరున్న శ‌త చండీ యాగాన్ని యార్ల‌గ‌డ్డ నిర్వ‌హిస్తున్నారు. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని …

Read More »

‘జ‌గ‌న్ ని కాదు.. న‌న్ను చూసి గెలిపించండి ప్లీజ్‌’

వైసీపీలో కొత్త స్వ‌రం వినిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ కోసం.. ఆయ‌న‌ను తిరిగి ముఖ్య‌మంత్రిని చేయ‌డం కోస‌మే తాము ప‌నిచేస్తున్నామ‌ని చెప్పుకొన్న నాయ‌కులు.. ఇప్పుడు ఒక్కొక్క‌రుగా స్వ‌రం మారుస్తున్నారు. సీఎం కాదు.. మ‌మ్మ‌ల్ని చూసి గెలిపించండి అంటూ.. పిలుపునిస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఇదే మాట వినిపించారు. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌లు వైసీపీలో మంట‌లు రేపాయి. దీనిపై ఆయ‌న అధిష్టానానికి వివ‌ర‌ణ కూడా …

Read More »

‘మా డాడీని నారా లోకేష్‌ అవ‌మానించారు’

విజ‌య‌వాడ ఎంపీ.. కేశినేని నాని కుమార్తె, విజ‌య‌వాడ‌లోని 11వ వార్డు కార్పొరేట‌ర్ కేశినేని శ్వేత‌.. తాజాగా త‌న కార్పొరేట‌ర్ ప‌దవికి రాజీనామా చేశారు. ఇది ఆమోదం పొందిన త‌ర్వాత పార్టీకి కూడా రాజీనామా చేయ‌నున్న‌ట్టు శ్వేత తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతోమాట్లాడుతూ.. టీడీపీ త‌మ‌ను అవ‌మానించింద‌ని అన్నారు. పార్టీ టికెట్ ఇచ్చినందుకు మాత్ర‌మే తాము టీడీపీకి ధ‌న్య‌వాదాలు చెబుతున్నామ‌న్న ఆమె.. ఎంపీగా త‌న తండ్రిని నారా లోకేష్ తీవ్రంగా …

Read More »

రేవంత్ ఎంట్రీ ఇస్తే జ‌గ‌న్‌కు లాసేనా…!

మరో రెండు మాసాల్లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో రాజ‌కీయాలు కీల‌క మ‌లుపు తిరుగుతు న్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించే ధ్యేయంతో ఇప్ప‌టికే టీడీపీ-జ‌న‌సేన చేతులు క‌లిపాయి. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునేందుకు రెడీ అయింది. ఈ క్ర‌మంలోనే వైఎస్ త‌న‌య ష‌ర్మిల‌ను ఏపీ ఇంచార్జ్‌గా నియ‌మించేందుకు రెడీ అయింది. దీనిపై ప్ర‌క‌ట‌నే రావాల్సి ఉంది. అది కూడా ఈ నెల‌లోనే జ‌ర‌గ‌నుంది. అయితే.. ఇంత‌లో తెలంగాణ …

Read More »

కేటీఆర్, హరీష్ లకు… పెద్దపల్లిలో అడ్డం తిరిగారా ?

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నది. ఈ సమావేశాల్లోనే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నేతలతో కేటీయార్, హరీష్ రావు తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని నేతల్లో చాలామంది అగ్రనేతలకు అడ్డంతిరిగినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లిలో పార్టీ గెలుపు కష్టమని స్పష్టంగా చెప్పారట. ఎందుకంటే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు. గెలవటం కూడా …

Read More »

పవన్ మారథాన్ మీటింగ్స్

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీ అయిపోతున్నారు. వరసబెట్టి పార్టీలోని ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. డైరెక్టుగా జిల్లాలకు వెళ్ళి నేతలను పిలిపించుకుని క్షేత్రస్థాయి పరిస్ధితులను సమీక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుండి మంగళగిరి పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు. సోమవారం నుండి రెండురోజుల పాటు ముఖ్యనేతలతో సమావేశం అవబోతున్నారు. వన్ టు వన్ సమావేశాలు నిర్వహించాలని అనుకున్న నేతలందరినీ పార్టీ ఆఫీసుకు రావాలని కబురు …

Read More »

మాధవ్ కు మొండిచెయ్యేనా ?

చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనే సామెత తెలుగులో చాలా పాపులర్. ఈ సామెత హిందుపురం వైసీపీ ఎంపీ మాధవ్ కి సరిగ్గా సరిపోతుంది. పోలీసు అధికారిగా పనిచేస్తున్న మాధవ్ జేసీ బ్రదర్స్ తో జరిగిన ఒక గొడవలో సడెన్ గా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డారు. దాంతో పోలీసులు ఉద్యోగానికి రాజీనామా చేయటం, వైసీపీ తరపున హిందుపురం ఎంపీగా పోటీచేసి గెలవటం అంత చాలా స్పీడుగా జరిగిపోయింది. పోలీసు నుండి …

Read More »

బెజ‌వాడ సెంట్ర‌ల్‌పై కేశినేని ఎఫెక్ట్ ఎంత …!

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ద‌ఫా గెలుపు ప‌క్కా అని టీడీపీ రాసి పెట్టుకుంది. ఎందుకంటే.. ఇక్క‌డి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గంతో గ‌ట్టి అనుబంధం పెంచుకున్న మ‌ల్లాది విష్ణును వైసీపీ ప‌క్క‌న పెట్టింది. నియోజ‌క‌వ‌ర్గ‌తో సంబంధం లేని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావుకు ఇక్క‌డ ఇంచార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీంతో టీడీపీ ఆశ‌లు మ‌రింత‌గా పెరిగాయి. వాస్త‌వానికి ఈ ద‌ఫా మ‌ల్లాది పోటీ చేసినా.. …

Read More »