టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీ కావడం.. సుమారు 4 గంటల పాటు చర్చలు జరపడం తెలిసిందే. ఈ పరిణామంపై వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఇండియా కూటమిలో చంద్రబాబును చేర్పించుకునేందుకే ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపాడని అన్నారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా… సీఎం జగన్ ను పీకేదెం ఉండదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవుట్ …
Read More »ఆ నేతల స్పీడ్ కు అర్జెంట్ గా బ్రేక్ వేయాలి జగన్!
చర్యకు ప్రతిచర్య అనివార్యం. అయితే.. అవసరం లేని అంశాల్లో ప్రతిచర్య పేరుతో రియాక్టు అయితే.. దానికి స్పందన ఉంటుందన్న సత్యాన్ని మిస్ కాకూడదు. ఇంత సింఫుల్ లాజిక్ ను ఏపీ అధికారపక్ష నేతల్లో కొందరు ఎందుకు మిస్ అవుతారు? పార్టీకి.. అధినేతకు మైలేజ్ తీసుకురావటమే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరించే కొందరి అత్యుత్సాహం వరుస తప్పులకు కారణం కావటమే కాదు.. ఇమేజ్ తేవటం తర్వాత డ్యామేజ్ చేస్తున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ …
Read More »పీకే వ్యూహానికి బీజేపీ దూరం.. పొత్తు లేనట్టే…!
ఏపీలో రాజకీయ పరిణామాలు వడివడిగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు .. వివిధ కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శించిన టీడీపీ.. హఠాత్తుగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను లైన్‌లోకి తీసుకుంది. ఆయనతో చంద్రబాబు నేరుగా నాలుగు గంటల పాటు చర్చలు కూడా జరిపారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో పీకేను పూర్తిస్థాయిలో వాడతారో లేదో తెలియదు …
Read More »డేంజర్లో వైసీపీ టాప్ లీడర్ ఫ్యూచర్…
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్యూచరేంటి? ఆయనకు వైసీపీలో ఉన్న ప్రాధాన్యమేంటి? అంటే.. పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మరీ వచ్చి వైసీపీకి మద్దతు పలికిన బాలినేనికి.. జగన్ ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. 2014లోను, 2019లో నూ ఆయనకు ఒంగోలు టికెట్ ఇచ్చారు. 2014లో ఓడిపోయినా.. పార్టీలో ఆయన మాటకు విలువనిచ్చారు. ముఖ్యంగా కీలక నాయకుడు.. వైవీ సుబ్బారెడ్డితో నిత్యం కయ్యాలు …
Read More »జనసేనకు ఇదే పెద్ద చిక్కు.. కాసులిచ్చేవారేరీ….!
వచ్చే ఎన్నికల్లో పోటీ ఎలా ఉన్నా.. పది స్థానాలైనా పాతికైనా.. వందైనా.. అసలు పోటీలో ఉన్న నాయకులకు కీలక వనరు సొమ్ములే! ప్రజలకు పంచాల్సిన అవసరం లేకపోయినా.. పంచకపోయినా.. కనీసం నాయకులకు చేతి ఖర్చు.. ప్రచార ఖర్చు.. వంటివి కీలకం కదా! ఇవేవీ ఉచితంగా ఎవరూ చేయరు. సో.. ఆ ఖర్చులకైనా నాయకులకు డబ్బులు కావాలంటే.. ఇబ్బందులు తప్పేలా లేవనేది జనసేనలో వినిపిస్తున్న మాట. “వచ్చే ఎన్నికలు భారీ ఖర్చుతో …
Read More »ఇండియా ఆహ్వానం.. బాబు నిర్ణయమేంటి..?
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో పాగా వేయాలని.. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారును ఇంటికి సాగనంపాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే క్రతువును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసింది. దీనిలో ఇప్పటి వరకు 18 ప్రాంతీయ పార్టీలతోపాటు.. కమ్యూనిస్టులు కూడా చేరిపోయారు. ఇప్పటికి .. నాలుగు దఫాలుగా సమావేశం కూడా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన …
Read More »వైసీపీ కోసం ఐ ప్యాక్! టీడీపీ కోసం పీకే?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజకీయ వ్యూహకర్తి ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దేశ రాజకీయాలలోనే సీనియర్ రాజకీయ నాయకుడని, తనను కలవాలని కోరడంతోనే ఆయనతో భేటీ అయ్యానని పీకే వెల్లడించారు. అయితే, మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశానని పీకే చెప్పారు. మరోవైపు, తాము వైసీపీతోనే ఉన్నామంటూ ఐ ప్యాక్ సంస్థ …
Read More »ఏపీలో పెరిగిన టీడీపీ గ్రాఫ్.. మరి వైసీపీ ?
మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగనున్న ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఎలా ఉంది? జనం నాడి ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? ఏ పార్టీ విషయంలో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? వెరసి మొత్తంగా ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఇవే విషయాలపై తాజాగా ప్రముఖ సర్వే సంస్థ చాణక్య స్ట్రాటజీస్ సర్వే రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. దీని ప్రకారం.. …
Read More »చంద్రబాబుకు పీకే సలహా ఇదేనా?
“మహిళా ఓటు బ్యాంకును మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు బాగానే ఉన్నాయి. అయితే.. ఈసారి యువత చాలా ఆవేశంతో ఉన్నారు. ఉద్యోగాలు, ఉపాధిలేక.. ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. దీనిని ఒక్కసారి గమనించండి. యువత నాడిని పట్టుకుని.. వారికి అనుకూలంగా వ్యవహరించండి. వారి ఓటు బ్యాంకును మీ వైపు మళ్లించుకునే ప్రయత్నం చేయండి” అని టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్టు టీడీపీ వర్గాలు …
Read More »‘సలార్’కు లింకు పెట్టి జగన్‌పై బుచ్చయ్య సటైర్లు
తాజాగా విడుదలైన ప్రభాస్ మూవీ సలార్ తొలి రోజు హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత..అనేక పరాజయాలు చవి చూసిన ప్రభాస్‌కు ఒకింత ఈ సినిమా రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమాలో డైలాగులు కూడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఇక, ఈ సినిమాను రాజకీయ నాయకులు కూడా వీక్షించారు. అయితే.. వీక్షించి సరిపెడితే ఏముంటుందని అనుకున్నారో..ఏమో టీడీపీ కురువృద్ధుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. …
Read More »చంద్రబాబుతో లోకేష్, పీకే భేటీ?
పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్.. దేశ రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. 2014లో ప్రధాని మోడీ మొదలు 2019లో సీఎం జగన్ వరకు ఎందరో నేతలకు అధికార పీఠాన్ని దగ్గర చేసిన క్రెడిట్ పీకేది. ఐపాక్ అధినేతగా తన రాజకీయ వ్యూహాలతో కార్పొరేట్ స్థాయిలో పొలిటికల్ స్ట్రాటజీస్ ని అందించడంలో పీకే సిద్ధ హస్తుడు. గత ఎన్నికలలో ఏపీలో వైసిపి అధికారంలోకి రావడానికి, జగన్ సీఎం కావడానికి …
Read More »జేడీ వారి కొత్త పార్టీ.. ప్రభావం ఎంత?
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తాజాగా సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కొత్తగా ఆయన సొంత కుంపటి పెట్టుకున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఇది పెట్టిన పార్టీ కాదని పుట్టిన పార్టీ అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పిన జేడీ.. కొన్నాళ్ల కిందటే.. వేరు కుంపటిపై లీకులు ఇచ్చారు. ఇప్పుడు అది కార్యరూపం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates