జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీసీలను టార్గెట్ చేశారా? ఇప్పటి వరకు కాపు నేతలే ఆయనను సమర్థిస్తున్న నేపథ్యంలో ఆయన అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారా? ఈ క్రమంలో బీసీలను లక్ష్యంగా చేసుకుని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అయ్యాయి.బీసీల్లో ఐక్యత లోపించిందని.. పవన్ అన్నారు. దీనినే వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుని.. బీసీలను ఒక ఆట ఆడిస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తనకు మాత్రమే అబ్బిన విష సంస్కృతిని కుటుంబాలకు కూడా వ్యాపింప జేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
“బీసీల మధ్య సఖ్యత లేదు. అందుకే.. వారంతా జగన్ ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. దేహీ అని పదవుల కోసం అర్థిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. వారిలో చైతన్యం తీసుకురావాలి. ఐక్యతగా ఉంటే.. వారిని మనం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్‌కు బుద్ధి చెప్పడం తథ్యం. అణగారిన కులాలు అభివృద్ధి సాధించాలంటే, ఇతర కులాలను తొక్కేయడం కాదు. అన్ని కులాలను సాధికారత దిశగా తీసుకువెళ్ళడం. ఆ పని మనం చేస్తాం. రాజకీయాల్లో కూడా రిటైర్ మెంట్ అవసరం. కొత్త తరం వారికి అవకాశం ఇవ్వాలంటే, ఇది తప్పదు” అని పవన్ వ్యాఖ్యానించారు.
షర్మిల ఆస్తులు లాగేసుకున్నాడు!
సీఎం జగన్.. తన సొంత ఆస్తులనే లాగేసుకున్నాడని పవన్ వ్యాఖ్యానించారు. “దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలా సంపాయించారో తెలియదు కానీ, బాగానే సంపాయించారని అంటారు. ఆయన కుమార్తెగా ఆ ఆస్తుల్లోనూ షర్మిలకు వాటా ఉంది. మన ఆస్తుల్లో మన అక్క చెల్లెళ్లకు మనం వాటాలు ఇవ్వడం లేదా? కానీ.. ఈ జగన్ మాత్రం షర్మిలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని బయటకు గెంటేశాడు. ఇలాంటివాడు మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని మహిళల ఆస్తులకు భద్రత ఉండదని నేను విశ్వసిస్తున్నా. జగన్ వ్యతిరేకించడంలో ఇది కూడా ఒక కారణం. అందుకే ఆయన ప్రభుత్వం మళ్లీ రాకూడదు” అని పవన్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates