వైసీపీకి రాజీనామా చేసి.. అవసరమైతే.. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై కూడా పోరాటం చేస్తానని చెప్పిన మంగ ళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన కాంగ్రెస్ లో చేరతానని.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలోతన భాగస్వామ్యం కూడా ఉంటుందని పేర్కొన్నా రు. అంతేకాదు..వైఎస్ షర్మిల వెంటే తాను కూడా నడుస్తానని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. షర్మిల సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఇంత వరకు బాగానే జరిగినా.. తర్వాత అనూహ్యంగా పట్టుమని 15 రోజులు కూడా గడవకమేందు.. ఆళ్ల తిరిగి వైసీపీ చెంతకు చేరిపోయారు. జగన్ సమక్షంలో ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అంతేకాదు.. మంగళగిరిలో తనకు టికెట్ ఇవ్వకపోయినా ఫర్వాలేదని.. మంగళగిరిలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా పొన్నూరులోనూ పార్టీ బలోపేతం అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. కట్ చేస్తే.. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదు.
అయితే.. తాజాగా ఆళ్ల వెడలిపోయిన వ్యవహారంపై కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ షర్మిల రియాక్ట్ అయ్యారు. తాజాగా విజయవాడలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ ప్లేస్ అని వ్యాఖ్యానించారు. ‘‘ఆర్.కే అన్నతో నాకు ఉన్న అనుబంధం వేరు. ఆయన ఎన్ని ఒత్తిడులు ఉంటే పార్టీ మారారో నాకు తెలు సు. హీ ఈజ్ రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ ప్లేస్. రామకృష్ణకు నాకు రాజకీయాలు లేవు.. నా మనస్సుకి దగ్గరైన వ్యక్తి రామకృష్ణ.. రాజకీయంగా కారణాలు లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి. వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని చెప్పే అవసరం నాకు లేదు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఈ ఘటన ముగిసిందని.. అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates