గడ్డం బ్రదర్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న గడ్డం వివేక్, గడ్డం వినోద్‌ల పరిస్థితి అంతర్మథనంలో పడింది. బీజేపీ నుంచి నామినేషన్ల ఘట్టానికి చివరి నిముషంలో కాంగ్రెస్‌లోకి వచ్చిన గడ్డం వివేక్.. చెన్నూరు నుంచి విజయం దక్కించుకున్నారు. ఇక, కాంగ్రెస్‌లోనే ఉన్న గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. వీరికి సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం ఉన్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీల …
Read More »పవన్ ఈ స్పీడ్ చాలదు..
పవన్ ఎంట్రీ ఇస్తేనే.. నాయకులు కదులుతున్నారు. నాదెండ్ల మాట్లాడితేనే మైకులు మోగుతున్నాయి. ఇప్పటి వరకు జనసేనను పరిశీలిస్తే.. ఇదే పరిణామం, పరిస్థితి కళ్లకు కడుతోంది. ఈ ఇద్దరు మౌనంగా ఉంటే.. ఇక, పార్టీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు నాలుగున్నరేళ్లకు పైగానే సమయం గడిచిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకుముందు.. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. పార్టీ పేరు అన్ని …
Read More »ఉద్ధానం కిడ్నీ బాధితులకు జగన్ ఊరట
ఉద్ధానం…ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పేషెంట్లు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులను కిడ్నీ సమస్యలను వేధిస్తున్నాయి. ఈ మహమ్మారి వ్యాధిబారిన పడి వందలాదిమంది మృత్యువాత పడ్డారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఉద్ధానం బాధితులకు మాత్రం ఊరట లభించలేదు. గతంలో పలు ప్రభుత్వాలు ఆసుపత్రి నిర్మిస్తామని హామీలిచ్చినా…వాటిని మాత్రం నెరవేర్చలేదు. అయితే, ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో జగన్ ఉద్ధానం …
Read More »స్మితా సబర్వాల్ ఔట్..ఆమ్రపాలి ఇన్?
కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు..ప్రభుత్వానికి మధ్య అవసరానికి మించి సత్సంబంధాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కొందరు అధికారులు అధికార పార్టీ నేతలకు ఆకుల్లో…విపక్ష పార్టీల నేతలకు కంచాల్లో వడ్డిస్తుంటారని విమర్శలు వస్తుంటాయి. అయితే, ఆయా ప్రభుత్వాలు మారగానే…సదరు ఐఏఎస్ అధికారులు కూడా వేరే రాష్ట్రాలకు బదిలీ కావడమో, కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రయత్నించడమో జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే గతంలో బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారి …
Read More »ఆర్నెల్లు అంటూనే వాయించడం మొదలు పెట్టేశారే!
“కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి.. ఆరు మాసాల వరకు వేచి చూస్తాం. మౌనంగా అన్నింటినీ పరిశీలి స్తాం” అని చెప్పిన బీఆర్ ఎస్ పార్టీ నేతలు.. ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే విమర్శలకు పదును పెంచేశారు. అప్పుడే సీఎం రేవంత్‌ను టార్గెట్ చేయడం ప్రారంభించేశారు. రేవంత్ ఇచ్చిన హామీలు అలివిగానివని తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో రేవంత్ చెప్పిన ప్రతీ మాటకు …
Read More »జగన్ కు బాలినేని ‘బల’ ప్రదర్శన?
సీఎం జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రావు అలియాస్ వాసు వ్యవహార శైలి కొద్ది రోజులుగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో విభేదాల నేపథ్యంలో జగన్ కు బాలినేని దూరమయ్యారని, రాబోయే ఎన్నికలలో బాలినేనికి టికెట్ దక్కకపోవచ్చు అని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మంత్రి పదవి దక్కలేదన్న ఆవేదనలో ఉన్న బాలినేని ఒంగోలు వైసిపిలోనే వర్గ పోరు …
Read More »బ్రేకింగ్: లోక్ సభలో టియర్ గ్యాస్
2001లో పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సభ జరుగుతుండగానే కట్టుదిట్టమైన భద్రతను దాటుకొని మరీ లోపలకి చొరబడి ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. వీవీఐపీలకే భద్రత కరువైన నేపథ్యంలో దేశ ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆ దుర్ఘటన జరిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తయిన రోజే మరోసారి పార్లమెంటులో భద్రతా వైఫల్యం బయటపడింది. తాజాగా జరుగుతున్న …
Read More »‘విశాఖ’ రాజకీయం.. వైసీపీకి లాభమెంత..!
కీలకమైన విశాఖపట్నాన్ని పాలనా రాజధానిని చేస్తామంటూ వైసీపీ ప్రకటించడం.. దరిమిలా అమరావతి ని సమర్థిస్తున్న వారు దీనిపై న్యాయ పోరాటాలకు దిగడం తెలిసిందే. అయినప్పటికీ.. మూడు ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా సీఎం జగన్.. విశాఖనే రాజధానిగా చేస్తానని ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే, దీనికి న్యాయ పరమైన చిక్కులు పొంచి ఉన్న నేపథ్యంలో ముందు తాను వెళ్లి.. తర్వాత మిగిలిన పనులు చక్కబెట్టే యోచనతో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆఫీసులను, మంత్రుల …
Read More »జగన్ రెండో జాబితాను సిద్ధం చేస్తున్నారా ?
మొదటిజాబితాలో 11 మంది ఎంఎల్ఏలు, మంత్రులకు స్ధానచలనం కలిగించిన జగన్మోహన్ రెడ్డి రెండో జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారట. రెండో జాబితాలో మంత్రులు, ఎంఎల్ఏలు కలిసి 45 మంది దాకా ఉంటారని పార్టీవర్గాల సమాచారం. రెండో జాబితాలో రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుండి కొత్త నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు. మరి కొత్త నియోజకవర్గాల నుండే …
Read More »రేవంత్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా ?
కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఏమిటి ? తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలేనా ? ఎంతమాత్రం కాదని చెప్పాలి. పార్లమెంటు ఎన్నికలకన్నా ముందే జరగబోతున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలుపుని రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. వేలాదిమంది పనిచేస్తున్న సింగరేణి సంస్ధ ఎన్నికల్లో గెలవటాన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. మొదటినుండి సింగరేణి ఎన్నికల్లో వామపక్షాలదే పైచేయిగా ఉండేది. అయితే తర్వాత కాంగ్రెస్ …
Read More »బీఆర్ఎస్ తో కటీఫ్ అయిపోయిందా ?
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో ఎంఐఎం పార్టీ కటీఫ్ చెప్పేసినట్లేనా. తాజా పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తోంది. ఎంఎల్ఏల ప్రమాణస్వీకారం విషయంలో ఎంఐఎం శాసనసభా పక్షం నేత అక్బరుద్దీన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రోటెం స్పీకర్ గా నియమించింది. ఈ నియామకమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కారణం ఏమిటంటే బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షాలుగా ఉండటమే. పార్టీలోనే సీనియర్ ఎంఎల్ఏని కాదని అక్బరుద్దీన్‌ను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేయటం …
Read More »ముగిసిన ‘వసుంధర’ శకం.. రాచరికానికి స్వస్తి!
వసుంధర రాజే. ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు రాజస్థాన్. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆమె తనదైన ముద్ర వేశారు. అంతేకాదు.. బీజేపీని నడుం కట్టుకుని ముందుకు నడిపించిన చరిత్ర కూడా సృష్టించారు. గతంలో 2013-2018 మధ్య రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనూ.. ఆమె తనదైన పాలనతో ముద్ర వేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఇక, ఆమె శకం ముగిసింది. ప్రస్తుతం వసుంధరరాజే వయసు 70 సంవత్సరాలు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates