వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం దక్కించుకునేందుకు శతథా ప్రయత్నాలు చేస్తున్న సీఎం, వైసీపీ అధినేత జగన్.. ఆదిశగా మరో కీలక అడుగు వేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని తన భుజాలపైనే వేసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీకి ప్రత్యేకంగా స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఎవరూ లేరు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున జగన్ సోదరి షర్మిల, మాతృమూర్తి విజయమ్మలు ప్రచారం చేశారు. కానీ, వీరిద్దరూ ఇప్పుడు దూరంగా ఉన్నారు.
పోనీ.. సినీరంగం నుంచి ఎవరైనా ఉన్నారా? అంటే.. వారు కూడా లేరు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ప్రచారం నుంచి పార్టీని నడిపించే వరకు అంతా జగనే బాధ్యత తీసుకోనున్నారు. ఇప్పటికే ఆయన సిద్ధం పేరుతో సభలు ప్రారంభింఆచరు. ఈసభల్లో వేరే వారిని ఎవరినీ కూడా కీలక ప్రసంగాలు చేయించడం లేదు. పైగా సభపై కూడా ఎక్కువ మందిని కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే.. జగన్ సెంట్రిక్‌గానే వైసీపీ అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు.. పక్కా వ్యూహంతో కదలాలని.. తాడేపల్లి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు హెలికాప్టర్లను ఒక్కొక్క దాన్నీ.. రెండేసి కొట్ల చొప్పున లీజుకు తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తే.. హెలికాప్టర్లకు.. డిమాండ్ పెరిగిపోతుంది. పైగా సార్వత్రిక ఎన్నికలు కావడంతో దాదాపు ప్రదాన పార్టీ నాయకులు హెలికాప్టర్ల ద్వారానే సుడిగాలి పర్యటనలు చేసి.. పార్టీల తరఫున ప్రచారం చేస్తారు.
తెలంగాణలో జరిగిన ఎన్నికల సమయంలోనూ.. ఇదే విషయం చర్చకు వచ్చింది. గంటల లెక్కలో లక్షల రూపాయలు హెలిక్టప్టర్ల కంపెనీలు వసూలు చేశాయి. పైగా.. ఇంత సొమ్ము ఇస్తామన్నా.. కూడా కొరత ఏర్పడింది. దీనిని ముందుగానే గ్రహించిన సీఎం జగన్. ఇప్పటికే.. రెండు హెలికాప్టర్లకు.. ఆర్డర్లు ఇచ్చినట్టు సమాచారం. వీటిలో ఒకటి విజయవాడ విమానాశ్రయంలో ఉంటుంది. అవసరం మేరకు.. ఇది.. కోస్తా.. సీమల్లో సీఎం జగన్ పర్యటనకు వినియోగిస్తారు. ఇక, రెండోది.. రాజమండ్రి , విశాఖల మధ్య ఉంటుంది. ఇది .. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటనకు వినియోగించనున్నారు. ఇది.. సంగతి!