ఏపీ సీఎం జగన్ విశాఖలోని చినముషిడివాడలో ఉన్న శారదా పీఠాన్ని దర్శించుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ శారదాపీఠం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. బుధవారం ఉత్సవాల ముగింపు ను పురస్కరించుకున్ని సీఎం జగన్ వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారిగా అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేశారు. అదేవిధంగా అరగంటకు పైగా.. శారదా పీఠం స్వామీజీతో సీఎం జగన్ చర్చలు జరిపారు.
త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ రాజశ్యామల అమ్మవారి యాగంలో ఆయన పాల్గొని పూజలు చేయడం గమనార్హం. సంప్రదాయ వస్త్ర ధారణలో రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూర్ణాహుతి నిర్వహించారు. ప్రత్యేకంగా ఆయన కోసం యాగశాలను ఏర్పాటు చేశారు. కాగా, గత ఎన్నికలకు ముందు కూడా జగన్ ఇక్కడ నిర్వహించిన రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. ఈయన కోసం స్వామి స్వరూపానంద ప్రత్యేకంగా యాగం చేశారు.
కామ్రెడ్ల నిర్బంధం
ముఖ్యమంత్రి విశాఖ పర్యటన నేపథ్యంలో ఆయనను ఘెరావ్ చేసేందుకు వామపక్షాల నేతలు ప్రయత్నించారు. ముఖ్యంగా ఉద్యోగులు సమస్యలు, డీఎస్సీ వంటి అంశాలను లేవనెత్తాలని వారు ప్రయత్నించారు. అయితే.. వామపక్ష నేతలను పోలీసులు మంగళవారం సాయంత్రం నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాన్ని దాదాపు అష్టదిగ్భంధం చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. దారి పొడవునా డ్వాక్రా మహిళలు.. సిద్ధం పోస్టర్లు జగన్మోహన్, స్వాగతం పలుకుతూ, మానవహారంగా ఏర్పాటు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates