Political News

టీడీపీ హామీ… వైసీపీ అమ‌లు చేస్తోంది

jagan

ఇటీవ‌ల మినీ మ‌హానాడులో టీడీపీ కొన్ని పథకాలు ప్రకటించింది. వీటిలో ఒక‌టి.. మ‌హిళ‌ల‌కు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్క‌డకైనా.. ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మ‌హిళ‌ల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని టీడీపీ తెలిపింది. అయితే.. ఏమ‌నుకున్నారో.. ఏమో వైసీపీ ప్ర‌భుత్వం ఇదే ప‌థ‌కాన్ని చెప్పాపెట్ట‌కుండానే అమ‌లు చేసేందుకు రెడీ అయిపోయింది. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యాన్ని ఆఘమేఘాలపై అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. …

Read More »

రేవంత్ కొత్త నిర్ణయం

ప్రజావాణిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. ప్రజల సమస్యలు విని వీలైనంత తొందరగా తీర్చే ఉద్దేశ్యంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే రేవంత్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రేవంత్ ను కలిసి సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారమవుతాయని రాష్ట్రంలోని చాలామంది జనాలు ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుకు వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రజాదర్బార్(ప్రజావాణి)లో రోజుకు 4 వేలమంది బాధితులు వస్తున్నట్లు లెక్క తేలింది. అందుకనే …

Read More »

పవన్ కూడా రంగంలోకి దిగారా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులను ఫైనల్ చేయటం కోసం కసరత్తు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే సీనియర్ నేతలు, ఆశావహులు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో వన్ టు వన్ సమావేశమయ్యారు. శుక్రవారం పార్టీ ఆపీసులో జరిగిన సమీక్షల్లో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని నేతలతో చాలాసేపు మాట్లాడారు. నిజానికి ఇలాంటి సమీక్షలు చేయటంలో ఏమిటి ఉపయోగమో పవన్ …

Read More »

రేవంత్ టీముకు మంచి మార్కులు పడ్డాయా ?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సమావేశాలు జరిగిన విధానం చూస్తే ఒకవైపు వాడివేడిగాను మరోవైపు హుందాగాను జరిగినట్లే అనుకోవాలి. మామూలుగా అయితే అసెంబ్లీ సమావేశాలు అనగానే అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల బలప్రదర్శనకు వేదికగా మారిపోయింది. గతంలో కేసీయార్ హయాంలో కూడా ఇలాగే జరిగింది. కేసీయార్ పాలనలో పదేళ్ళ అసెంబ్లీ సమావేశాల్లో చాలాసార్లు ప్రతిపక్ష ఎంఎల్ఏలను బయటకు పంపేయటం లేదంటే సస్పెండ్ …

Read More »

సీఎం జ‌గ‌న్‌పై కామెంట్లు.. ‘యాష్‌’ అరెస్టు విడుద‌ల‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన ఎన్ఆర్ఐ యశస్వి.. ఉర‌ఫ్ యాష్ పొద్దులూరిని ఏపీ సీఐడీ పోలీసులు ఈ రోజు తెల్ల‌వారు జామున అరెస్టు చేశారు. అనంతరం ఆయ‌న‌కు 41 ఏ కింద నోటీసులు ఇచ్చి.. వ‌దిలి పెట్టారు. వ‌చ్చే నెల 11 వ తేదీన విజ‌య‌వాడ‌లోని సీఐడీ కార్యాల‌యానికి వ‌చ్చి.. విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. వాస్త‌వానికి యాష్ ను అరెస్టు చేశార‌న్న వార్త ఏపీలో సంచ‌ల‌నం రేపింది. …

Read More »

చంద్ర‌బాబు యాగాలు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అధికార యాగాలు చేప‌ట్టారు. శుక్ర‌వారం నుంచి వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఉండ‌వ‌ల్లిలోని ఆయ‌న నివాసంలో నిర్విరామంగా య‌జ్ఞాలు, యాగాలు నిర్వ‌హించ‌నున్నారు. నిజానికి ఆల‌యాల‌కు వెళ్ల‌డం, దేవుళ్ల‌ను ద‌ర్శించుకోవ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మైన చంద్ర‌బాబు.. గ‌తంలో ఎప్పుడూ ఎన్నిక‌ల‌కు ముందు ఇలా యాగాలు, య‌జ్ఞాలు చేసిన దాఖ‌లాలు లేవు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు సీఎం కావాల‌ని కోరుతూ.. కొంద‌రు యాగాలు చేశారు. ఉమ్మ‌డి క‌డ‌ప …

Read More »

వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పేరు రాష్ట్ర రాజకీయాలలో కొంతకాలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన జనసేన నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇక, వైసీపీ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వచ్చినట్లు పుకార్ల వ్యాపించాయి. అయితే, విశాఖ ప్రజలు తనను అభిమానిస్తున్నారని, ఈ సారి స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలోకి దిగుతానని ఆయన గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ …

Read More »

జగన్ ధీమా ఇదేనా ?

ఎన్నికల సమయంలో నేతలు పార్టీలమధ్య దూకుడ్లు మామూలే. ముఖ్యంగా టికెట్ల విషయంలోనే నేతలు పార్టీలు మారుతుంటారు. ఒకపార్టీలో ఉన్నవారు తమకు టికెట్లు రావని కన్ఫర్మ్ అయితే వెంటనే పార్టీమారిపోవటానికి సిద్ధపడతారు. ఇపుడు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసినా వైసీపీ నుండి ఇప్పటివరకు పార్టీ మారుతున్నట్లు ప్రకటన లేదు. జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఎవరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీనికి కారణం ఏమిటి ? ఏమిటంటే …

Read More »

రెడ్ బుక్ తో బెదిరిస్తున్నారట…లోకేష్ పై పిటిషన్

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు తాజాగా దాఖలు చేసిన పిటిషన్ సంచలనం రేపుతోంది. లోకేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో లోకేష్ పై చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులు కోరారు. ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీసు నిబంధనలను …

Read More »

వైసీపీని ఓడించాలంటే రూ.కోట్లు పెట్టాల్సిందేనంటున్న బాబు

అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న మొండి పట్టుదలతో వైసీపీ.. అధికారంలోకి రాకపోతే భవిష్యత్ ఉండదనే భయంతో టీడీపీ.. వచ్చే ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి ఎన్నికల్లో గెలిచేందుకు ఏమైనా చేస్తుందన్న సంగతి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలియంది కాదు. వైసీపీ వరుసగా రెండో సారి ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు వేల కోట్ల రూపాయాలు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడదు. ఈ విషయం తెలిసే …

Read More »

మళ్లీ బండికే హ్యాండిల్?

బీజేపీ అధిష్ఠానానికి తప్పు తెలుసొచ్చింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు పార్టీకి ఎంతటి నష్టం చేసిందో ఇప్పుడు అర్థమైనట్లుంది. జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాల కోసం ఇక్కడ కేసీఆర్ కు అనుకూలంగా ఉండేందుకు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చబోతోంది. మళ్లీ తెలంగాణ పగ్గాలు బండి సంజయ్ కే అందించేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమైందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. తెలంగాణలో బీజేపీ పరిస్థితి నామమాత్రంగానే …

Read More »

ప‌వ‌న్‌తో డైరెక్టుగా మాట్లాడొచ్చుగా జోగ‌య్య గారు…!

కాపు సంక్షేమ సేన పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని.. కాపుల అభ్యున్న‌తి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌ని ప్ర‌క‌టిస్తున్న మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగయ్య‌.. తాజాగా సంధించిన లేఖ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-టీడీపీ క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. ముఖ్య‌మంత్రి సీటు విష‌యం చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే, త‌న‌కు ప‌దవుల‌పై కాంక్ష లేద‌ని.. జ‌న‌సేనాని ప‌దే ప‌దే చెబుతున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను కార్న‌ర్ చేస్తూ.. …

Read More »